సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ రోజు తెల్లావారుజామున కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. ప్రస్తుతం ఎమ్మెల్యే వాహనాన్ని నడిపిన డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం గతంలో కూడా బీఆర్ఎస్ నేత, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. నల్గొండలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభకు హాజరై తిరిగి వస్తున్న క్రమంలో కూడా నార్కట్‌పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాద ఘటనలో ఎమ్మెల్యే లాస్య నందిత తలకు గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అప్పుడు ప్రమాద సమయంలో కారులో ఎమ్మెల్యేతోపాటు ఆమె సోదరి నివేదిత, ఇద్దరు గన్‌మెన్‌లు ఉన్నారు. ఇక గతేడాది ఫిబ్రవరి నెలలోనే ఆమె తండ్రి ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. ఇప్పుడు కుమార్తె ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం పాలయ్యారు.