టాప్ న్యూస్వీరిని సమాచార శాఖ అధికారులని అనాలా...!

వీరిని సమాచార శాఖ అధికారులని అనాలా…!

*వీరికంటే చెత్త సేకరణ చేసే వారే మేలని అనొచ్చా….?
*వారి దగ్గరే కచ్చితమైన సమాచారం ఉంటుంది గా…!
*అమ్మవారి ఆలయ పవిత్రత దెబ్బతీసేదెవరు…
*దసరా పండుగ ఏ రోజో తెలియదా…
*జర్నలిస్ట్ అంటే భిక్షగాడు కాదుగా…
*నీతి లేని మీ కంటే జర్నలిస్ట్ అవినీతి పరుడు కాదుగా…
*లక్షల్లో జీతాలు తింటూ లాలూచీ పనులు చేయలేదా…
*ఎంజిల్ సెక్యూరిటీ గార్డు కంటే హీనమైన వాడ జర్నలిస్ట్…
*లోపాలు మీ వ్యవస్థలలో లేవా…
*మీరంతా సుద్ద పూసలమని చెప్పుకుంటే సరిపోతుందా…
*నిజాయితీ లేని మీరా జర్నలిస్ట్ లను కించపరిచేది…
*కూటమి ప్రభుత్వాన్ని కూల్చేది ఎవరో కాదు మీరే..
*మీ కక్కుర్తి కోసం కలాన్ని కించ పరుస్తారా…
*పోలీసులు చెబితేనే పాసులు ఇస్తారా…
*మీ వ్యవస్థలుండగా మీడియా మీకెందుకు…
*మీకు ప్రచారం కావాలి..
మీ లోపాలు చూపితే పాపం అవుతుందా….
*పోలీసులలో అంతా నిజాయితీ పరులే ఉన్నారా…
*ఒక్క జర్నలిస్ట్ అంటేనే అంత చులకనగా ఉంటుందా…
*దేవాదాయ ధర్మాదాయ శాఖ అంతా ధర్మంగా నడుస్తుందా…
*అమ్మవారి గుడిలో దొంగతనాలే జరగలేదా….
*నరరూప రాక్షసుల కంటే దారుణంగా సాయి కృష్ణ ను చంపలేదా…
*మాజీ ఉద్యోగికి పెత్తనం ఎలా ఇస్తారు…
*వాడి ఆశ తీరక ఆఫీసులో తిస్ట వేస్తుంటే చిడతలు వాయిస్తున్నారా…
*అక్రిడేషన్ కార్డులలో అంతా మోసాలు చేసినా …
*మళ్ళీ మీరు ప్రజలకు సమాచారం చేర వేస్తారా…
*అమ్మవారి పాసులిస్తేనే అంతా అపచారం అవుతుందా…

  • రంగులు మార్చే రాజకీయ నాయకులు మాత్రమే పవిత్రులా…
    *ఇదేనా మీ చిత్త శుద్ధి ..చెత్త బుద్ధి….
    (రామమోహన్ రెడ్డి)
    సమాచార పౌర సంబంధాల శాఖ అంటే నప్రభుత్వం ప్రవేశపెట్టే కొత్త పథకాలు, నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలను మీడియా ద్వారా ప్రజలకు చేరవేయడం. ప్రభుత్వ విధానాలపై ప్రజల అభిప్రాయాలు, స్పందనలను సేకరించి ప్రభుత్వానికి తెలియజేయడం.అయితే ఇవన్నీ ఈ సమాచార పౌర బంధాల శాఖ సక్రమంగా చేస్తుందా లేదా అన్నది ఎవరు పర్యవేక్షణ చేస్తున్నారు.వీరు చేసే పాపపు,అన్యాయపు,అసంబద్ధ పనులు, అవినీతి,అక్రమాలకు అడ్డుకట్ట వేసే వారు ఎవరు అన్న ప్రశ్న అనేక సంవత్సరాలుగా ఉత్పన్నం అవుతూనే ఉంది.
    ఇక మీడియా అంటే సమాచారం, ఆలోచనలు, అభిప్రాయాలు మరియు వినోదాన్ని ప్రజలకు చేరవేయడానికి ఉపయోగించే వివిధ రకాల కమ్యూనికేషన్ సాధనాలు లేదా మాధ్యమాలు.అలాగే ప్రపంచంలో, దేశంలో జరిగే ముఖ్యమైన విషయాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తూ, పౌరులకు అవగాహన కల్పిస్తుంది.
