టాప్ న్యూస్సిగ్గు పడాల్సింది మీరా.. జర్నలిస్టులా...

సిగ్గు పడాల్సింది మీరా.. జర్నలిస్టులా…

  • మీడియా అంటే ఇంత నీచమా..
  • మీరు జీతాలు తింటూ ఈ లాలూచీ పనులేల..
  • దసరా పాసులను కూడా అభాసు పాలు చేస్తారా…
  • నిజమైన జర్నలిస్ట్ కు నిలువెత్తు అవమానాలు చేస్తూ…
    *జ్యోతిష్య పండితులు,పాటలు పాడించే వారికి పాసులిస్తారా…
    *పరుచూరి విజయలక్ష్మి ,ప్రసూన రామన్ ఏ యుగం జర్నలిస్టులు..
    *మీ పనికి మాలిన పనులకు కలెక్టర్ పేరు బధనామ్ చేస్తారా…
    *మీ బరితెగింపు కు అడ్డుకట్ట వేసేవారు లేరా..
    *దిష్టి బొమ్మ లాగా డీ ఐ పీఆర్వో ఉంటుంటే…
    *నకిలీ వద్దన్న నాగేశ్వరావుపై వెకిలి కూతలు కూసి..
    *రవి ఉదయించని సూర్యుడిలా ఉంటే ..
    *ఆర్జేడీకి అన్ని ఓకే అని నమ్మబలికి…
    *నడి వీదుల్లో నవ్వుల పాలయ్యేలా ..
    *తెర వెనుక మాజీ తాజా ఉద్యోగి తందనాలు పలికి…
  • ఎవరి కక్కుర్తి కోసం కలాన్ని కించపరిచారూ….కించ పరుస్తూ ఉన్నారు…
    *ఎవడబ్బ సొమ్మని పాసులు పంచారు…
    *ఈ అధికారం శాశ్వతమని అనుకున్నారా…
    *అందుకే ఈ బరితెగింపు పనులా…
    *మీ వల్ల జర్నలిజమే గబ్బు పట్టిందా…లేక మీరే గబ్బు పట్టిస్తున్నారా…
    *ఎవరా మధు … అతగాడికి కు పెత్తనం ఇచ్చిందెవరు ..
    *ఉత్సవాల ఉద్యోగికి పాసులు ఇచ్చేంత స్థాయి ఉందా…
    *మీ వెకిలి చేష్టలకు నకిలీలు పుట్టరా మరి…
    *కలెక్టర్ గారు మీరైనా చర్యలు చేపట్టలేరా…
    *అందుకేనా ఎంపీ కూడా ధర్నా చేసింది…
    *దుర్గమ్మ ఈ దుర్మార్గాలకు దండన విధించవా…
    (రామమోహన్ రెడ్డి )

  • .”మనదీ ఒక బ్రతు కేనా? కుక్కలవలె, నక్కల వలె! మనదీ ఒక బ్రతుకేనా? సందులలో పందులవలె!”
  • సమాజంలో పేదరికం, దోపిడీ, అణచివేతకు గురవుతున్న బడుగు జీవుల దయనీయ స్థితిని, వారు పశువుల కంటే హీనంగా బ్రతుకుతున్న తీరును శ్రీ శ్రీ ఈ కవిత ద్వారా తీవ్రంగా ప్రశ్నించారు.సాటి మనిషిని మనిషిగా గౌరవించని వ్యవస్థ మీద, మనుషుల దుర్భర బ్రతుకుల మీద ఆయన చేసిన తిరుగుబాటు గీతం ఇది.అచ్చం ఆ మహనీయుడు శ్రీశ్రీ రాసిన కవిత నూటికీ నూరు శాతం వాస్తవానికి అద్దం పడుతుంది నేటి ఈ సమాచార శాఖ అధికారుల తీరు.వ్యక్తుల స్వార్థం వలన సమాజానికి మూలమైన నాలుగో స్తంభముగా పిలువబడుతూ ఉన్న జర్నలిజం వ్యవస్థలలోకి వస్తున్న వారి వివరాలు పరిశీలన చేస్తే పక్కున నవ్వుతోంది నేటి ప్రజాస్వామ్యం.
    • జర్నలిజం వ్యవస్థ ద్వారా పీడిత బానిస బ్రతుకుల నుండి ప్రజలను రక్షించక పోయినా పర్వాలేదు కానీ అదే వ్యవస్థను బజారులో అంగడి సరుకు చేసి అమ్ముకాలు చేస్తున్న తీరును చూస్తుంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ లో జర్నలిజం ఇందుకే అపహాస్యం అవుతుందా అన్న ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతయినా ఉంది.
