Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుఎమ్మెల్యేగా గెలిపించండి ఐదేళ్లు అండగా ఉంటా…… బొజ్జల సుధీర్ రెడ్డి

ఎమ్మెల్యేగా గెలిపించండి ఐదేళ్లు అండగా ఉంటా…… బొజ్జల సుధీర్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తాం…. టీడీపీలో భారీ చేరికలు….

రేణిగుంట
రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే ఐదేళ్లు మీకు అందుబాటులో ఉండే సేవ చేస్తానని శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని బస్టాండ్ నందు పట్టణానికి చెందిన యువ నాయకులు బుల్లెట్ బాబు,రాజ,షబ్బీర్ ఆధ్వర్యంలో సుమారు వందమంది టిడిపిలోకి చేరారు.వారికి తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు టిడిపిని ఆదరించి గెలిపించాలని కోరారు.వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు చంద్ర రెడ్డి, పట్టణాధ్యక్షుడు మహబూబ్ బాషా,మునస్వామి నాయుడు,డి.పుష్పనాధం, కొరియర్ రవి,నెల్లూరు సుబ్రహ్మణ్యం, సెవెన్ హిల్స్ రాము,క్రాంతి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article