*ఆచలానంద ఆశ్రమం లో జరిగిందేమిటీ…
*చిన్నారి సాత్విక్ చావు ప్రమాదమా…లేక
*ప్రమాదం గా చిత్ర్రీకరణ చేసారా..
*ఆ పసివాడి ప్రాణం పోయిందా తీశారా…
*ఆ తల్లిదండ్రుల కడుపు కోతకు కారకులెవరు…
*ధర్మం కోసమే పనిచేసే వారు ఆదర్మానికి పాల్పడ్డారా…
*విరజానంద స్వామి నిజమైన విశ్వాసం కలిగి ఉన్నాడా ..
*నందిని మాత నిజమే చెబుతుందా…
*పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారా…
*అమ్మగారి ఆ దుస్తులతో ఆ అబ్బాయికి పనేమిటి…
*ఆ సమయంలో ఆ గదిలోకి అలా ఎలా వెళ్ళాడు…
*ఆశ్రమం లో పద్ధతులు అంతగా ఉండవా…
*పచ్చ నోట్లతో పాపాలను పక్కాగా చేరిపి వేశారా…..
*ఓ విరజానంద ఏమిటీ వింత…
*ఏది నిజం ఏది అబద్ధం…?
(రామమోహన్ రెడ్డి)


ఆశ్రమం అనేది ఆధ్యాత్మిక సాధన, యోగం, జ్ఞాన సముపార్జన లేదా సేవా కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన పవిత్రమైన, ఏకాంత ప్రదేశం. ఇది గురువుల మార్గదర్శకత్వంలో క్రమశిక్షణతో జీవించడానికి మరియు మానసిక ప్రశాంతతను పొందడానికి ఉపయోగపడుతుంది.సంస్కృతంలో ‘శ్రమ’ అంటే కష్టపడి పని చేయడం లేదా సాధన చేయడం. ఆశ్రమం అంటే ఆ సాధన వల్ల కలిగే శారీరక, మానసిక భారం నుండి విముక్తిని, ఉపశమనాన్ని పొందే ప్రదేశం.ఇక్కడ నివసించేవారు (సాధకులు) భౌతిక బంధాలకు, లౌకిక విషయాలకు దూరంగా ఉంటూ, భగవద్గీత, యోగం, ధ్యానం వంటి వాటిని అభ్యసిస్తారు. సమానత్వ భావనను అలవర్చుకుంటారు.హిందూ సనాతన ధర్మంలో మానవ జీవితాన్ని నాలుగు ఆశ్రమాలుగా (దశలుగా) విభజించారు.:బ్రహ్మచార్యం (విద్యార్థి దశ)గృహస్థం (వివాహ జీవితం)వానప్రస్థం (సన్యాస జీవితానికి సన్నాహం)సన్యాసం (పూర్తిగా భగవంతుడికి అంకితం కావడం.బ్రహ్మచర్యం అనేది శారీరక, మానసిక వాంఛలను ముఖ్యంగా లైంగిక ఆసక్తులను నియంత్రిస్తూ, మనస్సును పవిత్రంగా ఉంచుకునే ఒక క్రమశిక్షణతో కూడిన జీవన విధానం. ‘బ్రహ్మన్’ అంటే అనంతమైన దైవతత్వం, ‘చర్య’ అంటే ఆచరణా మార్గం.గృహస్థాశ్రమం అంటే “ఇల్లు, కుటుంబంలో ఉంటూ ఆ ధర్మాలను నిర్వర్తించడం”. ఇది హిందూ ఆశ్రమ వ్యవస్థలో వ్యక్తి జీవితంలోని రెండవ దశ. ఇది బ్రహ్మచర్యం తరువాతి దశ. ఇంటిని నిర్వహించడం, కుటుంబాన్ని పోషించడం, పిల్లలను చదివించడం, కుటుంబ, ధార్మిక సామాజిక జీవితాన్ని గడపడం వంటి విధులతో వైవాహిక జీవితాన్ని ప్రతిబింబిస్తుంది.హిందూమతం లోని ప్రాచీన, మధ్యయుగ గ్రంథాలు గృహస్థ దశను సామాజిక శాస్త్ర సందర్భంలో అన్ని దశలలోకీ అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తాయి. ఈ దశలో మానవులు ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగించడమే కాకుండా, మానవజాతిని కొనసాగించే సంతానాన్ని, జీవితంలోని ఇతర దశలలో ఉన్న ప్రజల కోసం ఆహారాన్ని, సంపదనూ ఉత్పత్తి చేస్తారు.