సినిమాముసాఫా: ది ల‌య‌న్ కింగ్' ట్రైల‌ర్ విడుద‌ల చేసిన మ‌హేశ్ బాబు

ముసాఫా: ది ల‌య‌న్ కింగ్’ ట్రైల‌ర్ విడుద‌ల చేసిన మ‌హేశ్ బాబు

‘ముసాఫా: ది ల‌య‌న్ కింగ్’ మూవీకి సంబంధించిన తెలుగు ట్రైల‌ర్‌ను ప్రిన్స్ మ‌హేశ్ బాబు తాజాగా విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు ఈ మూవీలో వాయిస్ అందించే అవ‌కాశం ల‌భించినందుకు ఆనందంగా ఉంద‌ని సూప‌ర్ స్టార్ తెలిపారు. ఇందులో ఆయ‌న సింహం ముసాఫాకు గాత్ర‌దానం చేశారు.
ట్రైల‌ర్‌లో సింహానికి ప్రిన్స్ వాయిస్‌, డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. ముసాఫాకు మ‌హేశ్ బేస్ వాయిస్ బాగా స‌రిపోయింద‌ని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ ఏడాది చివ‌రిలో డిసెంబ‌ర్ 20న ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమా విడుద‌ల కానుంది.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article