*ఎక్కడుందిరా జర్నలిజం… ఏమై పోయిందిరా జర్నలిజం…
*అక్షరాలు రాని వారికి అక్రిడేషన్ కార్డులు…
*ఆ ఆ లు రావు ఇంగ్లీష్ పత్రికలో రిపోర్టర్ గా కార్డులు…
*పేరుకేనా నాలుగో స్థంభం..
*ఎక్కడుందిరా ఆ స్తంభం…
*మారేడుమిల్లి బొంగులో ఉందా ఈ స్తంభం..
*నీతి లేని అధికారుల పాదాల కింద ఉందా ఈ స్తంభం…
*కలాన్ని ఇంతలా కలంకితం చేస్తుంటే…
*కాలం మౌనమై చూస్తుంటే…
*కత్తి కన్నా కలం గొప్పదన్నారు…
*కత్తి పట్టినోడీకి కార్డులు ఇస్తుంటే…
*కళ అంటే అలానా , పలానా అన్నది తెలియదు…కల్చరల్ రిపోర్టర్…
*ఆమె పాండిత్యానికి అక్రిడేషన్ కార్డు ఎలా సాధ్యం..
*జర్నలిజం ఇంతలా దిగజారి పోయిందా…దిగజార్చి వేస్తున్నారా…
*సమాచార శాఖ అధికారులారా మీకు సలాం రా అయ్యా…
*మీ సంపాదన కోసం ఇన్ని లుచ్చా పనులు చేస్తారా…
*కార్డులు ఇచ్చేది మీరే…కట్టడి చేస్తామంటున్నది మీరే…
*మీతో అయ్యేది కట్టడికాదు…జేబులు కొట్టడమే …
*లక్షల్లో జీతాలు తింటూ వేలల్లో వసూలు కు పాల్పడుతూ..
*ఇన్ని పనికిమాలిన పనులు చేయడానికా మీరుండేది…
*మీ కక్కుర్తి కోసం కలాన్ని ఇలా కించ పరుస్తారా…
*అవినీతి సొమ్ము కోసం అర్రులు చాచి ఉన్నారా…
*ఇంత నీచానికి ఒడిగట్టడం సిగ్గనిపించదా…
*ఓ కాలమా ఏమిటే ఈ పొగాలం…
(రామమోహన్ రెడ్డి)

“నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం”అని
కళ్ళున్నా చూడని గ్రుడ్డితనం… వీళ్ళది!
చెవులున్నా వినని చెవుడుతనం… వీళ్ళది!
మానవత్వం మంటగలిసిపోతుంటే…
మౌనంగా చూసే జడత్వం వీళ్ళది!
ధర్మం గ్లాని చెందుతుంటే… దైవం ఎక్కడ దాక్కుంది?
న్యాయం నిర్వీర్యమవుతుంటే… చట్టం ఎటువైపు చూస్తోంది?
ప్రశ్నించే గొంతుకలని… నొక్కేసే శక్తులెన్నో!
హింసను ప్రేరేపిస్తూ… సాగే కుట్రలెన్నో!
ఇకనైనా మేల్కొనరా… ఓ మనిషి!
తిరగబడి నిలబడరా… ఓ మనిషి!
అన్యాయాన్ని ఎదిరించే ఆయుధమై…
ముందుకు సాగిపోరా… ఓ మనిషి”అని గాయం సినిమా ద్వారా సిరివెన్నెల సీతారామశాస్త్రి 1993 లో ఈ సమాజ తీరు, అధికారుల ద్వంద నీతి, అవినీతి పరుల బాగోతం గురించి న్యాయం దొరకదన్న తీరుపై వెలిగెత్తి చాటాడు.నిజంగా ఇప్పుడు కూడా అదే తీరు,అదే పద్దతి నాలుగో స్తంభముగా పిలువబడుతూ జర్నలిజం కోసం పాటుపడుతున్న సగటు జర్నలిస్ట్ కు ఎదురవ్వడం ఈ జర్నలిజం,ఆ వృత్తి పట్ల నిబద్దత నిజాయితీ క్రమశిక్షణ కలిగిన వారు పడుతున్న ఆవేదన, ఆందోళన ఈ నీతి లేని అధికారులకు అర్థం కావడం లేదంటే వీరిని ఏమనాలో,ఏమి చేయాలో తెలియని వైచిత్రి ప్రస్తుతం ఉందని చెప్పాలి.