భారతీయ తత్వశాస్త్రంలో గృహస్థ దశ, మానవుని జీవితంలో అత్యంత తీవ్రమైన శారీరక, లైంగిక, భావోద్వేగ, వృత్తిపరమైన, సామాజిక, భౌతిక అనుబంధాలున్న దశగా పరిగణించబడుతుంది.వానప్రస్థం అంటే “అడవికి ప్రయాణం” అని అర్ధం. ఇది హిందూమతం లోని ఆశ్రమ వ్యవస్థలో మూడవ దశ. ఇది మానవ జీవితంలోని నాలుగు దశల్లో మూడవది.వానప్రస్థం అనేది వైదిక ఆశ్రమ వ్యవస్థలో భాగం. వ్యక్తి ఇంటి బాధ్యతలను తరువాతి తరానికి అప్పగించి, సలహాదారు పాత్రను స్వీకరించి, క్రమంగా ఐహిక బంధాల నుండి వైదొలిగడంతో ప్రారంభమవుతుంది. ఈ దశ సాధారణంగా గృహస్థాశ్రమాన్ని అనుసరిస్తుంది. కానీ బ్రహ్మచర్య దశ నుండి గృహస్థ దశను తప్పించి నేరుగా వానప్రస్థాన్ని స్వీకరించవచ్చు. ఇది సన్యాసాశ్రమానికి, ఆధ్యాత్మిక సాధనలకూ నాందిగా ఉంటుంది.వానప్రస్థ దశ అనేది అర్థ, కామాలకు అనగా సంపద, భద్రత, ఆనందం, లైంగిక కోరికలకు ప్రాధాన్యత ఉండే గృహస్థ జీవితం నుండి మోక్షానికి అనగా ఆధ్యాత్మిక విముక్తికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే దశగా పరిగణిస్తారు.సన్యాసాశ్రమం హిందూ వ్యవస్థలో జీవిత దశల్లో నాలుగవది. జీవితపు చివరి సంవత్సరాలలో పురుషులు, స్త్రీలు సన్యాస జీవితం గడుపుతారు. అయితే బ్రహ్మచారులు గృహస్థ, వానప్రస్థ దశలను గడపకుండా ప్రాపంచిక, భౌతిక సుఖాలను త్యజించి, ఆధ్యాత్మిక సాధనల కోసం తమ జీవితాలను అంకితం చేసేందుకు నేరుగా సన్యాసాశ్రమం స్వీకరించే అవకాశం ఉంది.సన్యాసం అనేది భౌతిక కోరికలను త్యజించి జీవించే దశ. భౌతిక జీవితం పట్ల నిరాసక్తత నిర్లిప్తతతో కూడుకుని ఉంటుంది. జీవితాన్ని శాంతియుతమైన, ఆధ్యాత్మిక సాధనలలో గడపాలనే ఉద్దేశంతో ఉంటుంది.సన్యాసంలో ఉన్న వ్యక్తిని హిందూమతంలో సన్యాసి లేదా సన్యాసిని అని పిలుస్తారు. ఇది అనేక విధాలుగా జైన సన్యాసం సాధు, సాధ్వి సంప్రదాయాలకు, బౌద్ధమతంలోని భిక్కులు, భిక్షుణులకు సమాంతరంగా ఉంటుంది.సన్యాసంలో న్యాస అంటే శుద్ధి, సన్యాసము అంటే “అంతటా శుద్ధి” అని అర్థం.సన్యాసానికి సాహిత్య అనువాదం అంటే “ప్రతిదీ, అన్నింటినీ అణిచివేయడం” అని అర్థం.ఇది హైన్దవ సమాజంలో మనిషి ఎంచుకునే మార్గాన్ని బట్టి ఉండవలసినవి మహర్షులు ఆచరణలో చూపినవి.మరి ఇక్కడ మనము చెప్పబోయే అంశాలలో విభిన్న పాత్రలు ఉన్నాయి.ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందయ్య అంటే అందుకు గల కారణాలు లేక పోలేదు..అచలానంద ఆశ్రమము శాఖను కడప జిల్లా, బ్రహ్మంగారి మఠం మండలము, తోట్లపల్లె గ్రామములో 2010 జూన్ 2వ తేదిన శంఖుస్థాపన చేసి, సుమారు 25 అడుగుల ఎతైన శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారి విగ్రహమును నిర్మించి 5-5-2011రోజున ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ యోగి అచలానందస్వాములవారిచే ఆవిష్కరించడం జరిగింది. ఈ తోట్లపల్లెలో నెలకొన్న అచలానంద ఆశ్రమములో నిర్విరామముగా, నిరంతరము నిత్యన్నదానము జరుగుతుండటం ఒక ప్రత్యేకత.