ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా వైకాపా పాలన
మున్సిపల్ వైకాపా ఇంచార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి
పులివెందుల
వైకాపా పాలనలో అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందాయి అనిమున్సిపల్ ఇంచార్జ్ వైయస్ మనోహర్ రెడ్డిఅన్నారు.శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు వెలమారి పల్లె గ్రామంలో మున్సిపల్ ఇంచార్జ్ వైయస్. మనో హర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ ,రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ హాల్ గంగాధర్ రెడ్డి, 13వ వార్డు కౌన్సిలర్ రంగనాయకులు, వైకాపా నాయకులు రమేష్ నాయుడు, శేఖర్ నాయుడులతో కలిసి గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వ హించారు.13వ వార్డు కౌన్సిలర్ రంగనాయకులు , రమేష్ నాయుడు, శేఖర్ నాయుడు, విజయ్ కుమార్ నాయుడులు వారికి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరించి ఎంత లబ్ధి పొందారోప్రజలకు వివరించారు .అనంతరం ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని వారి సమస్యలను పరిష్కరింప జేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ని అన్ని వర్గాల ప్రజలకులబ్ధి చేకూర్చారన్నారు. ముఖ్యంగా ప్రతిపేదవాడికి ఆరోగ్యం అందాలనే ఉద్దేశంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య పరీక్షలనునిర్వహించి ఉచిత మందులను పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు.నిత్యం ప్రజల కోసం కష్టపడే నాయకుడు ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని ,అలాంటి నాయకున్ని మళ్ళీ మనం ముఖ్య మంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.పార్టీలకు,కులాలకు,మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద వానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం జరిగిందన్నారు. అనంతరం వారికి కౌన్సిలర్ దుశ్శాలవాలతో, పూలహారాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ హఫీజ్, కో ఆప్షన్ మెంబర్ దాసరి చంద్రమౌళి,జే సి ఎస్ ఇంచార్జ్ చంద్రమౌళి, తదితర వైకాపా నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.