Thursday, February 12, 2026

Creating liberating content

సినిమా‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ లో మొదలు కానున్న ‘అఖండ 2’

‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ లో మొదలు కానున్న ‘అఖండ 2’

బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన “సింహా”, “లెజెండ్”, “అఖండ” ఒకదాని మించి ఒకటి హిట్టయ్యాయి. అందుకే బాలయ్య, బోయపాటి కాంబినేషన్ కి మంచి క్రేజుంది. నాలుగోసారి వీరి కాంబినేషన్ సెట్ అయింది. ఐతే ఈసారి అల్లు అరవింద్ కి చెందిన గీతా ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మిస్తుండడం విశేషం. ఆహా కోసం బాలయ్య “అన్ స్టాపబుల్” షో చెయ్యడం, అది హిట్ కావడంతో అల్లు అరవింద్, బాలయ్య మధ్య బంధం గట్టి పడింది. బాలయ్యతో తమ బ్యానర్ లో సినిమా తీస్తామని అల్లు అరవింద్ ఇంతకుముందే ప్రకటించారు.అల్లు అర్జున్ తో సినిమా తీయాలనే ఆలోచనతో గీతా క్యాంప్ కి వచ్చిన బోయపాటి అల్లు అరవింద్ ఇలా “అఖండ 2” సెట్ చేశారని టాక్. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది. ప్రస్తుతం బాలయ్య బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చినప్పుడు బాలయ్య – బోయపాటి సినిమా మొదలవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article