తాజా వార్తలుమాగంటితో ముద్రగడ భేటీ

మాగంటితో ముద్రగడ భేటీ

ఏలూరు : తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ మాగంటి బాబు నివాసానికి కాపు ఉద్యమ నేత ముద్రగడం పద్మనాభం వెళ్లారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించారు. ఈ సమావేశం గురించి మాగంటి బాబు మట్లాడుతూ… ముద్రగడ పద్మనాభం తమకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పారు. ఆయనతో తనకు ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. తాము కాంగ్రెస్ లో పని చేశామని, ఆ తర్వాత టీడీపీలో ఉన్నామని, పదవులు అనుభవించామని చెప్పారు. టీడీపీలోకి వచ్చినా పర్వాలేదు, టీడీపీ జనసేన కలిసి ఉన్నాయి కాబట్టి జనసేనలో చేరినా పర్వాలేదని ముద్రగడకు తాను చెప్పానని… వపన్ కల్యాణ్ ని కలుస్తున్నానని, జనసేనలో చేరుతానని ఆయన తనకు చెప్పారని తెలిపారు.
టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి వస్తే తామంతా కలిసి పని చేస్తామని మాగంటి బాబు చెప్పారు. వైసీపీ తనను మోసం చేసిందని… రాజ్యసభ ఇస్తామని అన్నారని… వందల కోట్లు మనలాంటి వాళ్ల దగ్గర ఎక్కడుంటాయని ముద్రగడ చెప్పారని అన్నారు. వైసీపీలోకి వెళ్తే అమ్ముడుపోయానని అంటారని… ఇప్పటికే తనకొక గాయం తగిలిందని, ఆ గాయం మానేంత వరకు జనసేనలో ఉంటానని చెప్పారని తెలిపారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article