Sunday, February 15, 2026

Creating liberating content

తాజా వార్తలుపోలవరం నియోజకవర్గంలో రూ.46 కోట్లతో 170 వాటర్ ట్యాంకులు నిర్మాణం.

పోలవరం నియోజకవర్గంలో రూ.46 కోట్లతో 170 వాటర్ ట్యాంకులు నిర్మాణం.

ఎమ్మెల్యే తెల్లం బాలరాజు.

ప్రజాభూమి, బుట్టాయగూడెం.
పోలవరం నియోజకవర్గంలో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడానికి రూ. 46 కోట్లతో 170 వాటర్ ట్యాంకులు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినట్లు పోలవరం శాసనసభ్యుడు తెల్లం బాలరాజు తెలిపారు.మండలంలోని దుద్దుకూరులో బుధవారం వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ తాగునీటి సమస్యలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి, సమస్య పరిష్కారానికి వాటర్ ట్యాంకులు నిర్మించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు. దీనితో నియోజకవర్గంలో మొత్తం 170 వాటర్ ట్యాంకర్ నిర్మాణానికి 46 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ప్రకటించారు. బుట్టాయిగూడెం మండలంలో 12 కోట్ల రూపాయలతో 40 వాటర్ ట్యాంకులు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ డబ్ల్యూఎస్ ఏ ఈ మురళీకృష్ణ, పలువురు ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article