టాప్ న్యూస్శభాష్ ఎమ్మెల్యే మిరియాల శిరీషమ్మ...!

శభాష్ ఎమ్మెల్యే మిరియాల శిరీషమ్మ…!

కార్యకర్తలపై కారాలు మిరియాలు నూరిన ఎమ్మెల్యే శిరీషా దేవి
*ప్రజాప్రతినిధురాలంటే ఇలాగే ఉండాలా…
*ఓటు వేసి వేయించినందుకు వాయినాలు పుచ్చుకోవాలా…
*పిర్యాదు చేస్తే పచ్చి బూతుల పడాలా…
*తిడితే పడడానికి వారు అంగన్వాడీ పిల్లలు కాదుగా మేడం గారు ..?
*తప్పు చేయనప్పుడు తడబాటు ఏల మేడం గారు…
*అసలే అంపశయ్యపై భవిష్యత్ ఆశలు ఉన్నాయంటుంటే…
*అలా తిడితే ఎలా పడి ఉంటారనుకొన్నారమ్మా….
*అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారుగా…
*అప్పుడు నష్టపోయేది అధిష్టానమే గా. .
*చంద్రన్న ఏమిటన్న ఈ విధానం…
*లోకేషన్న లోకం తీరు మారిందన్నో…
*మాలోకాలు ఎవరూ లేరన్నో…
*అర్ధభాగం అవ్వలేదు అప్పుడే అంత చులకనగా ఉంటీ….
*పూర్తి భాగం ముగిసే సరికి….!
*శిరీషమ్మ ఆ చిందులు చెల్లుబాటు కావమ్మ….
(రామమోహన్ రెడ్డి)
“అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా.. స్వర్ణోత్సవాలు చేద్దామా…ఆత్మవినాశపు అరాజకాన్నే స్వరాజ్యమందామా… దానికి సలాము చేద్దామా…శాంతికపోతపు కుత్తుక తెంచి ఇచ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం..నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా….. ఓ పవిత్ర భారతమా !
వేకువ వైపా చీకటి లోకా ఎటు నడిపేరమ్మా !…
గతి తోచని భారతమా….!!యుద్ధనినాదపు అరాజకాన్నే స్వరాజ్యమందామా… దానికి సలాము చేద్దామా…”
పదవుల కోసం పాకులాడే నాయకుల స్వార్థ రాజకీయాల మధ్య నలుగుతున్న ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తూ సాగే ఈ గీతం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది
ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ రోజు రాష్ట్రం లో కూటమి ప్రభుత్వంకు అనేక తలనొప్పులుగా తయారు అవుతున్న ఎమ్మెల్యేల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందడడమే కారణమని చెప్పాలి.గత ముప్పై నెలలు గా కూటమి లో టీడీపీ ఎమ్మెల్యేలలో కొంతమంది ఎమ్మెల్యేలు తీరు పై అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టిన వెంటనే మరో ఎమ్మెల్యే వివాస్పద అంశాలలతో తెరమీదికి రావడం ఇటీవల కాలంలో అనేకం చోటుచేసుకోవడం టీడీపీ అధినాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారుతుందన్న అంతర్గత విమర్శలు లేకపోలేదు. ప్రతిపక్ష పార్టీ కి ఎమ్మెల్యే ల సంఖ్యా బలం లేకపోయినా ప్రజా బాహుళ్యామ్ లో అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాలు,ప్రధాన మీడియా ల ద్వారా ప్రభుత్వాన్ని ఇరకాటం లో పెట్టే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో కొత్తగా జిల్లా ఏర్పడి అది కూడా ఒకే ఒక నియోజవర్గం , అభివృద్ధి కి ఆమడ దూరంలో ,ఎక్కువ అటవీ ప్రాంతం గిరిజన ప్రాంతాలు కలిగి ఉన్న రంపచోడవరం కు మొదటి సారి ఒక అంగన్వాడీ టీచర్ నుంచి శాసన సభ్యురాలుగా ఎన్నికై కేవలం 30 నెలలు అవ్వగానే ఆమె అదే నియోజక వర్గానికి చెందిన సొంత పార్టీ కార్యకర్తలపై బహిరంగ సభలో నోరుజారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రధానంగా చర్చకు దారి తీస్తున్నాయి.
