టాప్ న్యూస్విధ్వంసం.. విధ్వంసం… విధ్వంసం

విధ్వంసం.. విధ్వంసం… విధ్వంసం

ఏది విధ్వంసం… ఎవరిది విధ్వంసం…?
*విధ్వంసం రూపం మార్చుకుందా.. మలువు తిరిగిందా…
*వైఎస్ జగన్ పై పుస్తకమే ప్రచురించితిరి…
*ఆ ఐదేళ్ల పాలనంత అరాచకంగా అభివర్ణించితిరి..
*అందుకే ఆయనకు ప్రజల ఆదరణ కరువైంది…
*పుస్తక ఫలం ప్రెస్ అకాడమీ పదవి వచ్చే ..
*మీ సిన్సియర్ జర్నలిజం సూపర్..
*మరి నేటి జర్నలిస్టుల కు మీరు ఇస్తున్న మార్గదర్శకాలేమిటీ…
*మీ యూనియన్ నాయకులే సమర్థులా…
*ఏ జిల్లా సభ చూసిన
IJu,Apwuj వారే ఉండాలా…
*రాష్ట్రంలో ఇక జర్నలిస్ట్ సంఘాలు లేవా…
*వైఎస్ జగన్ విధ్వంసం పాలనలో సాక్షి కూడా ఉంది గా…
*అందులో పనిచేస్ వారు యూనియన్ నాయకులు గా ఉండచ్చునా…
*వైసీపీ హయాంలో ఐజేయు సభ్యులదే కీలక పాత్ర…
*కూటమిలోను ఐజేయు నాయకులదే హవ్వా. .
*రాష్ట్ర విభజన తర్వాత ఏపీ జర్నలిస్టుల పై తెలంగాణా వారిదే పెత్తనమా…
*ఆంధ్రుల ఆత్మాభిమానం తెలంగాణ వారికి తాకట్టు పెట్టాలా…
*విజయవాడ ప్రెస్ క్లబ్ గబ్బు గబ్బు అవుతూ ఉన్నా…
*తెలంగాణ యూనియన్ చే పీడించబడుతూనే ఉండాలా…
*ఆంధ్రులంతా చేతకాని వారేనా…
*ఏపీ జర్నలిస్ట్ లకు ఒరిగిందేమిటి ..
*అలపాటి గారు ఇవన్నీ అక్షర సత్యాలు కాదంటారా…ఔ నంటారా ..
*ఓరి ఆంధ్రుడా ఇక నైన ఆలోచన చేయరా…
*విధ్వంసం ఎవరు చేశారు ..ఎవరు చేస్తున్నారు…?
(రామమోహన్ రెడ్డి)

విధ్వంసం అంటే ఏదైనా వస్తువును, ఆస్తిని లేదా వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా నాశనం చేయడం లేదా పాడు చేయడం. దీనిని సాధారణంగా నాశనం, వినాశనం లేదా పతనం అని పిలుస్తారు.ఇక్కడ ఓ సీనియర్ పాత్రికేయుడు గత వైసీపీ ప్రభుత్వ పరిపాలన తీరుపై,అతి ముఖ్యమైనది ఏమిటంటే వైసిపి అధినేత గెలుపు ఆయన పార్టీ సాధించిన 151 సీట్ల మెజారిటీ కేవలము విభజిత ఆంధ్రప్రదేశ్ విధ్వంసానికేనని గంటా పధంగా చెబుతూ విధ్వంసం అనే పుస్తకాన్ని 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రచురించి అప్పటి మాజీ ముఖ్యమంత్రి, నేటి కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరించి నవ్యాంధ్రప్రదేశ్ ప్రజల ముందుకు తీసుక రావడం జరిగింది.ఇందులో వ్యాసకర్త చివరి సందేశం లో చెప్పబడిన కొన్ని అంశాలను పునః సమీక్ష కోసం చూస్తే..151 సీట్లతో అధికారాన్ని వైఎస్ జగన్ సంపూర్ణ అధికారంగా పరిగణించారని ,అది సహజంగా నిరంకుసాధికారం కింద పరినమించదని అన్నారు రచయిత.అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మీడియా సాక్షిగా జగన్ చేసిన వ్యాఖ్యలు జగన్ విధ్వంసానికి మూల కారణమని రచయిత రచనల ద్వారా అనుకోవడం లో తప్పులేదు లార్డ్ ఆక్టన్ అనే మేధావి 135 ఏళ్ల కింద చెప్పిన చెరువు చేయడం జగన్ విషయంలో సంపూర్ణంగా వర్తిస్తుందని చెప్పారు రచయిత.