కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ మీద హత్యాచార ఘటనపై తెలంగాణ మంత్రి సీతక్క స్పందించారు. ఇది చాలా దారుణమైన విషయమన్నారు. మహిళల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఇందుకోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. డాక్టర్లకు తమ ప్రభుత్వం అండగా నిలబడుతుందన్నారు. డ్రగ్స్ నియంత్రణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

