*అవినీతి ఆరోపణలు,ఏసీబీ కేసులున్నా ..
*అమ్మవారి ఉత్సవాల ప్రత్యేక అధికారిగా నియమిస్తే…
*ఈ అధర్మాదాయ అధికారులనేమనాలి…
*ఒక్క రోజుకే అతని తీరు నచ్చక పోయే…
*కూటమి నాయకులకు మర్యాదలో లోపం..
*అజాద్ పాపాలు శాపంగా మారాయా…
*ఈవో శీనానాయక్ కూడా చక్రం తిప్పినట్లేనా..
*వీరి కంటే జర్నలిస్ట్ పనికిరాని వాడు అయ్యాడా…
*కనక దుర్గమ్మ వీరి కళ్ళు తెరిపించలేవా…

తనవారకు వస్తె కానీ తప్పొప్పులు తెలియదన్న చందాన రాజకీయ నాయకులకు కావలసిన ఓ పెద్ద మనిషి అమ్మవారి ఆలయం కు రావడం అమ్మ దర్శనం విషయం ,అక్కడ మర్యాద విషయంలో అమ్మవారి ఉత్సవాల కోసం నియమించిన ప్రత్యేక అధికారి చంద్రశేఖర అజాద్ ను ఆ విధులనుండి అప్పటికప్పుడే తొలగించి ఇంకో అధికారిని నియమించడం జరిగింది.అయితే ఆ వచ్చిన పెద్ద మనిషి డిల్లీ నుంచి గల్లి వరకు కూటమి నాయకులతోపాటు కేంద్రంలో ఉన్న బీజేపీ అగ్రనేతలతో మంచి సంబందాలు ఉన్నట్లు తెలుస్తోంది.అలాంటి పెద్ద మనిషి అమ్మవారి ఆలయం కు రావడం తో ఆయనకు అందాల్సిన గౌరవం ఇవ్వడం లేదనే అసహనం వ్యక్తం చేసిన అర క్షణం లోనే అజాద్ ను అమ్మ ఆలయం నుండి బయటకు పంపడం జరిగింది. ఒక్కరోజు ఉత్సవాల నిర్వహణ పూర్తి కాకుండే అజాద్ ను తప్పించి త్రినాధ్ అనే అధికారిని నియమించడం జరిగింది.మరి ఇందులో ఏమి జరిగిందో అందరికీ తెలియాల్సిన అవసరం ఎంతయినా ఉంది.చంద్ర శేఖర అజాద్ దేవాదాయ ధర్మాదాయ శాఖ లో ఒక జాదూ అధికారని అతను గతంలో అక్రమాస్తులు ఉన్నాయని అవినీతి నిరోధక శాఖ అధికారులు దర్యాప్తు చేసి కేసులు నమోదు చేసిన విషయం అందరికీ విధితమే. గతంలో ఈ అజాద్ అమ్మవారి ఆలయ కార్యనిర్వహణ అధికారిగా కూడా పనిచేయడం జరిగింది. అయినా అతనికి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఉన్నత స్థాయిలో అధికారం కట్టబెట్టడం జరిగింది.అంటే ఒక అవినీతి అధికారి అనేక అక్రమ సంపాదన కలిగి ఉన్నాడని కేసులు ఉన్నా ఆ ఆరోపణలు నిజమో కాదో తెలియక ముందే అత్యున్నత స్థాయిలో హోదా కట్టబెట్టడం జరిగింది.అలాంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు,ఆ శాఖ అధికారులకు అండ దండగా ఉంటున్న అవినీతి కంపులో మునిగి తేలుతున్న రాజకీయ పార్టీల నేతల కంటే అర్ద రూపాయి ఆదాయం లేని,అమ్మవారి ప్రసాదం కూడా ఉచితంగా తీసుకోవడానికి అర్హత లేక పోయినా అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆలయ ప్రాశస్త్యం గురించి ప్రసారం,ప్రచురణ చేసి అనేక సామాజిక మాధ్యమాల ద్వారా ఇతర మార్గాల్లో తెలియ జెప్పే జర్నలిస్ట్ అంత కానీ వాడు అయ్యాడా అన్న ఆవేదన జర్నలిస్ట్ వర్గాల నుండి వ్యక్తం అవుతోంది.అయితే దుర్గగుడిలో సుదీర్ఘ కాలంగా కార్యనిర్వహణాధికారి గా బాధ్యతలు నిర్వహిస్తున్న శీనానాయక్ కూడా అజాద్ మార్పులో అంతర్గతంగా ఉన్నాడా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మేధావి వర్గాలు.ఎందుకంటే ఈవో శీనానాయక్ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి కాదు.ఆయనొక స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్. డిప్యూటెషన్ పై దుర్గగుడి ఈవో గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.శీనానాయక్ ఈవో గా వచ్చిన తరువాత అనేక సంస్కరణలు చేపట్టడం జరిగినా అనేక సంవత్సరాలుగా అమ్మవారి సొమ్మును అప్పనంగా దోచుకుని తినడానికి అలవాటు పడ్డ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు కొంత అడ్డుకట్ట పడినట్లు కూడా చెప్పవచ్చు.అయితే ఇలాంటి సంఘటనలపై మీడియా ఎప్పటికప్పుడు వాస్తవ అవాస్తవ విషయాలను అమ్మ భక్తులకు తెలియపరుస్తూనే ఉంది.అలాంటి మీడియా కు అమ్మవారి ఉత్సవాలలో అడ్డదిడ్డంగా ప్రవర్తించడం అంత మంచిగా లేదనే విమర్శలు గుప్పుమంటున్నాయి.ఇలాంటి పరిస్థితులలో ఈ వ్యవస్థల తీరును ఏమని ప్రశ్నించాలి ఎలా ప్రశ్నించాలో మేధావులే చెప్పాల్సిన అవసరం ఎంతయినా ఉంది.

