సినిమామ‌హేశ్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన తార‌క్‌

మ‌హేశ్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన తార‌క్‌

నేడు సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు సినీ, వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు బ‌ర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. తాజాగా జూనియ‌ర్ ఎన్‌టీఆర్ కూడా ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా మ‌హేశ్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ‘పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు మ‌హేశ్ అన్నా. ఈ ఏడాదంతా మీకు అద్భుతంగా ఉండాల‌ని కోరుకుంటున్నా..’ అంటూ తార‌క్ ట్వీట్ చేశారు. ఇదిలాఉంటే.. ఈ రోజు ప్రిన్స్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న కెరీర్‌లోనే క్లాసిక్ మూవీ అయిన మురారి రీరిలీజ్ అయింది. దాంతో ఫ్యాన్స్‌ థియేటర్లలో పండగ చేస్తున్నారు. ఎక్కడ చూసినా కేరింతలు, కేకలు.. సందడే సందడి.
మహేశ్‌ బాబు, సొనాలి బింద్రే కాంబోలో దర్శకుడు కృష్ణవంశీ 2001లో మురారి చిత్రాన్ని తెరకెక్కించారు. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీకి గాను సూప‌ర్ స్టార్‌కు స్పెషల్ జ్యూరీ విభాగంలో నంది అవార్డు కూడా దక్కిన విష‌యం తెలిసిందే.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article