“ignorance of law is no excuse”
“చట్టం తెలియదనడం నేరం నుండి తప్పించుకోవడానికి ఒక సాకు కాబోదు”అని భారత దేశ అత్యున్నత న్యాయ స్థానం పేర్కొనబడింది.
దేశంలోని చట్టాలన్నీ ప్రతి పౌరుడికి తెలిసి ఉండాలనే నిబంధన ఉంది. నాకు చట్టం తెలియదు అనే కారణంతో ఏ ఒక్కరూ తమ బాధ్యతల నుండి తప్పించుకోలేరని, న్యాయపరమైన శిక్షల నుండి మినహాయింపు పొందలేరని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.ఇక్కడ కూడా నాకు చట్టం తెలియదు అన్న సాకు సమాచార శాఖ అధికారుల నుండి తరచూ వినాల్సి వస్తోంది.
“The pen is mightier than the sword”
“కత్తి కన్నా కలమే శక్తివంతమైనది “అని నానుడి.మరి ఆ కలం ఈ రోజు నేటి సమాచార శాఖ అధికారుల తీరు వలన కలంకితం అవ్వడమే కాకుండా అత్యంత దీనమైన స్థితికి తీసుక వస్తున్న తీరును చూసి కలం నుండి రక్తపు చక్కలు రాలుతున్నాయని చెప్పక తప్పడం లేదు.సమాజంలో జరిగే విషయాలను ఖచ్చితత్వంతో, నిష్పక్షపాతంగా జనాలకు చేరవేయడం,పాలకులను, అధికారులను జవాబుదారీగా ఉంచడంలో జర్నలిజం ‘నాల్గవ స్థంబం’ లాగా పనిచేస్తుంది.ప్రజలకు నిత్యం కావాల్సిన సామాజిక, రాజకీయ, ఆర్థిక మరియు సాంస్కృతిక విషయాలపై అవగాహన కల్పిస్తుంది.ఒక మంచి జర్నలిస్ట్ ఎప్పుడూ ఖచ్చితత్వం, నిజాయితీ, నిష్పాక్షికత, మరియు సమతుల్యత వంటి నైతిక విలువలను పాటించాలనేది ప్రాథమిక సూత్రం.ఈ సమ సమాజ స్థాపన కోసం ఎందరో అక్షర యోధులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయక,కలాన్ని కులానికి మతానికి తాకట్టు పెట్టకుండా కత్తి పోట్లకు గురైన ,గురవుతున్న సంఘటనలు నాటి నుంచి నేటి వరకు చూస్తూనే ఉన్నాం.పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకు సంకెళ్లను సైతం లెక్కచేయక తమ సంపాదకీయాలతో అవినీతి పరుల చేష్టలను సమాధి చేసిన రోజులు లేక పోలేదు.కానీ కాలం మరే కొలది సంపాదకీయం సందు గొందులలో సంత లో అమ్ముడు సరుకు అవ్వగా జర్నలిజం జర్నలిజం గా రూపాంతరం చెందుతూ రోజు రోజుకు పరిణామ క్రమం చెందుతూ ఉందని చెప్పడంలో వింతేమీ లేదు.దీనికి కారణం ఎవరు.ఎందుకిలా ఈ నాలుగో స్తంభము నడివీధిలో అంగడి సరుకు అయ్యిందంటే అందుకు సంపాదక లోకం లో సమాధానం దొరకని పరిస్థితి.