    సామాజిక సమస్యలపై ప్రజలను జాగృతం చేస్తుంది మరియు అభిప్రాయాలను మలచడంలో సహాయపడుతుందని అందుకే
    ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంలోని మూడు ప్రధాన విభాగాలు (శాసనసభ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ) కాకుండా, మీడియాను సమాజానికి “నాల్గవ స్తంభం” లేదా “నాల్గవ శక్తి”గా పరిగణిస్తారు.కానీ నేటి ప్రజాస్వామ్య వ్యవస్థ లో నాలుగో స్తంభముగా పిలువబడుతూ నాలుగవ శక్తిగా ఉన్నా మీడియా మిగిలిన మూడు వ్యవస్థ లలోని న్యాయవ్యవస్థ మినహాయిస్తే మిగిలిన రెండు వ్యవస్థల లోని అవినీతి అధికారుల, నీతి లేని రాజకీయ నాయకులు పాదాల కింద నలిగి పోతుంది.ఇలా నలిగి పోతుంటే ప్రజా స్వామ్యం పక్కున నవ్వుతూ ఉంటే ప్రజలు ముక్కున వేలేసుకోక తప్పని పరిస్థితి.కారణం ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నికలు,పార్లమెంటరీ విధానాలు ,అధికారుల తీరు తెన్నులతో విసిగి వేసారి పోయిన ప్రజలు ఒక నాటి ఆంగ్లేయుల పాలనను గుర్తుకు తెచ్చుకొంటారని అందుకే ఈ దేశానికి స్వతంత్రం అప్పుడే కాదన్నట్లు చక్రవర్తి రాజగోపాలాచారి చెప్పిన సందర్భం ఓ సారి గుర్తుకు తెచ్చుకోవాల్సిన కర్మ నేటి పాలకుల తీరును బట్టి చెప్పాల్సి వస్తుంది.
    ఎందుకయ్యా ఈ ఉపన్యాసమో, ఉపోద్ఘాతమో ఇంకేదయినా అనుకునే మేధావుల ముసుగులో ఉండే వారు కూడా అసలు విషయాలు వెలుగులోకి వస్తున్న తరుణంలో అణువంత ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతయినా ఉంది.దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు.అలాంటి పర్వదినాలు కృష్ణా నది ఒడ్డున, ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువై ఉండి స్వయంభువుగా వెలిసి , అష్టభువులతో త్రిశూలం ధరించి మహిషాసురుని వధించిన రూపం తో ఉన్న శ్రీ కనక దుర్గమ్మ ఆలయం లో అత్యంత వైభవంగా జరుగుతాయి. నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధాని కూడా అమ్మవారు ఉన్న ఆలయం కు అతి సమీపం లో ఉంది.అలాగే ఈ రాష్ట్రం లో కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల స్వామి తరువాత రాష్ట్ర ప్రభుత్వం తరుపున మూల నక్షత్రం రోజున పట్టు వస్త్రాలు సంపర్పించడం అనవాయితీ.అలాగే అమ్మవారి ఆలయం లో జరిగే దేవీ శరన్నవాత్రి ఉత్సవాలకు మొత్తం తొమ్మిది రోజులకు దాదాపు పాతిక లక్షల మంది వరకు దర్శనం చేసుకుంటారని అధికారుల అంచనా చేస్తున్నారు.మరి ఇలాంటి పరిస్థితులలో అమ్మవారి ప్రాచుర్యం,అమ్మ ఆలయం లో జరిగే నిత్య పూజాది కార్యక్రమాలు,దర్శన వేళలు, ఏర్పాట్లు,వసతి, బోజనాలు,అమ్మవారి ఆలయం కు చేరుకునే మార్గాలు,ఇతర కార్యక్రమాలు ,దర్శనం కు వచ్చే భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులు,అందుతున్న సేవలు,ఇలా అనేకం కూడా భక్తితో కూడుకున్న అంశాలు యావత్ అమ్మవారి భక్తులకు తెలియాల్సిన అవసరం ఎంతయినా ఉంది. మరి ఇన్ని విషయాలు ఎలా ఎప్పుడు ఏ విధంగా ఎవరు చేరవేస్తారంటే హుండీలు దోచుకుని తినడానికి వెనుకాడని దేవాదాయ ధర్మాదాయ శాఖ లో ఉండే ఆదర్మధాయ అధికారులు,రైతు పొలానికి పట్టా ఇచ్చేందుకు ఆ రైతుల పొట్ట కొట్టే రెవెన్యూ అధికారులు,లాఠీలతో కొట్టి చంపే పోలీసులు అధికారులు, మందు బిళ్లలు సైతం అమ్ముకుని తినడానికి ఏ మాత్రం వెనుకాడని వైద్య సిబ్బంది,అక్రమ బిల్డింగ్ లకు అండగా ఉండే మున్సిపల్ అధికారులు, ఉసరవెళ్ళి లాగా రంగులు మార్చే రాజకీయ నాయకులతో కూడా కానీ పని ఒక్క మీడియాతోనే సాధ్యం అవుతుంది.