జగన్ అనే వ్యక్తి డబ్బుకోసం అధికారం అధికారం కోసం డబ్బు ఇలా అక్రమార్జన కు ఆయనకు ఆయనే సాటి అని అందుకోసం వ్యవస్థలని ధ్వంసం చేయడం పనిగా పెట్టుకుని పాలన సాగించాడని ,2019 ఎన్నికల తరువాత ఆంద్రప్రదేశ్ లో భారత రాజ్యాంగ స్పూర్తిపై నిరంతరం దాడి ప్రక్రియ అయినదని రచయిత తన తుది పలుకుల లో నిస్పష్టంగా చెప్పడం జరిగింది. ఇందుకు రచయిత గుండె డైర్యాన్ని మెచ్చుకోక తప్పదు.ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ లో విమర్శ అన్న పదం అది సద్విమర్శ కావచ్చు మరి ఏ ఇతరం కావచ్చు ఓర్వలేని స్థితిలో ఉన్న పరిస్థితులలో రచయిత ఒక సీనియర్ జర్నలిస్ట్ అవ్వడం మూలాన ఇలా నేరుగా పుస్తకాలు వేసి ప్రజల ముందు ఉంచడం అనేది ఒక సాహోసాపేతమే నని చెప్పక తప్పదు. అందుకు ఆయన కు ఇన్ని సంవత్సరాల తరువాత శుభాభివందనాలు తెలియ జేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంతకీ ఎవరా రచయిత ఇప్పుడెందుకు ఈ ప్రస్తావన, ఇది ముగిసిన అధ్యాయం, ఈ రాష్ట్ర ప్రజలు రచయిత రచించిన విధ్వంసం పుస్తక కారకుడుని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రక్కన కూర్చోబెట్టారు కదా అని అనుకోవచ్చు.అది నిజమే అయినా ఇక్కడ రచయిత అయిన సీనియర్ పాత్రికేయులు ఆలపాటి సురేశ్ కుమార్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించు కోవాల్సిన అవసరం సందర్భం వచ్చిందని చెప్పాలి. ఏమిటయ్యా అంటే ఆలపాటి సురేష్ కుమార్ ప్రస్తుతం శ్రీరాఘవాచారి ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఉన్నారు.ఆయన ప్రెస్ అకాడమీ చైర్మన్ హోదాలో ఈ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, సంక్షేమం కోసం వేసిన వేస్తున్న పెద్ద పీట గురించి నవ్యాంధ్ర ప్రదేశ్ జర్నలిస్ట్ వర్గాలలో జరుగుతున్న చర్చ సందర్భంగా ఇప్పుడు కూడా ప్రస్పుటం చేయక పోతే ప్రెస్ ఆకాడమికి గుర్తింపు కరువుతుందని భావించక తప్పదు. ఇక్కడ ఆలపాటి అద్భుతమైన పాలన్ గురించి చెప్పుకొనే ముందు జర్నలిజం, జర్నలిస్ట్ అంటే ఎవరు ఏమిటీ ఎలా అని తెలుసుకోవాలి.అవన్ని అందరికి విదితమే అయిన మరొక్కమారు పునశ్చరణ చేసుకోవడం లో తప్పేమీ లేదని భావిస్తూ..


సమాజంలో ఏమి జరుగుతుందో వాస్తవాలను, రుజువులతో సహా ప్రజల ముందు ఉంచడం.ప్రభుత్వాలు, నాయకులు, మరియు సంస్థల పనితీరును ప్రశ్నించడం ద్వారా ప్రజలకు జవాబుదారీతనం ఉండేలా చూడటం.సమకాలీన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, చర్చలకు వేదికగా నిలవడమనేది జర్నలిజమని పెద్దలు తెలిపియున్నారు.
