క్రీడలుసౌతాఫ్రికా టీ20 ఛాంపియన్ సన్‌రైజర్స్.. ఎగిరి గంతేసిన కావ్య మారన్!

సౌతాఫ్రికా టీ20 ఛాంపియన్ సన్‌రైజర్స్.. ఎగిరి గంతేసిన కావ్య మారన్!

సౌతాఫ్రికా టీ20 లీగ్ సెకండ్ సీజన్‌ టైటిల్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టెర్న్ కేప్ సొంతం చేసుకుంది. అసాధారణ ప్రదర్శనతో వరుసగా రెండో టెటిల్ గెలిచి ఈ టోర్నీలో తమకు తిరుగులేదని నిరూపించుకుంది. శనివారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 89 పరుగులతో డర్బన్ సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసింది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 204 పరుగుల భారీ స్కోర్ చేసింది. ట్రిస్టన్ స్టబ్స్(30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56), టామ్ అబెల్(34 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ మామ(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42), జోర్డాన్ హెర్మెన్(26 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 42) మెరుపులు మెరిపించారు.
ఈ విజయం నేపథ్యంలో సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ ఎగిరి గంతేసింది. ఈ మ్యాచ్ ఆసాంతం తన చేష్టలతో గ్యాలరీలో సందడి చేసింది. ఈ ఫైనల్ మ్యాచ్ కన్నా కావ్య పాపనే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సన్‌రైజర్స్ బ్యాటర్లు బౌండరీలు బాదిన ప్రతీసారి కావ్య మారన్ సంబరాలు చేసుకుంది . చాలా హుషారుగా కనిపించిన ఆమె.. జట్టును తనదైన శైలిలో ఛీర్ చేసింది.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article