Sunday, February 15, 2026

Creating liberating content

సినిమాశారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య దేవి బర్త్ డే సెలబ్రేషన్

శారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య దేవి బర్త్ డే సెలబ్రేషన్

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రంగా “శారీ” పాన్ ఇండియా స్థాయిలో నవంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. గిరి కృష్ణకమల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని, ప్రముఖ వ్యాపారవేత్త రవి వర్మ తన ఆర్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. సత్య యాదు మరియు ఆరాధ్య దేవి ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. ఇది సైకలాజికల్ థ్రిల్లర్‌గా, పలు నిజజీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం.ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న హీరోయిన్ ఆరాధ్య దేవి సెప్టెంబర్ 28న తన పుట్టినరోజు జరుపుకుంది. ఆరాధ్య కేరళకు చెందిన అమ్మాయి కాగా, తొలుత ఆమె శ్రీలక్ష్మి అనే పేరుతో గుర్తింపు పొందింది. రామ్ గోపాల్ వర్మ, ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్ ద్వారా ఆరాధ్యను గుర్తించి, “శారీ” చిత్రంలో ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఆమె లుక్, శారీ ధరించే అమ్మాయి పాత్రకు సరిపోతుందని భావించి చిత్ర బృందం ఏకగ్రీవంగా ఆమెను ఎంపిక చేసింది.ఆరాధ్య పుట్టినరోజు సందర్భంగా రాజీవ్ డెన్ వద్ద ప్రత్యేక సెలెబ్రేషన్స్ నిర్వహించారు. రామ్ గోపాల్ వర్మ నేతృత్వంలో, చిత్ర నిర్మాత రవి వర్మ, దర్శకుడు గిరి కృష్ణకమల్, హీరో సత్య యాదు పాల్గొని, ఆరాధ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వెరైటీగా భారీ కత్తితో కేక్ కట్ చేయించడం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article