“పత్రిక ఒక్కటున్నా పదివేల సైన్యము, పత్రికొక్కటున్న జగతికి వెలుగు”
- ఒక సమాజంలో లేదా దేశంలో ఒకే ఒక్క నిజాయితీ గల వార్తాపత్రిక ఉన్నా, అది పదివేల మంది సైనికులతో సమానమైన శక్తిని కలిగి ఉంటుందని,సమాజంలో జరిగే అన్యాయాలను, అవినీతిని ప్రశ్నించడానికి, ప్రజలలో చైతన్యం తేవడానికి పత్రికలు (మీడియా) ఎంత శక్తివంతమైనవో ఈ మాటలు తెలియజేస్తాయి. పత్రిక సమాజానికి దిశానిర్దేశం చేస్తూ, అజ్ఞానాన్ని పోగొట్టి వెలుగును నింపుతుందని దీని అర్థం.కానీ అదే పత్రికా ప్రపంచం నీటి అవినీతి పాలకుల పాదాలకు పూజలు చేస్తూ, వారు విదుల్చే అవినీతి సొమ్ము కోసం అర్రులు చాచి ఉంటూ పత్రికా విలువలకు తిలోదకాలు ఇస్తున్నారని అనడం లో పెద్దగా అచ్యర్యపడాల్సిన అవసరం లేదని చెప్పచ్చు
” ఎడిటరైనవాడు బిడియము చూపుచో ధాటి తగ్గు వృత్తి ధర్మమందు, కడుపుకూటి రాత కక్కుర్తి రాతరా’ అంటూ తోటి రచయితలనూ, భావి సంపాదకులనూ హెచ్చరించిన యోధుడు నార్ల వెంకటేశ్వరరావు. ముఖ్యంగా జర్నలిజం రంగంలోకి అడుగుపెట్టేవారు నిజాయితీగా, నిర్భీతిగా ఉండాలని కోరేవాడు నార్ల. “నిజము కప్పిపుచ్చి నీతిని విడనాడి స్వామి సేవ సేయు జర్నలిస్టు తార్చువాని కంటే తక్కువ వాడురా” అని చెప్పాడు.కానీ ఆ మహనీయుడు చెప్పిన మాటలు అక్షర సత్యాలుగా నిలుస్తున్నాయని చెప్పడానికి అనేక ఉదాహరణలు లేకపోలేదు.
మచ్చుకకు ఓ ఎన్టీఆర్ జిల్లా లో పలువురు సంపాదకులు తమ సంపాదన కోసం సమాచార శాఖ లో ఉన్న కొంతమంది అవినీతి అధికారులకు అండ దండ ఉంటూ ఉద్యోగం మొదలు ఉద్యోగ విరమణ,తిరిగి ఆగమనం చేసిన వారితో లాలూచీ పడి ప్రభుత్వం చేసిన చట్టం ద్వారా వెలువడిన జీవో 84 ను కూడా ప్రక్కదోవ పట్టించి అక్రిడేషన్ కార్డులు పొందడం జరిగింది.ఒక వృద్ధ సంపాదకుడు చెల్లుబాటు కానీ యూనియన్ పేరుతో చెలామణి అవుతూ తన కులం కోసం కలం ముసుగు వేసుకుని పైకి సంక్షేమం అంటూ లోన సన్నాసి పనులు చేస్తూ అక్రిడేషన్ కమిటీలో అర్హత సాధించలేని స్థితిలో ఉంటూ తన కులపోడు మంత్రి గా ఉన్నాడని,తనదే ఆదిపత్యం అంటూ పోసుపోని కబుర్లు చెబుతూ అక్రిడేషన్ కార్డులను అక్రమ మార్గం లో తీసుకోవడానికి అనేక అడ్డదారులు తొక్కుతూ అక్రిడేషన్ కమిటీలో అర్హత ఉన్న యూనియన్ ల వద్ద భిక్షమెత్తుకుని కమిటీ సభ్యులను వేయించుకుని అతడే ఒక సైన్యం లా చెలామణి అవుతూ అవినీతి అధికారుల అడుగులకు మడుగులు ఒత్తుతూ శాలువాలు,సన్మానాలు చేసి సమాచార శాఖను బ్రస్టు పట్టడానికి ఒకింత ఊతం ఇచ్చారని అనడం అసత్యమేమీ కాదని చెప్పచ్చు.
