సినిమాపూజా కార్యక్రమం జ‌రుపుకున్న‌ ప్రభాస్ కొత్త మూవీ

పూజా కార్యక్రమం జ‌రుపుకున్న‌ ప్రభాస్ కొత్త మూవీ

రెబల్ స్టార్ ప్రభాస్, ‘సీతారామం’ ఫేమ్ ద‌ర్శ‌కుడు హను రాఘవపూడి కాంబోలో తెర‌కెక్క‌నున్న కొత్త మూవీ శ‌నివారం పూజా కార్య‌క్ర‌మం జ‌రుపుకుంది. ఈ కార్య‌క్ర‌మంలో డార్లింగ్ ప్ర‌భాస్‌తో పాటు డైరెక్ట‌ర్ హ‌నూ, మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడు ప్రశాంత్ నీల్, ఇత‌ర సినీ ప్ర‌ముఖులు సందడి చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రభాస్ న్యూ లుక్ ద‌ర్శ‌న‌మిచ్చాడు. ఇప్పుడు ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. కాగా, ఈ సినిమా ఓ ఎపిక్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్ ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల‌ టాక్.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article