  • “పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్
  • ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ||”
    • సజ్జనులను (మంచి వారిని) రక్షించడానికి, దుర్మార్గులను నాశనం చేయడానికి మరియు ధర్మాన్ని తిరిగి ప్రతిష్ఠించడానికి నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా తెలియజేశాడు.కానీ ఈ జర్నలిజం కు బడుతున్న అన్యాయాన్ని కాపాడడానికి ఎవడు వస్తాడన్న ప్రశ్న అనేక మంది సీనియర్ పాత్రికేయుల ద్వారా వెల్లడి కాబడుతోంది.ఒక నిజమైన జర్నలిస్ట్ ఏ రంగంలో ఉన్నా ఆ రంగం సమాజానికి హాని కలిగించినది అయితే అది అతని బ్రతుకు దెరువు కోసం అని సంతోష పడచ్చు.కానీ జర్నలిజంలో ఓనమాలు రాక,కులం,మతం,జాతి , ఇతర ప్రయోజనాల కోసం అది కూడా తమ స్వార్ధ పూరిత ప్రయోజనాల కోసం సమాజం లో ఏదో ఒక రంగు పులుముకుని నిజమైన అక్షరానికి అన్యాయం చేస్తుంటే అక్షరం కూడా ఆవేదన చెందక తప్పని పరిస్థితి.
      • ఇంతటి ఉపోద్ఘాతం దేని గురించని అనేక మంది పండితులమనే వారు బ్రమ పడచ్చు.ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళ్తే ఆ భ్రమలు నిజామా కాదా అన్నది అందరికీ అర్థం అవ్వచ్చు.
        • దసరా (విజయదశమి) అనేది హిందువులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుంది.1. రావణాసురుడిని వధించి సీతాదేవిని రక్షించుకున్న శ్రీరాముడి విజయానికి గుర్తుగా ఉత్తర భారతదేశంలో ఈ పండుగను జరుపుకుంటారు.మహిషాసురుడు అనే రాక్షసుడిని దుర్గాదేవి సంహరించి లోకాన్ని కాపాడిన విజయానికి గుర్తుగా దక్షిణ, తూర్పు భారతదేశంలో దుర్గా పూజ ముగింపుగా ఈ పండుగను జరుపుకుంటారు.ఈ పండుగను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి పై వెలసి ఉన్న శ్రీకనక దుర్గమ్మ ఆలయంలో అత్యంత వైభవంగా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా చేస్తున్న అధికారులను ఆదేశించారు. దీనికి తోడు విజయవాడ వైభవాన్ని నలుదిక్కులకు తెలిసేలా విజయవాడ ఎంపీ కేశినేని శివానాథ్ విజయవాడ ఉత్సవ్ పేరుతో అమ్మవారి భక్తులకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ,విజయవాడ సరస్ పేరుతో మరో బ్రహ్మాండమైన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ అద్భుతమైన కార్యక్రమాలకు దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము,ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందడం జరుగుతూ ఉంది.ఇంతటి మహోన్నతమైన కార్యక్రమ వివరాలు యావత్ ప్రపంచ పఠంలో ఉండేలా మీడియా వేదికగా ప్రచారాన్ని కూడా ప్రభుత్వం తరుపున కోరడం , సమాజానికి నాలుగో స్తంభము బాధ్యతగా మీడియా సంస్థలు కూడా ఎన్నో వ్యయ ప్రయాసలు పడి ఈ కార్యక్రమాలు కవరేజ్ చేసుకునేందుకు సిద్ధం అయ్యింది.
          • అయితే ఈ కార్యక్రమాల్ని కవరేజ్ చేసుకునేందుకు కొన్ని ఆంక్షలు ఉండడం సహజం.ఎందుకంటే లక్షలాది మంది భక్తుల భద్రతా దృష్ట్యా అందరినీ అన్ని ప్రదేశాలకు అనుమతి ఇవ్వరు కాబట్టి మీడియా వారికి,ఉత్సవాల సందర్భంగా పనిచేస్తున్న ప్రభుత్వ,ప్రవేటు యంత్రాంగానికి ప్రత్యేక పాసులు అర్హత ప్రామాణికంగా మంజూరు చేయడం ప్రభుత్వ బాధ్యత.అయితే ఇక్కడే అసలు సమస్య మొదలు అయ్యిందని చెప్పచ్చు.ఈ కార్యక్రమాల్ని జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ లో జరుగుతూ ఉంటాయి.జిల్లా కలెక్టర్ ఒక సామాన్య భక్తుడు కంటే ఎక్కువగా అటు భక్తుల సౌకర్యాలు,ఇటు అతిథులు,అతి ముఖ్య అతిథుల పర్యటనలు,ఆయా కార్యక్రమాలు చూస్తున్న సమయంలో మీడియా సంస్థలకు సంబంధించి జిల్లా సమాచార పౌర సరఫరాల శాఖ అధికారులకు ఈ బాధ్యత అప్పగించి అర్హులైన వారి పాసుల జాబితా ఇచ్చి ఎక్కడా కూడా మీడియాతో సమన్వయ లోపం లేకుండా చూసేలా ఆదేశించారు.
