టాప్ న్యూస్ముందే చెప్పిన ప్రజాభూమి...

ముందే చెప్పిన ప్రజాభూమి…

*గొంతెత్తి మొత్తుకొంటోంది ప్రజాభూమి…
*సమాచార శాఖ అవినీతి బాగోతం పై…
*నచ్చితే నజరానాలు..
నచ్చక పోతే జరిమానాలు
*ఇందులో నచ్చడం …నచ్చకపోవడం అంటే…
*భజన చేస్తే ప్రజాధనం వృథాగా ఇవ్వచ్చు…
*భజన చేయక పోతే బారీ మూల్యం చెల్లించుకోవాలా…
*భజనలు ప్రభుత్వానికి చేయాలి…పౌరసంబంధాల శాఖకు చేయాలి…

  • అందుకే అడిషనల్ డైరెక్టర్ స్వర్ణలత ఇంచార్జి ప్రస్తానం స్వర్ణమయం అయ్యిందా..
  • ఎంప్యానల్మెంట్ అనే నిబంధన దేనికోసం…
  • జీవో లుండేది జేబుల్లో పెట్టుకోవడానికేనా..
  • ఐ ఏఎస్ లు కూడా అయ్యో అని అంటున్నారంటే …
  • సమాచార శాఖ లో వైసిపి సానుభూతి పరులు ఉన్నారనేది…?
  • కూటమి ప్రభుత్వంకు చెడ్డపేరు తెస్తున్నదెవరు..
  • ఇంచార్జి పాలనలతో ప్రభుత్వం అప్రదిష్ట పాలు చేసే అవకాశం లేదని అంటారా…
  • స్వర్ణలత హయాంలో అక్రమాలు జరిగాయని అంటున్నా ఆలకించేవారేవరు…!
  • పబ్లిషర్ చనిపోయిన పట్టక పోయే..
  • కాగితాల్లో ఒకటి అమలులో ఇంకొకటి ఉన్నా పట్టక పోయే..
  • లోపాలెత్తి చూపితే పాపాలకు ఒడిగడుతూ…
    *బ్రోకర్ల ద్వారా వస్తేనే బోలెడు పనులు చేస్తూ…
  • అవినీతి బాగోతం బట్టబయలు అవుతున్నా చర్యలు లేవంటే…
  • లంచాల కోసం లాలూచీ పనులు చేస్తున్నారంటున్నా…
  • నాటి అవినీతి బాగోతం పై నమోదు చేసిన కేసులమయ్యాయో…
  • నేటి అవినీతి బాగోతం పై తీసుకుంటున్న చర్యలేమిటి…
  • సమాచార శాఖ ప్రక్షాళన చేసే దమ్ము లేనట్లేనా…
    (రామమోహన్ రెడ్డి)
    “నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
    అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
    మారదు లోకం మారదు కాలం
    దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
    మారదు లోకం మారదు కాలం”అని సిరివెన్నెల సీతారామశాస్త్రి మూడు దశాబ్దాల క్రితమే ఈ లోకం పోకడపై వెలిగెత్తి చెబితే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన పిదప భారత దేశ ఆర్థిక,రాజకీయ పార్టీ ల విధానాలు, అధికారుల తీరు తెన్నులతో విసిగి వేసారి పోయిన ప్రజలు ఒక నాటి ఆంగ్లేయుల పాలన ను గుర్తుకు తెచ్చుకుంటారని చక్రవర్తి రాజగోపాలాచారి ఆనాడే చెప్పడం జరిగింది నేటి ఈ రాజకీయ నాయకుల తీరు తెన్నులు అధికారుల అవినీతి అడ్డగోలు విధానాలు,అక్రమార్కుల అవినీతి పరుల బాగోతం , కులం మతం ముసుగు వేసుకుని పైకి సుద్ద పూసల్లా ఉండే వారి తీరు తెన్నుల గురించి. సరిగ్గా నేడు అదే జరుగుతున్నా మళ్ళీ పరాయి పాలకులు వచ్చి పాలించమని అడగలేము స్వపాలకుల తీరు మార్పు కోసం మౌన దీక్ష చేస్తూ మనోవేదన చెందాల్సిన పరిస్థితి తప్పదని అనుకోవడమే అత్యుత్తమ మార్గమని అనుకోవాలి.