ఇక జర్నలిస్ట్ అంటే ఎలాంటి పక్షపాతం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా వార్తలు రాయడం.నైతిక విలువలు: సమాచారాన్ని ధృవీకరించుకున్న తర్వాతే ప్రసారం లేదా ప్రచురణ చేయడం, తప్పుడు వార్తలను ప్రోత్సహించకపోవడం జర్నలిస్ట్ యొక్క లక్షణాలను తెలియజేస్తుంది.
అనాగరికం నుంచి నేటి ఆధునిక యుగం వరకు జర్నలిజం, జర్నలిస్ట్ ల అవతరణ అనేది భిన్నమైన రూపాలను పుణికి పుచ్చు కున్నప్పటికి ఆదరణను కోల్పోలేని పత్రికా రంగం గురించి
పత్రికొక్కటున్న పదివేల సైన్యము, పత్రికొక్కటున్న మిత్రకోటి, ప్రజలకు రక్ష లేదు పత్రిక లేనిచో… ” అని చెప్పిన పత్రికా సైన్యాధ్యక్షుడు నార్ల వెంకటేశ్వరరావు. పత్రికను పైకి తేవడానికి నార్ల అనేక కొత్త ఒరవడులు ప్రవేశపెట్టారు.
‘కాగడా’, ‘జనవాణి’తో తాపీ ధర్మారావు ప్రారంభించిన వ్యావహారిక భాషా ఉద్యమాన్ని నార్ల ఆంధ్ర ప్రభ, ఆంధ్రజ్యోతి ద్వారా సమర్థంగా కొనసాగించారు. తెలుగులో ఆలోచించి, తెలుగు నుడికారంలో తెలుగుదనం ఉట్టిపడేటట్టు రాయగలిగినప్పుడే తెలుగు వారిలో మనం కదలిక పుట్టించగలం’ అని ఆయన తోటి జర్నలిస్టులకు ఉద్బోధించారు.


సంపాదకుడు అనే మాటను నార్ల ఉపయోగించేవారు కాదు. ఎడిటర్ అనే రాసుకునే వారు, పిలిపించుకునేవారు. ఎడిటర్ అనే ఇంగ్లీషు మాటకు సంపాదకుడు అనే తెలుగు అనువాదాన్ని ఆయన ఆమోదించలేదు. సంపాదకుడు అంటే ఏమిటో, సంపాదకుడి స్థానం ఏమిటో యాజమాన్యాలకూ, సమాజానికీ తెలియజెప్పడానికి ఆయన శత విధాలుగా ప్రయత్నించారు.
ఎడిటరైనవాడు బిడియము చూపుచో ధాటి తగ్గు వృత్తి ధర్మమందు, కడుపుకూటి రాత కక్కుర్తి రాతరా’ అంటూ తోటి రచయితలనూ, భావి సంపాదకులనూ హెచ్చరించిన యోధుడు నార్ల. ముఖ్యంగా జర్నలిజం రంగంలోకి అడుగుపెట్టేవారు నిజాయితీగా, నిర్భీతిగా ఉండాలని కోరేవాడు నార్ల. “నిజము కప్పిపుచ్చి నీతిని విడనాడి స్వామి సేవ సేయు జర్నలిస్టు తార్చువాని కంటే తక్కువ వాడురా” అని చెప్పాడు.ఇక్కడ నార్ల అంటే
నార్ల వెంకటేశ్వరరావు తెలుగునాట ప్రముఖ పాత్రికేయుడు, హేతువాది, రచయిత. వీ.ఆర్.నార్లగా కూడా వీరు ప్రసిద్ధులు. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలకు చాలా కాలం సంపాదకులుగా ఉన్నాడు. పత్రికా రచనలే కాక పలు నాటికలు, కవితలు, కొన్ని కథలు రాసాడు. రెండు పర్యాయములు రాజ్యసభ సభ్యునిగా పనిచేశాడు.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంలోని శాసన, కార్యనిర్వాహక, న్యాయ శాఖలతో పాటు మీడియా నాల్గవ స్థానంలో ఉండి బాధ్యతను నిర్ధారిస్తుంది.అందుకే మీడియాను నాలుగో స్తంభంగా పిలువ బడుతుంది.
