Monday, February 16, 2026

Creating liberating content

సినిమాత‌ల్లి పుట్టిన‌రోజున తిరుమ‌ల‌కు జాన్వీ క‌పూర్‌

త‌ల్లి పుట్టిన‌రోజున తిరుమ‌ల‌కు జాన్వీ క‌పూర్‌

అలనాటి నటి శ్రీదేవి జయంతి సందర్భంగా ఆమె కుమార్తె జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. జాన్వీ మెట్ల దారి మీదుగా కొండపైకి చేరుకుని స్వామివారి దర్శనం చేసుకున్నారు. ప్రతీ ఏటా జాన్వీ ఇదే విధంగా చేస్తుంటారు.ఈ సందర్భంగా జాన్వీ తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు. ఇందులో తిరుపతి మెట్లు, తల్లితో చిన్నప్పటి ఫోటో, తాను చీరలో ఉన్న ఫోటోలు పంచుకున్నారు. “హ్యాపీ బర్త్ డే అమ్మా. ఐ లవ్ యూ” అని దానికి క్యాప్షన్ ఇచ్చారు.జాన్వీ కపూర్ చీర కట్టడం తన తల్లికి ఎంతో ఇష్టమని పలు సందర్భాల్లో వెల్లడించారు.జాన్వీ కపూర్ ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే, జూనియర్ ఎన్‌టీఆర్ సరసన నటిస్తున్న ‘దేవర’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశిస్తున్నారు. ఈ సినిమా నుండి విడుదలైన ఆమె పోస్టర్, పాటకు మంచి స్పందన లభించింది.అలాగే, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలో కూడా జాన్వీ కథానాయికగా ఎంపికయ్యారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article