తాజా వార్తలుముద్రగడకు ఘనంగా నామకరణ మహోత్సవం

ముద్రగడకు ఘనంగా నామకరణ మహోత్సవం

ఫొటో పెట్టి నామకరణ మహోత్సవం నిర్వహించిన నెటిజన్లు

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానంటూ శపథం చేసిన కాపునేత ముద్రగడపై సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన సందర్భంగా పవన్‌కు ముద్రగడ ఆ సవాల్ విసిరారు. ఇప్పుడు పవన్ పిఠాపురంలో గెలవడమే కాకుండా అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోటీచేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి నూటికి నూరుశాతం ఫలితం సాధించడంతో నెటిజన్లు ఆయనను లక్ష్యంగా చేసుకున్నారు.మరోవైపు, 175కి 175 స్థానాల్లో పోటీచేసిన అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పిఠాపురంలో పవన్ గెలిచిన తర్వాత ముద్రగడ సోషల్ మీడియాకు లక్ష్యంగా మారారు. మరీ ముఖ్యంగా జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ముద్రగడను ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఆయనకు నామకరణ మహోత్సవం పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముద్రగడ ఫొటో ముందు అరటిపండ్లు, కేక్ ఉంచి పద్మనాభరెడ్డి అంటూ మూడుసార్లు ఫొటోలోని చెవి వద్ద ఊది కొత్త పేరు పెట్టారు. వైరల్ అవుతున్న ఈ వీడియోపైనా సెటైర్లు పేలుతున్నాయి.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article