    మరి అలాంటి మీడియా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదుగా…పోనీ ఈ రాష్ట్రం లో రాత్రినక పగలనక ఎండ గాలి వాన దుమ్ము ధూళి,ఆఖరికి తిండి తిప్పలు లేక,సరైన ఆదాయ వనరులు లేక,ప్రభుత్వాల నుండి ఒక్క చిల్లి గవ్వ కూడా సహాయం అందక పోయినా వేలల్లో జీతాలు ఇచ్చుకుంటూ లక్షలలో ఖర్చు చేసి పత్రికలు,చానెల్స్ నడుపుకుంటూ మేడిపండు జీవితం గడుపుతున్న మీడియా స్వచ్ఛందంగా అమ్మవారి వైభవాన్ని నలుదిక్కులు కు చాటి చెప్పేలా ప్రచారం చేయడానికి ముందుకు వస్తుంటే ఆంక్షల పేరుతో అవమానాలకు గురిచేస్తుంటే,అలా అవమానాలకు గురిచేస్తుంటే ఖండించి ,అండగా ఉండి అన్యాయాన్ని ప్రశ్నించి ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక ఇవ్వాల్సిన సమాచార పౌర సంబంధాల శాఖ ఏమి చేస్తుందయ్యా అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఏ వ్యవస్థలు గాడి తప్పకుండా హెచ్చరికలు ,సలహాలు, సూచనలు చేసిన వాటిని సక్రమ మార్గం లో చేయడానికి అనునిత్యం డేగ కళ్ళతో కాపలా గా ఉంటున్న మీడియా కు అండగా ఉండమని ప్రజా దనాన్ని ఇచి ఏసీ గదుల్లో ఉంచితే ఆ పాడుబడి పోతున్న వ్యవస్థలకు సన్నాయి నొక్కులు నొక్కుతూ వారు వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడి కంచె చేను మేసిందన్న చందాన నాలుగో స్తంభాన్ని నడి వీధులలో నవ్వుల పాలు చేస్తుందని చెప్పక తప్పడం లేదు.
    అసలు మీడియా అంటే ఎందుకింత చులకన అవహేళన అయ్యిందంటే మనిషి పుట్టుక కూడా నేడు అక్రమం అవుతున్న తరుణంలో కొంతమంది నేరగాళ్ళు,రౌడీ షీటర్లు,నేరమయ చరిత్ర కలిగిన వారు, ఎడిటరైనవాడు బిడియము చూపుచో ధాటి తగ్గు వృత్తి ధర్మమందు, కడుపుకూటి రాత కక్కుర్తి రాతరా’ అని ముఖ్యంగా జర్నలిజం రంగంలోకి అడుగుపెట్టేవారు నిజాయితీగా, నిర్భీతిగా ఉండాలని కోరేవాడు నార్ల. “నిజము కప్పిపుచ్చి నీతిని విడనాడి స్వామి సేవ సేయు జర్నలిస్టు తార్చువాని కంటే తక్కువ వాడురా” అని చెప్పిన నార్ల వెంకటేశ్వర రావు గారు చెప్పిన చందాన కొంతమంది ఉన్నారనేది బహిరంగ సత్యం.అలా అని మొత్తం వ్యవస్థనే కించపరచడం సరైన పద్దతి కాదనేది యదార్థం.అలా అనుకుంటే అమ్మవారి ఆలయం లో పనిచేసే ఏంజిల్ సెక్యూరిటీ గార్డ్ కు అమ్మవారి ఆలయం లో ఉన్న ప్రాధాన్యత , దర్శనాలకు ఇచ్చే ప్రాముఖ్యత,అందులో ఒక నాయక్, ఈఓ శీనానాయక్ నేను ఒకటే అని చేసే ఆర్భాటం ముందు మీడియా బలాదూర్ అని చెప్పడంలో వింతేమీ లేదు. ఇక నేరం చేసిన వాడిని శిక్షించాల్సిన పోలీసులు భక్షించిన వారు ఉన్న ఆ వ్యవస్థకు అమ్మ ఆలయం లో ఉత్సవాల సందర్భంగా అవ్వచ్చు,సాధారణ సమయం లో అవ్వచ్చు దర్శనాల లో ఇస్తున్న ప్రాధాన్యత,సౌకర్యాలు మీడియాకు కాదుగా కానుకల రూపంలో చెల్లిస్తేనే దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఆలయ అధికారులు బ్రతుకున్నప్పటికీ ఆ రూపాయి చెల్లించే భక్తుడికి కూడా అక్కడ అసంతృప్తి తప్పని పరిస్థితి నిజం కాదా అన్న విషయం ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతయినా ఉంది.