దీనితో పాటు కొంతమంది విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తూ ఉంది ఈ ఆశ్రమం. అయితే విద్య మాత్రం స్థానిక ఒక ప్రవేటు పాఠశాల లో అందిస్తూ మిగిలిన అన్ని వసతులను శ్రీ ఆచాలానంద ఆశ్రమం అందిస్తూ ఉన్నట్లు ఆశ్రమ నిర్వాహకులు శ్రీ విరాజనంద స్వామి తెలియజేస్తున్నారు. ఇది ఆశ్రమం,ఆ ఆశ్రమంలో జరుగుతున్న నిత్య కృత్యాలు.అయితే ఇందులో ఒక దుర్ఘటన జరగడం మూలాన ఇప్పుడు ఆచాలానంద ఆశ్రమం వార్తల్లో నిలుస్తోంది. ఆ ఆశ్రమం లో ఉంటూ గత మూడు సంవత్సరాలు గా విద్యను అభ్యసిస్తున్న సాత్విక్ అనే పదమూడు సంవత్సరాల ముక్కు పచ్చలారని పసిపిల్లవాడి ప్రాణం గాలిలో కలిసి పోయింది. అయితే అది ప్రమాదమా లేక ప్రమాదం గా చిత్రీకరణ చేసారన్న నిజ నిర్దారణ ఇంకా పూర్తిగా జరగక పోవడం అనేక రకాల అనుమానాల కు తావు తీస్తోంది. ఎందుకయ్యా అంటే తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నది కొంతమంది ద్వారా బహిర్గతం అవుతున్న విషయాలు చూస్తే ఒళ్ళు గగుర్పాటు కు గురి చేసే పరిస్థితి దాపురిస్తోంది. ఒంగోలు ప్రధాన కేంద్రంగా ఉన్న శ్రీ ఆచాలానంద ఆశ్రమం కాలజ్ఞాని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సజీవ సమాధి నిష్ట వహించిన ప్రాంతానికి అతి దగ్గరలో బ్రహ్మంగారి భారీ విగ్రహం ఏర్పాటు నిత్యన్నదానం ఇలా అనేక ధార్మిక కార్యక్రమలు స్వామి మఠం కంటే ఓహో అనిపించెంత స్థాయికి చేరుకొబడ్డాయి.ఇందులో అన్నదానం అనేది ఎంతో గొప్పగా చేయడమనేది నిత్య సత్యం.ఇలా మొదలైన ఆశ్రమం అసలు వ్యవస్థాపకులు శివైక్యం చెందాకా స్వామి విరాజానంద అక్కడ అన్ని తానై చూసుకుంటూ చుట్టుపక్కల గ్రామాల ప్రజల లో గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించారు. అయితే విరజానంద సన్యాసశ్రమము లో ఉన్నారు. ఈయన ఈ రాష్ట్రం నలుమూలల హిందూ ధార్మిక కార్యక్రమాలలో ఆర్ ఎస్ ఎస్ కార్యక్రమాల్లో బాగా చురుగ్గా పాల్గొంటూ ఉంటారు.ఇదంతా గొప్పగా ఉన్నా కొంత కాలంగా ఈ ఆశ్రమంలో కి నందిని అనే బ్రహ్మచర్యం లో ఉన్న మాతాజీ రంగ ప్రవేశం చేసింది. ఇక స్వామి మతాజీ లు అనేక ధార్మిక కార్యక్రమాలలో చాలా విరివిగా పాల్గొంటూ ఉన్నారు.అయితే ఇక్కడ ఆ మాతాజీ మీదే ఇప్పుడు ఆ పసికూన ఊపిరి పోయిన ఘటన పరిభ్రమనం చెందుతూ ఉంది ఆ పసివాడు స్నానాల గదిలో కరెంట్ షాక్ తో మరణించినట్లు చెప్పుకొస్తుండగా పిల్లవాడి తల్లిదండ్రులు మాతాజీ లో దుస్తులతో కూడిన వ్యాఖ్యలు వ్యక్తపరుస్తూ తమ పిల్లవాడిది మరణం యాదృచ్చికంగా జరిగింది కాదని ప్రమాదమని చిత్రీకరణ చేసారని వాపోతున్నారు.