తాజా వార్తలువారణాసిలో భయానక పరిస్థితులున్నాయి: స్వామి అవిముక్తేశ్వరానంద

వారణాసిలో భయానక పరిస్థితులున్నాయి: స్వామి అవిముక్తేశ్వరానంద

వారణాసి లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలనుకున్న వారిని వారణాసి మేయర్ బెదిరిస్తున్నారని జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీకి పోటీగా ఎవరూ ఉండకుండా కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.నామినేషన్ వేసిన వారిని భయబ్రాంతులకు గురిచేస్తూ పోటీ నుంచి తప్పుకునేలా చేస్తున్నారని మండిపడ్డారు. అర్ధరాత్రి వేళ అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి తలుపుకొట్టి భయపెడుతున్నారని, వారణాసిలో ప్రస్తుతం భయానక పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. ఇవన్నీ చూస్తుంటే దేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అన్న అనుమానం కలుగుతోందని వాపోయారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article