వాలంటీర్ల సేవలు నిలిపివేయటం దురదృష్టకరం…. వైయస్సార్సీపి అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్
కనిగిరి :వృద్ధులైన అవ్వా తాతలకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సామాజిక పెన్షన్లను వాలంటీర్లు పంపిణీ చేయకుండా తన తొత్తుల ద్వారా ఆపించిన చంద్రబాబు నాయుడు దుర్మార్గుడని ఏ కోశాన మానవత్వం లేదని సమాజంలో బాధిత ప్రజలకు అందిస్తున్న పెన్షన్ పైన కూడా తన అక్కస్సును వెళ్ళగక్కిన చంద్రబాబు పిడుగు లాంటివాడని అన్ని వ్యవస్థలను సమాజాన్ని ధ్వంసం చేసే చంద్ర పిడుగు అని కందుకూరు వైఎస్ఆర్సిపి అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ ప్రకటనలో తీవ్రంగా ఆక్షేపించారు. ప్రతి ఇంటికి వెళ్లి కులము మతము ప్రాంతము పార్టీ చూడకుండా అర్హులైన వారందరికీ మూడు వేల రూపాయల చొప్పున జగనన్న అందించిన వైయస్సార్ పెన్షన్ కానుకను ప్రతి నెల ఒకటవ తారీఖున వారి గడప ముంగిటకు వెళ్లి అందించిన వాలంటరీలను వారి సేవలను నిలిపివేయమని పచ్చ పార్టీలు వారి తొత్తు పార్టీలు వారి అనుకూల మీడియాలు వారి జేబు సంస్థలు ఎన్నో అడ్డంకులు సృష్టించారు. వృద్ధుల పట్ల ఒంటరి మహిళల పట్ల వితంతువుల పట్ల పచ్చ పార్టీ స్వభావం బహిర్గతమైనది.