జగనన్న ,అవినాష్ అన్న కోసం మేము సిద్ధం
పులివెందుల
పులివెందుల పట్టణంలో ఎంపీ అవినాష్ రెడ్డి నిర్వ హిస్తున్న బహిరంగ సభకు భారీ సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించారు. డి ఎస్ ఆర్ యువసేన అధ్యక్షుడు డేని, గజ్జల ఆది యువసేన, రాజేష్ యువసేన, రమేష్ నాయుడు యువసేన, మరక యువసేన, హఫీజ్ యువసేన పార్నపల్లి కిషోర్ యువసేనల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. జై జగనన్న,జై అవినాష్ అన్న అంటూ జెండాలు చేతబట్టి కేరింతలు కొడు తూ పట్టణంలో చక్కర్లు కొట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యే గా, అవినాష్ రెడ్డిని ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించడమే లక్ష్మన్నారు. వారిని గెలిపించేందుకు మేము సిద్ధమంటూ వారు కేరింతలు కొట్టారు.


