హిందూపురం టౌన్
హిందూపురం పట్టణానికి చెందిన సీనియర్ బిజెపి నాయకులు పిడి పార్థసారథి తిరుపతి పార్లమెంట్ ఇన్చార్జిగా నియమితులయ్యారు ఈ మేరకు రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురంధరేశ్వరి నియామక ఉత్తర్వులను విడుదల చేశారు తన నియామకం పట్ల పిడి పార్థసారథి స్పందిస్తూ భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు అందుకు తానే ఓ నిదర్శనం అన్నారు గత 25 ఏళ్లుగా బిజెపి పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ మేరకు పార్థసారథి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరిని కలిసి సన్మానించారు తన నియామకానికి సహకరించిన బిజెపి నేతలు విష్ణువర్ధన్ రెడ్డి శివ నారాయణ జిఎం శేఖర్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు

