సాహిత్యంముత్య‌పుపందిరి వాహనంపై బకాసుర వధ అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి..!

ముత్య‌పుపందిరి వాహనంపై బకాసుర వధ అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి..!


చంద్రగిరి:శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శ‌నివారం రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీనివాసుడు బకాసుర వధ అలంకారంలో ముత్య‌పుపందిరి వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.
రాత్రి 7 గంటలకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
వాహ‌న‌సేవ‌లో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, శ్వేత డైరెక్టర్ భుమన్, ఏఈవో గోపినాథ్‌, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, ఆల‌య అర్చ‌కులు బాలాజి రంగాచార్యులు,టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article