జగ్గంపేట
ప్రభుత్వ ఉద్యోగులకు,ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు రావలసిన డిఏ బకాయిలు వెంటనే చెల్లించాలని ఐక్య కార్యచరణ సమితి జగ్గంపేట యూనియన్ చైర్మన్ వి.వి.వి కృష్ణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం జగ్గంపేట తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ జగ్గంపేట తాలూకా అధ్యక్షుడు వి.వి.వి కృష్ణ మాట్లాడుతూ ఉద్యోగుల, ఉపాధ్యాయుల,పెన్షనర్లకు న్యాయబద్ధంగా రావలసిన బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు.ఉద్యోగస్తులు దాచుకున్న జిపి, జెడ్పి జిపిఎఫ్, నాలుగో తరగతి ఉద్యోగుల జిపిఎఫ్ లు కూడా చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.2022 పిఆర్సి ప్రకారం ఉద్యోగస్తులకు 7500 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అలాగే ఒకటవ తేదీన పెన్షనర్,ఉద్యోగులకు జీతాలు చెల్లించాలన్నారు. డిఎ,టిఎ,ఎఫ్ టి ఏ బకాయిలు వెంటనే మంజూరు చేయాలన్నారు. అనంతరం పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షులు మల్లేశ్వరరావు మాట్లాడుతూ పెన్షనర్లు పలు వ్యాధులతో బాధపడుతున్నారని మందులు కూడా కొనుక్కోలేని పరిస్థితి నెలకొని ఉందన్నారు. కావునా ఒకటవ తేదీన పెన్షనర్లకు బటన్ నొక్కి పెన్షన్ చెల్లించాలన్నారు. హెల్త్ కార్డులు ప్రభుత్వం జారీచేసిన హాస్పటల్లో వైద్యం అందని పరిస్థితిలు నెలకొన్నాయన్నారు. పీహెచ్ఎస్ రూపంలో ప్రతినెలా కోట్ల రూపాయలు ప్రభుత్వం తీసుకుంటున్న వైద్యం జరగని పరిస్థితులు ఉన్న ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగస్తుల సమస్యలను వెంటనే స్పందించాలని లేనిపక్షంలో భాగస్వామ్య జిల్లా కేంద్రాలలో 20వ తేదీన జరగబోయే ధర్నా, 27వ తేదీన చలో విజయవాడలో మహాధర్నా విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వీరి యొక్క ధర్నాకు భాగస్వామ్య జగ్గంపేట యుటిఎఫ్ మద్దతు తెలిపింది. స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా కాకినాడ రోడ్డు లోని పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో జగ్గంపేట కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్వరరావు, ట్రెజరర్ పి. ప్రభాకర్, అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం సునీల్ వర్మ, వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ ప్రసన్నకుమార్, ఏ చల్లారావు, జాయింట్ సెక్రెటరీ కె రాజరత్నం, పెన్షనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రమౌళి వెంకట శాస్త్రి, వైస్ ప్రెసిడెంట్ తోలేటి సూర్యనారాయణ, ఎం సూర్యనారాయణ, ఏం. సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.