Sunday, April 19, 2026

Creating liberating content

తాజా వార్తలులోక్ సభ ఎన్నికల బరిలో బర్రెలక్క

లోక్ సభ ఎన్నికల బరిలో బర్రెలక్క

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ .. త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని సమరోత్సాహం ప్రదర్శిస్తోంది బర్రెలక్క. తాజాగా మీడియాతో మాట్లాడిన బర్రెలక్క… లోక్ సభ ఎన్నికల్లో నాగర్ కర్నూలు స్థానం నుంచి పోటీ చేస్తానని వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాక, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనగలిగే ధైర్యం వచ్చిందని తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలు తనను మరింత దృఢంగా మార్చాయని పేర్కొంది. ఓటుకు నోటు అనే విధానాన్ని రూపు మాపడంపై కృషి చేస్తానని, ప్రజల్లో చైతన్యం తీసుకువస్తానని బర్రెలక్క చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article