కరెంట్ షాక్ తగిలితే ఆ షాక్ తగిలిన శరీర భాగాలు గాయం అవుతాయని కానీ తమ పిల్లవాడి శరీరమంతా కొట్టిన గాయాలు ఉన్నాయని ఇది ఆ ఆశ్రమంలో జరిగే కొన్ని అనైతిక కార్యక్రమాలు తమ పిల్లవాడు అనుకోకుండా చూడటం మూలాన ఆశ్రమ ప్రతిష్ట దెబ్బతింటుందన్న రీతిలో ఆ పాసిపాప ప్రాణం తీసినట్లు ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో ఏది వాస్తవం ఏది అవాస్తవమని నిజ నిర్దారణ చేయాల్సినది పోలీసు శాఖ దే అయినా ఆ శాఖ తీరు ప్రస్తుతం అంత ఆశించిన స్థాయిలో పని చేయడం లేదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి అందరికి విదితమే.ఇక్కడ ప్రదానంగా చర్చించాల్సిన ఆలోచించాల్సి న విషయం ఏమిటంటే ఆశ్రమం ద్వారా విద్య కోసం విద్యార్ధులకు విద్య అందించే ఆ విద్యా సంస్థ అనేక అక్రమాలకు నిలయం.విద్య అన్న ఒక్క విషయం పక్కన పెడితే అక్కడ అన్ని మిద్యలే అన్నది ఆ మండలంలోని ప్రతి కుటుంబానికి తెలుసు.మళ్ళీ రాజకీయాలు. ఏ రాజకీయ పార్టీ అధికారం లో ఉంటే ఆ పార్టీ కండువా కప్పుకొని అన్ని కార్యక్రమాలకు పెద్దమనుషులుగా చెలామణి అవ్వడం పరిపాటిగా వస్తుందన్నదే.ఇక అలాంటి గొప్ప నాయకత్వ పఠిమ తో పాటు భక్తి అనే ముసుగు వేసుకుని చేయని అన్యాయాలకు నిలయంగా ఉన్న కొంతమంది పెద్ద మనుషులు శ్రీ విరజానందుడు ఏ ఆధ్యాత్మిక కార్యక్రమ చేసిన వారే ముందుంటారు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో కాగితాల కోసం ఏమైనా చేయడానికి వెనుకాడని ఖాకీలు తమ కర్తవ్యాన్ని క్రమ క్రమశిక్షణతో చేస్తారని అనుకోవడం నమ్మశక్యంగా ఉంటుందా అన్న మీమాంసకు విజ్ఞులైన వారు అనుమానం వ్యక్త పరుస్తున్నారు.ఇక చివరగా ముఖ్యంగా యావత్ వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులలో ఉన్న ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి.అసలు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గొప్ప రాజయోగి.ఆయన సంతానం బోలెడు.శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సిస్యుడైన సిద్దయ్య పెళ్లి వద్దని అన్నప్పుడు.. “సంసారమందునుంటూ సంసారం చేయుచూ సకలం సిద్ధి పొందు సిద్దా “అని జ్ఞానబోధ చేసి సిద్ధయ్య ను వివాహుతుడును చేశారు. అంటే “తామర ఆకుకు నీరు అంటుకోనట్లే, సంసారంలో ఉంటూనే లౌకిక విషయాలకు అతీతంగా జీవించాలని ప్రతి పనినీ భగవదర్పణంగా భావించి, ఫలితం మీద ఆశ లేకుండా బాధ్యతలు నెరవేర్చడమే కర్మయోగమని”శ్రీ బ్రహ్మంగారు సిద్ధ గురుభోదనలో తెలిపియున్నారు. ఇదే గీతలో కూడా చెప్పబడియుంది అయితే ఇంతటి గృహస్థాశ్రమంలో ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి సేవకు సన్యాశ్రమ ధర్మాన్ని స్వీకరించి ఆచరిస్తున్న ఆశ్రమ వాసులు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు మాతాజీలకు కూడా ఆక్కడ ఆశ్రమ జీవనం ఏర్పాటు చేయడం గొప్ప కార్యక్రమమే అయిన పదమూడు సంవత్సరాల పసికూన ప్రాణం తీసిందెవరు అన్న అనేక రకాల ప్రశ్నలకు ఆ వీరబ్రహ్మేంద్ర స్వామినే అన్ని సమాదానాలు చూపిస్తారని ఆశించాలి.