ఇక పోతే జిల్లాల పునర్విభజన సందర్భంగా. సమాచార శాఖ లో సిబ్బంది కొరత వల్ల గత ప్రభుత్వం లో సమాచార శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి చేసిన పని కూడా పత్రికా ప్రపంచం లో ఉన్న అక్రమార్కులకు వరంగా మారిందనేది జగమెరిగిన సత్యం.కారణం సమాచార శాఖ లో ఇంజనీరింగ్ విభాగం ఒకటి ఉందని మెజార్టీ పాత్రికేయులకు తెలియన్నది వాస్తవం.కేవలం పిఆర్ వింగ్ వారు మాత్రమే పత్రికా ప్రకటనలు కానీ అధికారులకు పత్రికల మధ్య సమన్వయం చేసుకునే వారు.అలాంటి వింగ్ లోని ఇంజనీరింగ్ విభాగం కలపడం మూలాన ఇప్పటీకి అక్రిడేషన్ కార్డులు మంజూరు,పత్రికా ప్రకటనలు ఇవ్వడం అన్నది వారికి కొత్త విధానంగా మారిన తరుణంలో ఎన్టీఆర్ జిల్లా డి ఐ పీఆర్వో వ్యక్తిగతంగా మంచివాడయిన అధికారికంగా సంతకాలు చేసుకుంటూ ఒక దిష్టిబొమ్మ లాగా ఉండి పోవడం యదార్థం. అదే అదనుగా తీసుకున్న ఒక అవినీతి తిమింగలం తన కుల, స్టాన బలం,అంగ, ఆర్ధిక బలం,అవినీతి సంపాదకుల అండ దండ ,కింది స్థాయి ఉద్యోగుల ను కట్టడి చేయడం పై అధికారులతో అంతా తానే అన్నట్లుగా ఉంటూ అక్రిడేషన్ కార్డులలో కుదిరినంత కక్కుర్తి కి పాల్పడినా చివరికి అతగాడి అవినీతికి ఆనవాళ్లు లేకుండా హాయిగా అందరిని ఇరికించి అవినీతి సొమ్ముతో అందరిపై పెత్తనం చేశాడన్న ఆరోపణలు లేకపోలేదు. ఇవన్నీ యావత్ అధికార యంత్రాంగానికి ,ఇటు పత్రికా లోకానికి తెలిసినా ఆధారసహితంగా ఎక్కడా నిరూపితం అయ్యే అవకాశాలు లేవు.అంటే అవినీతి కూడా ఇలా చెయ్యచ్చు అన్న మార్గదర్శకులుగా ఈ రాష్ట్ర అవినీతి సంఘానికి అధ్యక్షుడు చేసినా తప్పేమి కాదు.
