పోరుమామిళ్ల:శనివారం విజయవాడ బస్సు యాత్రలోముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన జరిగిన దాడి దుర్మార్గపు చర్యని ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిద్ధం సభలు విజయవంతమైన తర్వాత బస్సు యాత్రలో ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతూ జన సముద్రాన్ని తలపిస్తూ వైయస్సార్ పార్టీ మళ్లీ రెండవసారి అధికారంలోకి వస్తుందని తెలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై హత్యాయత్నం జరిగిందని కొద్దిలో ప్రమాదం తప్పిందని కంటికి పై భాగంలో బలంగా రాయితో షూట్ చేయడం జరిగిందని అదే కంటి భాగంలో గాని లేక కర్త భాగంలో కానీ తగిలి ఉంటే ప్రాణానికి హాని జరిగి ఉండేదని ఇది ఉద్దేశపూర్వకంగానే చేసిన పనిని దేవుని దయ ప్రజల ఆశీస్సులు ఉన్నందునే జగనన్న మళ్లీ మనకు దక్కారని లేకుంటే ఘోరం జరిగిపోయి ఉండేదని కావున జగనన్న మళ్లీ ఇటువంటి ప్రమాదాలు రాకుండా ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ గట్టి భద్రత ఏర్పాట్లు చేయాలని జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని జగనన్నకు ఏదన్నా జరిగితే రాష్ట్రంలో శాంతి భద్రతలు విగాథం కలుగుతుందని ఇప్పుడు ఎల్లో మీడియా ఎల్లో పత్రికల్లో లోకేష్ బాబు ట్విట్టర్లో ఆ రాయి తాడేపల్లి హౌస్ నుంచి వచ్చిందని హేళనగా మాట్లాడటం మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు అవహేళన గా మాట్లాడడం చూస్తుంటే ఇది తెలుగుదేశం పార్టీ వారే చేసినట్లుగా స్పష్టమవుతున్నదని కావున పోలీస్ శాఖ దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వయిరీ చేసి దోషులను పట్టుకొని శిక్షించాలని మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకులు ఈ సంఘటనను ఖండించడం జరిగిందని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నిన్న జరిగిన సంఘటనకు ఆందోళన పడుతున్నారని అయినా అన్నారు.