ప్రస్తుత శాసన సభ్యురాలు మిరియాల శిరీషా దేవి ఎనిమిదేళ్ల అంగన్‌వాడీ టీచర్‌గా పని చేసి 2023 డిసెంబర్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసి తన భర్త మఠం విజయ్ భాస్కర్ అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో రంపచోడవరంనియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మిపై 9,139 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.అయితే ఆమె మీద అదే పార్టీ అదే నియోజక వర్గం నుంచి కొందరు కార్యకర్తలు పార్టీ హైకమాండ్ కు అంటే పార్టీ కేంద్ర కార్యాలయం లో పిర్యాదు చేయడం జరిగింది,ఆ పిర్యాదు ఏమిటయ్యా అంటే వైసిపి సానుభూతి పరులుకు ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి పనులు చేసి పెడుతుందని.దానిపై భగ్గుమన్న ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి ప్రజా బాహుళ్యంలో ఒరేయ్,తోలు తీస్తా , తాట తీస్తా అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం అటు పార్టీ హైకమాండ్ ,ఇటు టీడీపీ క్యాడర్ కూడా జీర్ణించుకోలేక పోతున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి.
సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న సూక్తి ఆనాదిగా ఉంది.ఎన్నికలప్పుడు ఇదే కార్య కర్తలకు ప్రజలకు రాజకీయ నాయకులు కొట్టే సలామ్ లు ,వారు చూపించే కపట ప్రేమ,ఎనలేని అభిమానం ఓటు అనే ప్రక్రియ ముగిసి గెలుపు గుర్రం ఎక్కగానే అదే ప్రజలు ,అదే కార్యకర్తలు ఎమ్మెల్యే ల కోసం పడిగాపులు కాయల్సిన దుస్థితి ఈ నాటికి లేకపోలేదు.అధికారం శాశ్వితం కాదు ప్రజలే శాశ్వితం ప్రజా తీర్పు లోబడి ఉండాలని కట్టుబడి ఉన్నవారే నాటికి నేటికి శాసన సభలో కూర్చో గలుగుతున్నారు.కొందరు ఏరు దాటక తెప్ప తగలేసినట్లు,: “నడమంత్రపు సిరి వస్తే రాత్రి గొడుగు పట్టమన్నాట్ట” అన్న చందంగా అంటే కష్టపడకుండా మధ్యలో అకస్మాత్తుగా వచ్చిన ఐశ్వర్యం లేదా సంపద వల్ల సామాన్య కార్య కర్తను విస్మరిస్తే వచ్చే అనర్థాలు వేరుగా ఉంటాయన్నది లోకోత్తర ధర్మం.
అయితే ఇక్కడ ఈ ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి సామాన్య కార్యకర్త లను చాలా అవహేళనగా మాట్లాడటం అనేది ప్రజాస్వామ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో మంచి పద్ధతి కాదనే విమర్శలు గుప్పుమంటున్నాయి. వాస్తవంగా ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి భర్త మఠం విజయకుమార్ పై ఆ జిల్లాలో అనేక రకాల విమర్శలు తలెత్తుతున్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.బార్య అధికారం అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష పార్టీ నేతలతో పలు రకాల వ్యాపారాలు చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.అయితే ఇక్కడ ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి ఆ సమావేశం లో కార్యకర్తపై నో రుపారేసుకోవడం లో. సచివాలయ ఉద్యోగి అయిన ఓ వ్యక్తి తనతో దిగిన ఫోటోను వాట్సప్ స్టేటస్ పెట్టడం అది స్క్రీన్ షాట్ తీసి పార్టీ హైకమాండ్ కు పిర్యాదు చేయడం జరిగిందని ఆమె అనడం జరిగింది.ఒక ఎమ్మెల్యే తో. అనేక మంది వ్యక్తులు అభిమానంతో ఫోటోలు దిగడం సాధారణమే.అయితే దానికే ఇలా రచ్చ అవ్వడం అంటే అది వినడానికి కూడా హాస్యాస్పదంగా ఉంటుందని కాదు పలువురు మేధావులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.అయితే సహజంగా ప్రస్తుత ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి అంగన్వాడీ టీచర్ కాబట్టి. బహుశా పిల్లలను క్రమశిక్షణ లో పెట్టేందుకు కూడా ఇలా అంటూ ఉండడం సహజం.అలానే ఆమె ఈ కార్యకర్తలను కూడ గురు స్థానం లో ఉండి అలా మందలింపు చేసి ఉండచ్చన్న భిన్నమైన వాదన కూడా వినిపిస్తోంది.ఏది ఏమైనప్పటికీ ప్రజా క్షేత్రంలో ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు కాబట్టి ఇలా నోరు పారేసుకోవడం సరైన పద్దతి కాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు,యువనేత నారా లోకేష్ లు పార్టీ క్రమశిక్షణ కార్యక్రమంలో భాగంగా యువ నాయకత్వ తీరుపై ప్రత్యేక శ్రద్ధ చూపక పోతే పార్టీ కి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం తెచ్చిపెడుతుందనేది రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article