. ఇక చివరగా అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే…దసరా పండుగ సందర్భంగా మీడియా సంస్థలకు దుర్గగుడి పాసుల విషయం లో జరిగిన అనేక పరిణామాల నేపధ్యంలో నకిలీ మీడియా కట్టడికి ప్రయత్నించిన జిల్లా అధికారులను తెరవెనుక నుండి రాజకీయం నడిపి తన హవ్వా కోసం పామె తన పిల్లలను తిన్న చందాన సాటి శాఖ అధికారులను అభాసుపాలు చేసి అందులో ఉత్తమ,శ్రమ జీవి,అలసిపోని మనస్తత్వం జిల్లా పై స్పృహ కలిగిన కలెక్టర్ ను కూడా అగౌరపరిచేలా చేసిన సమాచార శాఖ ను వీడని మహిషాసురుడు లాంటి రాక్షస స్వభావం కలిగిన వ్యక్తి వలన అధికార పార్టీ ఎంపీ కూడా రంగంలోకి దిగడం తో కలెక్టర్ కూడా పాసుల విషయంలో పూర్తి సడలింపు నివ్వడం జరిగింది.ఇంకేముంది రాని జ్యోతిష్యం వచ్చినట్లు చెప్పే వారు,ఇంగ్లీషు కాదు స్పష్టమైన తెలుగులో నాలుగు అక్షరాలు సక్రమంగా రాయలేని వారు ఇరవై ఏళ్ల కల్చరల్ రిపోర్టర్ అనుభవం ఉందంటూ , ఇంగ్లీష్ పత్రికా అక్రిడేషన్ కార్డులు పొంది అమ్మవారి పాసులు అడ్డగోలుగా పొందిన తీరు చూస్తుంటే నాలుగో స్తంభము ఎక్కడుంది మారేడుమిల్లి బొంగులో ఉందా, నడి వీధుల్లో భిక్ష మెత్తికుంటుందా అన్న అవేదన వ్యక్తం అవుతోంది.ఇంకొకడు అడుగు ముందుకు వేసి చూస్తే ఎన్టీఆర్ జిల్లా అక్రిడేషన్ లిస్ట్ లో లేకుండానే తిరుపతి జిల్లాలో ఈ జిల్లా కార్డులు అక్కడ సంచారం చేస్తూ ఉన్నాయి.ఇంకాస్త ముందుకు వెళ్తే ఓ పోలీస్ స్టేషన్ లో సస్పెక్ట్ షీట్ ఉండి రౌడీ షీటర్ల ఫోటోలలో సరసన ఒక సంపాదకుడు ఫోటో ఉన్నా సదరు పత్రిక అప్పటి ఆర్ ఎన్ ఐ,ఇప్పటి పిఆర్ జి ఐ రద్దు చేయమని స్వయానా అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చినా పత్రికలకు కూడా అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసినా ఈ సమాచార శాఖ అధికారులకు ఈ రాష్ట్రం గర్వించదగ్గ ఉత్తమ అవార్డు ఎందుకు ఇవ్వకూడదో ఓ సారి సమాచార శాఖ ఉన్నతాధికారులు,అటు ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతయినా ఉందని మెజార్టీ పాత్రికేయుల ద్వారా వెల్లడి కాబడుతోంది.
ఇంకొక అడుగు ముందుకు వేసి బాగా పరిశీలన చేస్తే పక్కున నవ్వుతుంది ఈ పత్రికా ప్రపంచం.పబ్లికేషన్ సెంటర్ గుంటూరు ఉంటే ఆ పత్రికకు కార్డులు ఇచ్చినవి ఎన్నొ తెలిస్తే వీరు సమాచార శాఖ అధికారులేనా ఇంకేదయినా అన్న ప్రశ్న తలెత్తుతుంది.ఇంకాస్త బాగా పరిశీలన చేస్తే ఆర్ ఎన్ ఐ వచ్చిన మొదటి త్రైమాసికంలో పత్రిక వార్షిక నివేదిక ఆన్లైన్ లో వేయక ముందే మొదటి రెండవ విడతలో మీడియం కింద చేర్చి అడ్డగోలుగా అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసిన ఈ సమాచార శాఖ అధికారులకు ఈ ప్రభుత్వం ఎలాంటి సన్మానం చేయకపోవడం అత్యంత దురదృష్టకరమని భావించాలి.ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్టీఆర్ జిల్లా అక్రిడేషన్ కార్డులు మంజూరు ప్రక్రియ పూర్తిగా విచారణను నిస్పక్షపాతంగా చేయగలిగిన నిజాయితీ పరుడైన అధికారి ఇవన్నీ వాస్తవాల కాదా అన్నది బహిర్గతం అవ్వడం ఖాయం.మరి అలాంటి నిజాయితీ గల అధికారులు ఉన్నారా ఉంటే సమగ్ర విచారణ చేస్తారా లేదా అన్నది చూడాలి మరి.