    ఎందుకయ్యా ఈ ఉపోద్ఘాతం అంటే అందుకు కారణాలు లేక పోలేదు.ఈ సమాజానికి నాలుగో స్తంభముగా చరిత్ర పుటల్లో లిఖించబడిన మీడియా వ్యవస్థ మిగిలిన మూడు స్తంభాల లో న్యాయ వ్యవస్థ మిగిలిన రెండు వ్యవస్థల పాదాల కింద అనగద్రొక్కబడుతూనే ఉన్న కారణంగా ఊసరవెల్లి లాగా ఉన్న సంపాదకులకు కావచ్చు,సంపాదన పరులకు కావచ్చు , చెంచాగిరి చేసే వారికి కావచ్చు వారు వారు చెలామణి అవుతున్న తీరు చూస్తుంటే ఈ వ్యవస్థల తీరు మార్పు సాధ్యం కాదా అన్న ఆవేదన అనేక మంది వ్యక్తుల ద్వారా వెల్లడి అవుతోంది.
    ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే…

సమాచార, పౌర సంబంధాల శాఖ అనేది ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేసే ఒక కీలకమైన ప్రభుత్వ శాఖ.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలసీలు మరియు నిర్ణయాలను ప్రజలకు చేరవేయడం ఈ శాఖ ముఖ్య ఉద్దేశం.ఈ శాఖ ప్రధాన విధులు ప్రభుత్వ పథకాలను వార్తాపత్రికలు, టెలివిజన్, రేడియో మరియు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడం.ప్రభుత్వ అధికారిక నిర్ణయాలు, మంత్రుల పర్యటనలు, ప్రకటనలను మీడియాకు విడుదల చేయడం. ప్రభుత్వంపై ప్రజల స్పందనను, అభిప్రాయాలను తెలుసుకొని ప్రభుత్వానికి నివేదించడం.ప్రభుత్వ విధానాలపై ప్రజల నుంచి వచ్చే స్పందనలను ఉన్నతాధికారులకు చేరవేయడం.కానీ ఈ శాఖ తమ విధులలో వారికి అవసరమైన అన్ని చేస్తూ ప్రజల నుంచే వచ్చే పిర్యాదులు, స్పందనల లో అనుకూలమైనవి మాత్రమే ప్రభుత్వం దృష్టికి తీసుక వెళ్తూ ప్రతికూల విషయాలను పక్కాగా ప్రక్కన పెట్టేస్తూ ఆ ప్రతికూల విషయాలను తెలియపరుస్తున్న వారిపై పగబట్టి ప్రత్యక్షంగా కక్ష్య సాధింపు దిగడం లో సందేహం అక్కర్లేదు అని చెప్పే పరిస్థితి దాపురించింది.ఇందులో జోన్ 2 ఆర్జేడీ ఉండి అడిషనల్ డైరెక్టర్ ఇంచార్జి గా బాధ్యతలు వెలగబెట్టిన మేడం స్వర్ణలత పరిపాలనలో అక్రమార్కుల కు ,నీతి నిజాయితీ , నిబద్దత అనేవి ఇలా కూడా ఉంటాయా అని మేడం స్వర్ణలత స్వర్ణయుగం లో చూడడం జరిగిందని చెప్పడంలో తప్పేమి కాదనే భావన వ్యక్తం అవుతోంది. ఎందుకంటే ప్రభుత్వం పత్రికల కు సంబంధించి విధాన పరమైన నిర్ణయాల కోసం జీవో 642 ద్వారా మీడియా వ్యవస్థ కు ఏంఫ్యానల్మెంట్ ప్రక్రియ కోసం రూప కల్పన చేయడం జరిగింది.కానీ మేడం స్వర్ణలత పరిపాలనలో అక్రమార్కుల కు పెద్దపీట వేయడానికి ఏ ప్రభుత్వ జీవో అడ్డులేకుండా పోయింది.
