సినిమా'ది ఫేసెస్ ఆఫ్ ఫియర్' అనే క్యాప్షన్‌తో దేవ‌ర నుంచి కొత్త పోస్ట‌ర్ రిలీజ్

‘ది ఫేసెస్ ఆఫ్ ఫియర్’ అనే క్యాప్షన్‌తో దేవ‌ర నుంచి కొత్త పోస్ట‌ర్ రిలీజ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘దేవర’ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకువస్తున్నారు,మొదటి భాగం సెప్టెంబర్ 27, 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. విడుదల తేదీకి మరొక నెల మాత్రమే ఉండటంతో, మేకర్స్ తాజాగా ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్ రెండు భిన్నమైన లుక్స్‌లో కనిపించారు, దీని ద్వారా సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారా అనే సందేహాలు అభిమానుల్లో రేకెత్తుతున్నాయి.పోస్టర్‌ పై “ది ఫేసెస్ ఆఫ్ ఫియర్” అనే క్యాప్షన్‌తో మేకర్స్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా షేర్ చేశారు. “మరో నెలలో అతడి రాక ప్రపంచాన్ని కదిలిస్తుంది. సెప్టెంబర్ 27న థియేటర్లలో అతడి మెజెస్టిక్ మ్యాడ్నెస్ ను చూసేందుకు సిద్ధంగా ఉండండి” అంటూ చిత్ర బృందం పోస్టర్ తో పాటు రాసుకొచ్చింది.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article