Wednesday, February 18, 2026

Creating liberating content

తాజా వార్తలులండన్ చేరుకున్న సీఎం జగన్..

లండన్ చేరుకున్న సీఎం జగన్..

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత రాత్రి కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో విదేశీ పర్యటనకు బయల్దేరిన సంగతి తెలిసిందే. ఆయన ఇవాళ లండన్ చేరుకున్నారు. ఉన్నత విద్య కోసం సీఎం జగన్ ఇద్దరు కుమార్తెలు లండన్ లో ఉంటున్నారు. ఏపీలో పోలింగ్ పూర్తి కావడంతో సీఎం జగన్ లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. తిరిగి ఈ నెల 31న ఆయన ఏపీకి రానున్నారు. ఇదిలావుంచితే, ఏపీలో వైసీపీ గెలుపు ఖాయం అంటూ ఆ పార్టీ సోషల్ మీడియాలో ఉత్సాహం ప్రదర్శిస్తోంది. సీఎం జగన్ రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా జూన్ 9న విశాఖలో ప్రమాణస్వీకారం చేస్తారని, సంబరాలకు సిద్ధం అవ్వండి అంటూ శ్రేణులకు పిలుపునిచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article