    ఇక నవ్విపోదురుగాక నాకేల సిగ్గు అన్న చందంగా నీతి నిబద్దత నిజాయితీ లేక అందిన కాడికి దోచుకుని దాచుకుని తినడానికి వెనుకాడకుండా నోట్ల కట్టలతో ఓట్లు కొని కుర్చీలెక్కి కాకి కబుర్లు చెబుతూ చొక్కాలు మార్చినట్లు పార్టీ కండువాలు మార్చే రాజకీయ నాయకులకు ఇచ్చే ప్రాముఖ్యత లో ఒక శాతం కూడా మీడియా ఇవ్వకుండా భక్తుల మాటున భగవంతునిని కూడా బదనాం చేస్తే వారి లోపాలను పాపాలను కడిగిపారేస్తారనే వారితో లాలూచీ పడి తమరి అక్రమాలు, అన్యాయాలు ప్రశ్నిస్తారని నేడొక అవకాశం గా తీసుకుని ఆటలు ఆడుతున్న వీరిని సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులని అనడం కంటే చెత్త సేకరణ చేసే అధికారులవద్దే కచ్చితమైన సమాచారం ఉందని అనడం లో తప్పేమి లేదన్న భావన సంపాదక వర్గం నుండి సర్వత్రా వ్యక్తం అవుతోంది.
    వీరేమో అక్రిడేషన్ కార్డులు అమ్ముకోవచ్చు అనర్హులకు పెద్దపీట వేయొచ్చు, ఉద్యోగం నుండి విరమణ చెందినా అందులో ఉన్న అవినీతి కోసం కులం కార్డ్ తో మల్లీ ఒక అవినీతి పరుడికి ఆహ్వానం పలుకచ్చు అర్థరుపాయి జీతం,అండ దండ ఇవ్వని సమాచార శాఖ కు అయ్యా నీ కాల్మొక్కుత బంచాత్ అంటూ ఉండాలా అన్న రీతిన అక్కడ పరిస్థితి దాపురించిందనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇలాంటీ పరిస్థితులలో

“ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము, నిప్పులలోనఁ గఱగిఁపోయె!
ఇచ్చోటనే భూము లేలు రాజన్యుని యధికారముద్రిక లంతరించె!
ఇచ్చోటనే లేఁత యిల్లాలి నల్లపూసలసౌరు, గంగలోఁ గలిసిపోయే!
ఇచ్చోట నెట్టి పేరెన్నికం గనుఁగొన్న చిత్రలేఖకుని కుంచియ నశించె!”అన్న గుఱ్ఱం జాషువా గారి చక్కని విషాద పద్యం గుర్తుకు తెచ్చుకోవాల్సిన కర్మ నేటి పాలకుల తీరును బట్టి చెప్పవచ్చు.ఇందుకే ఈ సమాచార పౌర సంబంధాల శాఖ అధికారుల గురించి ఎంత రాసినా ఎంత వివరించిన తక్కువే అని యావత్ పత్రికా లోకం పెదవి విరుస్తోంది

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article