ఇప్పటి వరకు ఉదహరించిన పై విషయాలన్నింటి ని క్షుణ్ణంగా అవపోషన చేసుకున్న ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ఈ రాష్ట్ర జర్నలిస్ట్ లకు చేస్తున్న సేవ, అందిస్తున్న గౌరవం గురించి ఏమనని పొగడాలో అర్థం కాని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనడం ఈ రాష్ట్ర జర్నలిస్ట్ లు చేసుకున్న దౌర్భాగ్యమా అని అనడం లో సందేహం అక్కర్లేదు. ఆలపాటి సురేష్ కుమార్ ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యినప్పటికి ఆయన ఐజేయు అనుబంధం గా ఉంటూ ఈ రాష్ట్రంలో యూనియన్ పేరుతో జర్నలిస్టుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న APUWJ యూనియన్ నాయకుడి గానే వ్యవహారం ఉందని అనాల్సి రావడం ఎంతో బాధాకరం.
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ అనేది జర్నలిజంలో నైపుణ్యాలను, ప్రమాణాలను పెంచడానికి ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంస్థ. ఇది విజయవాడ కేంద్రంగా పనిచేస్తుంది.ఇలాంటి ప్రెస్ అకాడమి ఎవరి సంక్షేమం కోసం పనిచేస్తోందయ్యా అంటే ప్రస్తుత చైర్మన్ ఆలపాటి మొదటి నుండి కొనసాగుతూ ఉన్న యూనియన్ బలోపేతం కోసమే అన్న మీమాంసకు పరిస్థితి దారితీస్తుంది.ఈ రాష్ట్రంలో ఆంద్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కు మాత్రమే సింహభాగం కల్పిస్తూ ఉండడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది.ఈ రాష్ట్రంలో అనేక యూనియన్ లు ఉన్నాయి .అక్రిడేషన్ కమిటీ అర్హత పొందినవి ,సొసైటీ పరంగా గుర్తింపు పొందిన జర్నలిస్ట్ ల యూనియన్ లు ఉన్నాయి.అయితే ఇక్కడ అచ్చర్య కర విషయం ఏమిటంటే ఏదయితే ప్రెస్ అకాడమి చైర్మన్ సింహభాగం కల్పిస్తున్నారో ఆ యూనియన్ ఈ రాష్ట్రం ది కాదు.దానికి ఈ రాష్ట్రంలో గుర్తింపు లేదు.ఆ యూనియన్ పై ఇప్పటికే అనేక కేసులు కోర్టుల లో అపరిష్కృతంగా ఉన్నాయి.మరెన్నో ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి.ఆ యూనియన్ తెలంగాణ నాయకుల కబంధ హస్తాల్లో ఉందనేది అందరికి విదితమే.ఉమ్మది ఆంద్రప్రదేశ్ లో అభివృద్ధి చెందిన తరువాత తెలంగాణ ఉద్యమం తో తెలంగాణ తన్నేస్తే రాజదాని రాష్ట్రంలో నవ్యాంధ్ర ప్రదేశ్ ప్రజలు బ్రతుకు ఉన్నారు ఇప్పటికి తెలంగాణ ప్రజలు అక్కడి రాజకీయ పార్టీల నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై దుమ్మెత్తి పోస్తున్నారు.ఈ యూనియన్ అనుబంధం గా వంగి వంగి దండాలు పెడుతున్న ఐజేయూ నాయకులు తెలంగాణ వారే.వీరందరి ఆధ్వర్యంలో అక్రమంగా తమదే అని గోడలపై అక్షరాలు వేసుకున్న విజయవాడి ప్రెస్ క్లబ్ వ్యవహారం గబ్బు గబ్బు గా ఉందనేది ఆలపాటి లాంటి విజ్ఞులైన వారికి తెలియదా అంటే అచ్చర్యపడాల్సిన పరిస్థితి.ఒక వేళ ఆలపాటి ఆ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేసినా ఆలపాటి మాట ను ఆల కించే వారు అక్కడ ఉన్నారా అన్న ధర్మ సందేహం వ్యక్తం చేస్తున్నారు మెజారిటీ జర్నలిస్ట్ లు.
