Sunday, February 15, 2026

Creating liberating content

Uncategorizedవృత్తిని దైవంగా భావించిన ఎంఇఓ వీరారెడ్డి

వృత్తిని దైవంగా భావించిన ఎంఇఓ వీరారెడ్డి

  • ఘనంగా పదవి విరమణ సన్మానోత్సవం
  • జడ్పీటీసీ ఎమ్. రవికుమార్ రెడ్డి

వేంపల్లె
37 సంవత్సరాల 6 నెలల పాటు అంకిత భావంతో పనిచేసి వృత్తినే దైవంగా భావించి మన్ననలు పొందిన ఎంఇఓ వీరారెడ్డి అని జడ్పీటీసీ ఎమ్. రవికుమార్ రెడ్డి కొనియాడారు. బుధవారం స్థానిక జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణంలో పదవి విరమణ సన్మానోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదవి విరమణ ప్రతి ఉద్యోగ అధికారికి తప్పనిసరని, తన పదవి కాలంలో చేసిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయని చెప్పారు. అలాగే పదవి విరమణ పొందిన ఎంఇఓ వీరారెడ్డికి ఆయన విడ్కోలు పలికారు. వేంపల్లె మండల ఎంఇఓ-1 జాఫర్ సాదీక్, ఎంఇఓ-2 స్టాలిన్ ఐజాక్, మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్ లు ఆయనకు శాలువ కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article