ముదిగుబ్బ
ముదిగుబ్బ మండల కేంద్రంలో తారురోడ్డు మరమ్మతులను ధర్మవరం మాజీఎమ్మెల్యే సొంత నిధులతోచేయించారు. ముదిగుబ్బ పట్టణ నడిబొడ్డున తారురోడ్డు గుంతలమయమై గతనెలరోజులుగా తరచూ ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈవిషయం పట్టణ ప్రజలు బిజెపి, సిపిఐ నాయకులు పలుమార్లు అధికారులకు విన్నవించిన ప్రయోజనం లేకపోవడంతో మాజీఎమ్మెల్యే అనుచరుల దృష్టికి తీసుకురావడం జరిగింది. అనుచరులద్వారా సమస్యను తెలుసుకున్న గోనుగుంట్ల సూర్యనారాయణ ఆదివారంరాత్రి మరమ్మతు పనులను చేయించారు. ఈసందర్భంగా వర్తకులు, ముదిగుబ్బ పట్టణ, మండలప్రజలు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.