ఇక పోతే గత ప్రభుత్వం లో ఐజేయు నాయకుడు దేవులపల్లి అమర్ జాతీయ మీడియా సలహదారుడు, కూటమి ప్రభుత్వం లో కూడా ఆయన ఐజేయు నాయకుడే. ఇంకా ఏదయితే ఈ రాష్ట్రం, ఎస్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ విధ్వంసం చేశారని పుస్తకం రాస్తే ఆ పుస్తక ఫలం ద్వారా ప్రెస్ అకాడమి చైర్మన్ గా పదవి కట్టబెట్టడం జరిగిందనే ప్రచారం జర్నలిస్ట్ వర్గాలలో ఉన్నా ఆ విధ్వంసం కు కారణమైన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మానస పుత్రిక సాక్షిలో పనిచేస్తున్న వివిధ హోదాలో ఉన్న జర్నలిస్ట్ లు ఐజేయు, ఏపీయూ డబ్ల్యూ జే లో కీలక పదవుల్లో ఉన్నారనేది అందరికి విదితమే.ఇక అక్రిడేషన్ కమిటీలలో సాక్షి పత్రిక ,సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా వారికి చోటు కల్పిస్తే ప్రభుత్వం మొట్టికాయలు వేస్తే మౌఖిక ఆదేశాలతో వారి పేర్లను తొలగించి వేరే వారికే ఇచ్చారనే గుసగుసలు కూడా వినిపించాయన్నది వాస్తవం కాదా అన్న ప్రశ్న జర్నలిస్ట్ వర్గాల నుండి వినిపిస్తోంది
ఇక పోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీడియా మొగల్ అని పిలువబడే రామోజీ రావు స్థాపించిన ప్రింట్,ఎలక్ట్రానిక్, జర్నలిజం ద్వారా పనిచేస్తున్న వందలాది మంది సీనియర్ లు ఉన్నా కేవలము ఆంధ్రజ్యోతి లో పనిచేస్తున్న వారే ఈ రాష్ర్టంలో ఎక్కడ శిక్షణ తరగతులు జరిగిన వారే రావాలి ఆ యూనియన్ నాయకులే స్టేజిపై ఆసీనులై ఉండాలని శ్రీ రాఘవాచారి ప్రెస్ అకాడమి రికార్డుల లో ఏదైనా పొందు పరిచి ఉందా లేక ఈ కూటమి ప్రభుత్వం ప్రత్యేక నియమాలను రూపొందించిందా అన్న భిన్నమైన ప్రశ్నలు జర్నలిస్ట్ వర్గాలు వెళ్ళబుచ్చు తున్నాయి.

ఇదే విదంగా ప్రెస్ అకాడమి అనేది స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నప్పటికీ చైర్మన్ కూడా ఏక పక్షంగా కాకుండా జర్నలిస్టుల సంక్షేమం కోసం అన్ని యూనియన్ లకు తగిన గౌరవం ఇవ్వాల్సి ఉండగా కేవలము ఐజేయు,ఏపీయూ డబ్ల్యూజే సంఘ నాయకులు లేనిదే శిక్షణా తరగతులు జరపడం లేదని జాప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్తపల్లి ఆనిల్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగ దానిపై సమాచార శాఖ డైరెక్టర్ ను విచారణకు ఆదేశించడం కూడా జరిగింది. అలాగే బైలా ప్రకారం ప్రెస్ అకాడమి కౌన్సిల్ సభ్యులు లేకుండా నే ఏక పక్ష నిర్ణయాల తో ముందుకు సాగుతున్నారని ఏపీ ఎంఎఫ్ యూనియన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాడం జరిగింది.
ఇలాంటి విమర్శలు, ఆరోపణలు ప్రెస్ అకాడమి ఎదుర్కొడానికి కారణం కేవలము చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ఐజేయు, ఏపీయూ డబ్ల్యూజె యూనియన్ లో ఉన్న నాయకుడి గా వ్యవవహరం ఉండటమే కారణమని సీనియర్ పాత్రికేయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో జగన్ విధ్వంసం పై పుస్తకం రాసి పుస్తక ఫలం పొందిన ఆలపాటి సురేష్ కుమార్ ఐజేయు, దాని అనుబంధ సంస్థ ఏపీయూడబ్ల్యూజే యూనియన్ నాయకులు ద్వారా జర్నలిస్ట్ లకు చేస్తున్నది విధ్వంసం కాదా లేక విధ్వంసం రూపం మార్చుకున్నదా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇతర యూనియన్ ల నేతలు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article