జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ పార్టీ కండువాలతో స్వాగతం పలికారు.
జగ్గంపేట :జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నేత నాగిరెడ్డి సత్యసాయి కృష్ణ వైసీపీకి రాజీనామా చేసి తెల్లాప్రగడా మణికుమార్, నూకరాజు, పసగడ్డ రమేష్, కర్ర వెంకటరాజు ,సతీష్, కోటి, ఏసు, ఆనంద్, చిన్ని, జయ బాబు తదితర అనుచరులతో 30 కుటుంబాలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ నెహ్రూ నవీన్లు పార్టీ కండువాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి సత్యసాయి కృష్ణ మాట్లాడుతూ యువతను అన్ని రకాలుగా మోసం చేసిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్ది దింపాలని ఈరోజు మేము అందరం ఆ పార్టీకి రాజీనామా చేసి నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ నాయకత్వంలో పనిచేయడానికి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, దేవరపల్లి మూర్తి, కందుల వీరబాబు, బోండా రాజేష్, నాగిరెడ్డి భాస్కరరావు, నేదురి గణేష్, వేములకొండ జోగారావు, నాగిరెడ్డి అనిల్ కుమార్, జీను పెద్ద రాంబాబు, పలివెల ఏసు రాజు, నాగిరెడ్డి శ్రీనివాస్, నండ్ల చిరంజీవి, బోర సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.