తాజా వార్తలుచామవరంలో జనసైనిల సమరోత్సహం మీ ఇంటికి మీ దివ్యకు బ్రహ్మ రధం

చామవరంలో జనసైనిల సమరోత్సహం మీ ఇంటికి మీ దివ్యకు బ్రహ్మ రధం

తుని

దూకుడే..దూకుడు..జనసైనికులు వీర దూకుడు.. చామవరంలో జనసైనికులు సత్తాచాటారు.జనసేన బలమెంతో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం ద్వారా చాటిచెప్పారు.అందరి నోటా ఒక్కటే మాట..ఒక్కటే నినాదం.అదే జయహో దివ్య.మేడం దివ్యను అసెంబ్లీ గడపెక్కించి పవన్ కళ్యాణ్ కు గిప్ట్ ఇస్తామని దివ్యమ్మ గెలుపు కోసం తగ్గేదేలే అంటున్న జనసైనికులు తెలుగుదేశం శ్రేణులతో జత కట్టిన ప్రచార పర్వంలో దూసుకుపోయారు.సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత కరపా అప్పారావు ను ముందుంచి తెలుగుదేశం పార్టీకి బంపర్ మెజార్టీ సాధనలో అటు టీడీపీ, జనసేన కూటమి కార్యకర్తలు సమిష్టి బాధ్యతతో పని చేస్తున్నారు
.మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో భాగంగా ఇవాళ తుని మండలం చామవరంలో బాబు ష్యూరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యనమల దివ్యకు మహిళలు మంగళహారతలతో బ్రహ్మ రథం పట్టారు.టీడీపీ, జనసేన కార్యకర్తలతో కలిసి యనమల దివ్య జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు యనమల శివరామకృష్ణతో కలిసి ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ కరపత్రాలు అందజేశారు.ఈకార్యక్రమంలో సీనియర్ నాయకులు పోల్నాటి శేషగిరిరావు‌, మోతుకూరి వెంకటేష్,కురపా అప్పారావు,జనసేన సమన్వయకర్త చోడిశెట్టి గణేష్,అప్పన రమేష్, చింతంనీడి అబ్బాయి, వంగలపూడి బుజ్జి, జక్కాన రామనాయుడు, రామచంద్ర రాజు,జనసేన నాయకుడు బొప్పన రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article