పులివెందుల
పులివెందుల పట్టణంలోని 26వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీ ప్రసన్న, పద్మనాభ రెడ్డి సచివాలయ కన్వీనర్లు ల ఆధ్వర్యంలో వార్డులో ప్రజలకు ఈవీఎం ల గురించి అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఈవీఎంలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఒకటవ నెంబర్ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని సూచించారు. ఒకటో నంబరు నొక్కిన తర్వాత బీఫ్ అనే శబ్దం వచ్చినప్పుడు మీ ఓటు కన్ఫామ్ అయినట్టు అని వారికి తెలియజేశారు. అలాగే 21వ వార్డు కౌన్సిలర్ కోడి రమణ ఆధ్వర్యం లో వార్డులోని ప్రజలకు అవగాహన కల్పించారు. 28వ వార్డు కౌన్సిలర్ గుల్జార్ వార్డు ప్రజలకు ఈవీఎం ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 13వ తేదీ జరిగే ఎన్నికలలో మేము ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసేందుకు సిద్ధమంటూ మీరు సిద్ధంగా ఉండాలని ప్రజలకు తెలిపారు. ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేసి జగన్మో హన్ రెడ్డిని అవినాష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలి పించాలని వార్డులోని ప్రజలను కోరారు. మహిళ విభాగ ప్రధాన కార్యదర్శి రాజేశ్వరి శ్రీరాములు ఇంటింటికి వెళ్లి ఈవీఎంలతో అవగాహన కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ గంగాధర్ రెడ్డి, జే సి ఎస్ ఇన్చార్జులు పార్నపల్లె కిషోర్, చంద్రమౌళి, బూత్ కమిటీ మెంబర్లు లక్ష్మీనారాయణ ,చంద్ర, అజయ్ , వీరారెడ్డి, బాబావలి, మస్తాన్, తదితరులు పాల్గొన్నారు.


