*చిగురించిన మధు ఆశలు..
- పరిగణలోకి2016 నుంచి సీనియారిటీ
*ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
*ఏడేళ్ల నిరీక్షణ కు ముగింపు పలుకుతూ
*ఎన్నో సవాళ్లు.. మరెన్నో అడ్డంకులు అధిగమించి..
*నిజమైన స్నేహానికి చిహ్నం గా ఆర్ ఐ ఈ కృష్ణారెడ్డి నిలిచి
*పీఆర్ వింగ్ పై పై చేయి సాధించుటలో సఫలీకృతం చెంది
*ఇంజినీరింగ్ విభాగం అగ్రస్థానంలో నిలిపేలా…
*తమ ఉనికిని చాటుకున్న ఓ మధుసూదన్..
*ఇక అడిషనల్ డైరెక్టర్ ఉత్తర్వులే ఆలస్యం…
*సోమవారం తుది ఉత్తర్వులు జారీ చేసే అవకాశం..!
*ఇంచార్జ్ సంప్రదాయం కు తెర దింపుతూ…
*రెగులర్ అడిషనల్ డైరెక్టర్ గా బాధ్యతలు…
*నైరాశ్యంలో పీఆర్ వింగ్…
*సంబరాల్లో ఇంజినీరింగ్ వింగ్…
*అంపసయ్యపై పీఆర్ వింగ్ …
*ఆశల పల్లకీలో ఇంజినీరింగ్ వింగ్…
*మధు జీవితంలో సరికొత్త అధ్యాయం…
*సమాచార శాఖలో సరికొత్త ఒరవడి సాధ్యమేనా…
(రామమోహన్ రెడ్డి) - “కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకమ్ ।
మౌనేన కలహో నాస్తి, నాస్తి జాగరతో భయమ్ ॥”
ఈ సూక్తి యొక్క ముఖ్య ఉద్దేశం: మనిషి తన జీవితంలో ఎదురయ్యే సమస్యలను, పేదరికాన్ని అధిగమించడానికి కఠోర శ్రమయే మార్గం అని తెలియజేయడం.ఇక్కడ ఎందుకిలా చెప్పాల్సి వస్తుందయ్యా అంటే ఏడేళ్ళ నిరీక్షణ, ఎన్నో పోరాటాలు మరెన్నో చిక్కులు,ఆ చిక్కులతో సమస్యలు, ఆ సమస్యలతో సతమతమవవడం చివరికి న్యాయస్థానం మెట్లక్కడం ఆ తరువాత అనేక సంవత్సరాలు అడ్డంకులు ఆపై అలుపెరగని పోరాటం ఆ పోరాటం లో ఆరాట పడి ఆవేదనను గురికావడం ఇలా అనితర సాధ్యం అనుకున్న దానిని సునితర సాధ్యం చేసుకుని ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతికి పట్టాలి అన్న సూక్తి కి నిదర్శనం గా నిలిచాడు సమాచార శాఖ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ ఓ మధుసూదన.సమాచార శాఖలో నిత్యం ప్రజా బాహుళ్యం లో కనిపించి ప్రజలతో ప్రింట్ మీడియాతో నేరుగా సత్సంబంధాలు కలిగి ఉండే శాఖనే మెజార్టీ జర్నలిస్టులు పీఆర్ వింగ్ ఒకటే సమాచార శాఖ అని భావిస్తున్న తరుణంలో ఇంజినీరింగ్ అనేది కూడా కీలకమైనదేనని దానికి ప్రాధాన్యత కూడా ఎంతో ఉంది ప్రాచుర్యం పొందడం లో కాస్త వెనుక బడ్డ నేటి ప్రభుత్వ ఉత్తర్వులతో ఈ ఇంజినీరింగ్ కి సముచిత స్థానం కల్పించిందనే భావనలో ఇంజినీరింగ్ విభాగం వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కారణం పైన చెప్పిన సూక్తి లో మాదిరిగా సమాచార శాఖ లో పీఆర్ వింగ్ వారు పరిపాలన యంత్రాంగాన్ని నడిపిస్తూ ఉంటూ ఇంజినీరింగ్ విభాగం అందులో భాగమైన కేవలం పీఆర్ వింగ్ కె అధిక ప్రాధాన్యత ఇస్తూ ఇంజినీరింగ్ విభాగం వారిపై సవతి తల్లి ప్రేమ చూపడం కారణంగా ఇంత కాలం తరువాత తమ విభాగం నుంచి ఒకరు ఉన్నత స్థాయి పదవికి అర్హత సాధించారనే వాదం వినిపిస్తోంది.