ఇదంతా ముగిసిన అధ్యాయం అయినప్పటికీ. నేడు కూటమి ప్రభుత్వంకు చెడ్డపేరు తెస్తున్న డీఎస్సీ పరీక్షల వ్యవహారం లో రోజుకో మలుపు తిరుగుతున్న సందర్భంగా మీడియా పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బట్టి సమాచార శాఖ లో ఉన్న నేటి డైరెక్టర్ మినహా కింది స్థాయి అధికార యంత్రాంగం ప్రవర్తించిన తీరు తీవ్ర అక్షేపనియమని చెప్పక తప్పడం లేదు.కూటమి ప్రభుత్వంకు వ్యతిరేకంగా ప్రసారం చేస్తున్న కొన్ని పత్రికలు,ఛానెళ్ల ను బ్లాక్ లిస్ట్ లో పెట్టడంతో పాటు ఇదే ప్రభుత్వం లో వైసీపీ సానుభూతి పరులు ఉన్నారనే ప్రభుత్వ వాదన కు కొంత వాస్తవం లేక పోలేదు.
ఏ ప్రభుత్వం అయినా తమకు అనుకూలంగా ఉంటే ఓ విధంగా ప్రతికూలంగా ఉంటే మరో విధంగా ఉండబోతుందనేది నిత్య సత్యంగా నిలుస్తుంది.గత ఏడాది ఏప్రిల్ నెలలో ఓ ప్రత్యేక జీవో 666 ఇచ్చి అన్ని లక్షల ప్రజా ధనాన్ని కట్టబెట్టినప్పుడు ఇదే ప్రభుత్వం ఇదే అధికార యంత్రాంగం ఉంది.అప్పుడు అంతా అనుకూలం అయినప్పుడు ఏ నిబంధనలు అమలు చేయాలని అనేది లేకుండానే అంతా జరిగిపోయింది.ఇప్పుడే అదే మీడియా స్వామి భక్తి చూపక పోవడం భజన చేయకపోవడం తో బారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.అంటే ఇక్కడ విధాన పరమైన నిర్ణయాలు నీటి నిజాయితి, నిబద్దత అన్నది చెప్పుకోవడానికి తప్ప ఆచరణ సాధ్యం కాదని అర్థమవుతోంది.
ఇలాంటి సమయంలోనే మేడం స్వర్ణలత పరిపాలన గురించి చెప్పాల్సిన అవసరం ఎంతయినా ఉంది.ఎందుకంటే ఒక పత్రిక ఎంప్యానల్మెంట్ చేయాలంటే కేవలం పద్దేనిమిది నెలల పేపర్స్ అవి జిరాక్స్ అయినా పర్వాలేదు ,ప్రింటింగ్ ప్రెస్ లు పిఆర్జిఐ రికార్డుల లో ఒకటి ఇచే కాగితాలు ఇంకొకటి ,పత్రిక నడిపే పబ్లిషర్ ,ఎడిటర్ చనిపోయినా ఆపేరు ఆన్లైన్ రికార్డులలో ఉన్నా పర్వాలేదు. మేడం స్వర్ణలత కు సలాం కొట్టిన వారికి ఎంప్యానల్మెంట్ నిబంధనలు ఏమాత్రం పాటించక పోయినా ప్రజాధనాన్ని కట్టబెట్టేందుకు అనుమతులు ఇవ్వడానికి పదవి విరమణ కు కేవలం కొన్ని గంటల్లో ఆమోద ముద్ర వేసి ఇస్తే వాటికి మాత్రమే అన్ని ఉన్నట్లు ఈ అవినీతి అధికార వ్యవస్థ ఐఏఎస్ అధికారులను కూడా తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేయడానికి ఏ మాత్రం వెనుకాడ బోరన్నది యదార్థ వాదన.ఉన్నతాధికారులు కేవలం వారికి వచ్చిన తుది నివేదికల ఆధారంగా నిర్ణయాలు తీసుకొంటారే తప్ప కింది స్థాయిలో నీతి గా చేశారా అవినీతి కి పాల్పడ్డారా అన్నది తెలియని ప్రశ్న.
అయితే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ తీవ్ర దుమారం రేపుతోంది సోషియల్ మీడియాలో. డీఎస్సీ పరీక్షల నిర్వహణ విషయంలో యువ నేత,భావి ముఖ్యమంత్రి ,విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బదనామ్ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశ్యంతో ఉందని చెప్పాలి.కింది స్థాయి అధికారుల తప్పిదాలు ఉన్నతాధికారుల దృష్టి కి రాకపోతే ముఖ్యమంత్రి గాని,మంత్రి గానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆశించడం తప్పే అవుతుందనేది యదార్థం.అయితే ఇక్కడ మీడియా వ్యవస్థ ను రాజకీయ నాయకులు వారి వారి సొంత కర పత్రాలుగా మార్చుకుని వ్యక్తిత్వ హాననానికి కూడా పాల్పపడుతుండడంతో ఏది నిజం ఏది అబద్ధం అనేది జర్నలిజం లో కూడా నిర్ధారణ అయ్యే పరిస్థితి లేకుండా పోయింది.
