సినిమారజనీ కెరియర్లో ప్రత్యేకం .. 'వేట్టయాన్'!

రజనీ కెరియర్లో ప్రత్యేకం .. ‘వేట్టయాన్’!

రజనీకాంత్ టైటిల్ పాత్రలో ‘జై భీమ్’ ఫేమ్ టీ.జే. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ‘వేట్టయాన్’ చిత్రం రూపొందుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఎన్నో ప్రముఖ చిత్రాలను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుభాస్కరన్ భారీ ఎత్తున ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా .. రితికా సింగ్ .. మంజు వారియర్ వంటి భారీ తారాగణం నటిస్తోంది.జాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. రజనీకాంత్ ఈ మూవీ షూటింగ్‌ను పూర్తిచేసుకున్నారు. తన పాత్రకు సంబంధించిన షూట్‌ను పూర్తిచేయడంతో చిత్రయూనిట్ ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో ట్వీట్ వేస్తూ ఈ విషయాన్ని ప్రకటించింది. యూనిట్ సభ్యులు అంతా కలిసి రజనీకాంత్‌కి గ్రాండ్‌గా వీడ్కోలు పలికారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article