ఈ నేపధ్యంలో చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ గా ఉన్నా ఓ మధుసూదన సర్వీస్ ను సీనియారిటీ ప్రాతిపదికన హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఆధారంగా నవంబర్ పదకొండవ తేదీ 2017 నుంచి ఉద్యోగ క్రమ బద్దీకరణ (ప్రొబేషన్) చేస్తూ 2016 సీనియారిటీ ని రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఆదేశాలతో గత కొన్ని సంవత్సరాలుగా ఇంచార్జ్ కే పరిమితమయిన అడిషనల్ డైరెక్టర్ పోస్ట్ శాశ్విత అంటే రెగులర్ అడిషనల్ డైరెక్టర్ గా నియామకం చేసేందుకు సమాచార శాఖ ఉన్నతాధికారులు చిక్కుముడి వీడి నట్లయింది.ఇప్పటి వరకు సమాచార శాఖలో చక్రం తిప్పిన పీఆర్ వింగ్ వారికి ఈ ఉత్తర్వులు చేదు అనుభవం ఎదురైందని చెప్పక తప్పడం లేదు.ఉమ్మడి రాష్ట్రంలో పీఆర్ వింగ్ వారేదే ఆధిపత్యం నడిచిందనేది సమాచార శాఖ లో ఉన్న రెండు విభాగాల్లో ఉన్న రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ సమాచార శాఖ డైరెక్టర్ గా ఇంజినీరింగ్ విభాగం నుంచి కిషోర్ బాబు కుర్చీ ఎక్కగా నవ్యాంధ్రప్రదేశ్ లో కూడా 2026 సంవత్సరం లో ఇంజినీరింగ్ విభాగం నుండి అడిషనల్ డైరెక్టర్ కుర్చీ సొంతం చేసుకోవడానికి సిద్ధం అయ్యారని చెప్పాలి.
“స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం
స్నేహమేరా నాకున్నదీ… స్నేహమేరా పెన్నిదీ..
స్నేహమే . . హొయ్
స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం…”
అనే ఈ సూక్తికి అక్షర సత్యాలుగా నిలిచాయి ఇంజినీరింగ్ విభాగం లో సీనియర్లు గా ఉన్న ఓ మధుసూదన,కృష్ణారెడ్డి ల స్నేహం.ఎందుకిలా గొప్పగా వర్ణన చేయాల్సి వచ్చిందంటే పీఆర్ వింగ్ లో దాదాపు మొత్తం సిబ్బంది పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు దాదాపు 400వందల మంది వరకు ఉన్నా పీఆర్ వింగ్ లో 800 వందల మంది ఉన్నా ఇప్పుడు ఉన్న సంఖ్యా బలం ప్రకారం ఇంజినీరింగ్ విభాగం తక్కువ సంఖ్య కలిగి ఉన్నా ఇంజినీరింగ్ విభాగం నుంచి కేవలం చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ గా ఉన్న ఓ మధుసూదనకు వెన్ను దన్నుగా నించింది మెజార్టీ శాతం రీజినల్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ కృష్ణా రెడ్డి మాత్రమే నన్న చర్చ జరుగుతోంది. మధు కృష్ణారెడ్డి లు సీనియర్ లు ఉన్నా ఇద్దరు కూడా మంచి స్నేహితులు కూడా అవ్వడంతో పీఆర్ వింగ్ పై పోరాటం చేసి తమ ఉనికిని కాపాడుకొని తాము కూడా తక్కువ కాదని చేసి చూపించారనేది ఇంజినీరింగ్ విభాగం నుండి వినిపిస్తోంది.