ఒక వేళ నిజంగా ఆధారసహిత కథనాలు, పిర్యాదులు ఇస్తే వాటికి ఏదో ఒకటి ఆపాదించి ఆ వ్యక్తుల మీద ఎదురు దాడి చేసే విష సంస్కృతి కూడా ఉంది. ఉదాహరణ కు ప్రస్తుత సమాచార శాఖ డైరెక్టర్ మంచి మృదు స్వభావి.ఆలోచనా పరుడు.అయితే ఆయన వరకు సత్యాన్ని చేరకుండా కింది స్థాయి అధికారులు చేస్తారు . ఎవరైతే ఈ అవినీతి అధికార యంత్రాంగానికి, వీరు నియమించుకున్న బ్రోకర్ల ద్వారా పనులు చేయించు కోకుండా నేరుగా వెళ్తారో వారి పనులు పూర్తిగా ప్రక్కన పెట్టి వారు డైరెక్టర్ కు వీరి అవినీతి బాగోతం బట్టబయలు చేస్తారని అనుకుని ఒకడుగు ముందుకు వేసి డైరెక్టర్ కు తప్పుడు సంకేతాలు,కులం మతం,జాతి,పార్టీ రంగులు ఇలా పులిమి వీరి తప్పులను కప్పి పుచ్చుకోవడం పరిపాటిగా మారుతుంది.ఇందుకు అనేక సాక్ష్యాలు డైరెక్టర్ దృష్టికి తీసుక వెళ్లగా ఆయన విస్తుపోవడం ఆయన వంతయింది. అలాగే ఐఎఎస్ లను కూడా బురిడి కొట్టించి తమ అవినీతి బాగోతం బట్టబయలు కాకుండా చేసుకోగల నేర్పరులు చాలా మంది సమాచార శాఖ లో ఉండబట్టే హైకోర్టు, లోకాయుక్త లను ఆశ్రయించాల్సిన దౌర్భాగ్య పరిస్థితి దాపురించింది. వాస్తవ విషయాలు తెలుసుకుని చర్యలు చేపట్టాలంటే విజిలెన్స్ లేదా ఏసీబీ అధికారుల చేత నిస్పక్ష పాత విచారణ జరిపిస్తే ఈ అవినీతి అధికార యంత్రాంగం ప్రవర్తించిన తీరు అట్లే బట్టబయలు అవుతుందనేది జగమెరిగిన సత్యం.అప్పుడు ఏ పార్టీ కి ఎవరు సానుభూతి పరులు ఉన్నారనేది మొత్తం వ్యవహారం బైటికి రావడం ఖాయం.మరి అలాంటి విచారణ జరిపించే దమ్ము ఉందా అంటే అందుకు మౌనమే సమాధానం. కారణం కొండను తవ్వి ఎలుకను పట్టిన చందాన గత ప్రభుత్వ హయాంలో సమాచార శాఖ లో వైసిపి సానుభూతి పరులు అవినీతి చేశారని ఏసీబీ కేసులు నమోదు అయ్యాయి, సిఐడి విచారణ అన్నారు.. కొంతమంది అధికారులను మాత్రమే ఉద్యోగం లేకుండా పక్కన పెట్టి ఏడాది తర్వాత బాధ్యతలలోకి తీసుకున్నారు.మరి ఆ కేసులు గోల ఏమయింది.నాడు జరిగిన అవినీతి అంతా మాసిపోయిందా ఇలా భిన్నమైన ప్రశ్నలు తలెత్తున్నాయి.అంటే ఇవన్నీ ప్రతి ప్రభుత్వం లో భజన చేసే వారికి, నజరానాలు ఇచ్చే వారికి ,సలాం కొట్టే వారికి, నేతల అడుగులకు మడుగులు ఒత్తే వారికి ఏ నియమ నిబంధనలుఅక్కర్లేదని నిరూపితం అవుతూ ఉంది.ఇలాంటప్పుడు అవినీతి అధికార వ్యవస్థ పై ఎంత గొంతు చించుకున్న ఉపయోగం లేదన్నది వాస్తవం.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article