అయితే పీఆర్ వింగ్ లో మేధావి వర్గం ,పలుకుబడి ఉన్నా అన్ని ఉన్నా అల్లడి నోట్లో శని అన్న చందాన వారిలో వారికి ఉన్న అంతర్గత కలహాల కారణంగా రేగులర్ అడిషనల్ డైరెక్టర్ గా కాక పోయిన ఇంచార్జ్ అడిషనల్ డైరెక్టర్ గా ఖచ్చితంగా వారే ఉండాల్సింది పోయి ఇంజినీరింగ్ విభాగంకు బంగారు పళ్లెం లో పెట్టి ఇచ్చారనే వాదన లేకపోలేదు. ఇందుకు గల కారణాలు లేక పోలేదు.సీనియారిటీ ప్రాతిపదికన అప్పటికే జాయింట్ డైరెక్టర్లర్ గా ఉన్నా పి కిరణ్ కుమార్ ను కాదని నాటి కమిషనర్ తుమ్మా విజయకుమార్ రెడ్డి పరిపాలన అనుభవం,కార్య దక్షత లేని జోన్ 2 ఆర్జేడీ గా ఉన్న స్వర్ణలత ను అడిషనల్ డైరెక్టర్ గా ప్రకటన ల విభాగం జాయింట్ డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగించారు.అప్పగించిన తరువాత అయ్యో ఎంత తప్పు జరిగిపోయిందని అనుకోని లెంపకాయ వేసుకోబోగా చీర కొంగులో కొన్ని నోట్ల కట్టలు అందించబోగా తుమ్మా తూ తూ ఆన్నాడనే విమర్శలు నాటి నుంచి వినిపిస్తున్నాయి. ఇలా స్వర్ణలత జీవితాన్ని స్వర్ణమయం చేసుకుని శాలువా కప్పుకుని పోయే సరికి పీఆర్ వింగ్ లో ఉన్న ఐక్యత లోపించి కేవలం పదవి విరమణ కు మూడు రోజుల ముందు ఇంచార్జ్ అడిషనల్ డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగించారు.అయితే ఆయన తరువాత సీనియారిటీ గా ఉండి జోన్3 ఆర్జేడిగా ఉన్న తేళ్ల కస్తూరికి ప్రెస్ అకాడమీ సెక్రెటరీ, ఢిల్లీలోని ఏపీ ఐసీ ప్రత్యేక అధికారిగా నియమించి డైరెక్టర్ రేట్ పరిపాలన లో ఎలాంటి సంబంధం లేకుండా పోస్టింగ్ ఇచ్చారు. జయింట్ డైరెక్టర్ అడ్మిన్ గా జోన్ 4 ఆర్జెడీ గా ఉన్న మహబూబ్ భాషకు ఇంచార్జ్ గా నియమించారు. అదే తేళ్ల కస్తూరి జాయింట్ డైరెక్టర్ అడ్మిన్ గా ఆర్హత ఉన్నా ఆమెకు మొండి చేయి చూపినట్లు గా చర్చ నడుస్తోంది. రెగులర్ జెడిగా ప్రమోషన్ పొందిన వెంకటేస్వర ప్రసాద్ ఓడి మీద జోన్ 4 అరేజెడి గా వెళ్లడం జరిగింది.ఇలా పీఆర్ వింగ్ లో వ్యక్తుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలతో ఇన్ని సంవత్సరాలు కోర్టు ఆర్థర్ ఉన్నా రెగులర్ అడిషనల్ డైరెక్టర్ అవకాశం ఉన్నా ఇంజినీరింగ్ విభాగం వారిని ఆ కుర్చీ లో కూర్చో నివ్వకుండా చేసిన ప్రయత్నాలు నేటితో అన్ని ముగిసినట్లే అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు ఒక ఉద్యోగి తన ఉద్యోగ ప్రస్థానం లో తాను ఆడిరోహించాలని అనుకున్న స్థానంలో ఓ మధుసూదన కూర్చోవడానికి పరిపాలన పరమైన ,శాఖాపరమైన అడ్డంకులు పూర్తిగా తొలగించుకుని కార్య సాధకుడికి గా కొత్త రథసారధి గా అడిషనల్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించడమే తరువాయి గా నిలవడం పట్ల ఇంజినీరింగ్ విభాగం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