            • ఈ ఆదేశాలు ఆయన ఛాంబర్ వరకే పరిమితం చేసిన జిల్లా అధికారులు కలెక్టరేట్ బైటికి రాగానే జిల్లా డి ఐ పి ఆర్వో ఒక దిష్టి బొమ్మలాగా ఆయన ఛాంబర్ వరకే పరిమితం కాగా నకిలీ వెకిలి జర్నలిజం అడ్డుకట్ట వేయడం నాతోనే సాధ్యం అవుతుందని బ్రమ పడిన డీపీ ఆర్వో నాగేశ్వరరావు ప్రధాన పత్రికలు ,ప్రధాన చానెల్స్ కి మాత్రమే పాసులంటూ కట్టడి చేయడానికి పూనుకుని ముందుకు వెళ్తే ఏదయితే మహిషాసురుడు అనే రాక్షసుడిని దుర్గాదేవి సంహరించి లోకాన్ని కాపాడిన విజయానికి గుర్తుగా దసరా పండుగ చేసుకుంటున్నామో ఈ సమాచార శాఖకు పట్టిన మహిషాసురుడు తన అవినీతి యావ చావక కుల బలం,ఇతర సామాజిక వర్గాల బలంతో దసరా ఉత్సవాలను సైతం అభాసు పాలు చేసేందుకు కూడా వెనుకాడని పరిస్థితి దాపురించింది.దేనికయ్యా ఇదంతా అంటే గత ముప్పై సంవత్సరాలుగా తన హవ్వా కొనసాగిస్తూ అయినవారికి ఆకులో కానీ వారికి కంచంలో వడ్డిస్తూ అవినీతికి అలవాటు పడ్డ జీవితానికి ముగింపు పడినా ఆశ చావక జిల్లా సమాచార శాఖ ను పట్టి పీడిస్తున్న తరుణంలో తనను కాదన్న అధికారులకు అభాసుపాలు చెయ్యడం అలవాటుపడి అమ్మవారి పాసుల విషయంలో నాగేశ్వరరావు దూకుడుకి ఒక్కసారిగా అడ్డుకట్ట వేయడం మీడియా రోడ్డెక్కడం అధికార పార్టీ ఎంపీ కేశినేని శివనాథ్ స్వయంగా మీడియా ధర్నాలో పాల్గొనడం కలెక్టర్ కూడా సమయాభావం వల్ల కొంత మౌనం పాటించడడంతో యదారాజ తదాప్రజా అన్న చందాన నియమ నిబంధనలను కృష్ణమ్మ నీటిలో కలిపివేయడం తో అటు జర్నలిజంలో అక్షర పరిజ్ఞానం లేక ఇటు సంగీతం, జ్యోతిష్యం పై రవ్వంత పట్టు లేకపోయినా వారికి అమ్మవారి పాసులు అడ్డగోలుగా ఇవ్వడం వారు జర్నలిజం ముసుగువేసుకుని అమ్మ ఆలయంలో ఫోటోలకు ఫోజులిస్తూ వాట్సప్ స్టేటస్ లు పెట్టుకుని ఉంటే ఇదేనా జర్నలిజం అన్న అనుమానం వ్యక్తం అవుతోంది.
              • ఇక్కడ ప్రధానంగా చర్చకు దారితీస్తున్న వారిలో ఒకరు పరుచూరి విజయలక్ష్మి ఈమె మహానటి సావిత్రి కళాపీఠం అనే ఒక సంస్కృతిక సంస్థ ను ఏర్పాటు చేసుకుని కౌథా పూర్ణానంద కళావేదిక,హనంతరాయ గ్రంధాలయం,ఆసీస్ స్టూడియో,ఇతర ప్రాంతాలలో తనకు తాను గొప్ప గాయనీ గాయకులుగా గుర్తించిన వారితో పాటలు పాడిస్తూ ఈమె కూడా పాడుతూ ఉంటుంది.ఇంకొక జర్నలిస్ట్ పాసు పొందిన ఆవిడ ప్రసూన రామన్ ఈమె ప్రముఖ జ్యోతిష్య నిపుణురాలుగా కళా రంగంలో అనేక కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటూ ఉంటారు.వారు వారి వారి కార్యక్రమాలు చేసుకోవడం ఇక్కడ ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు.వారని అగౌరవపరిచే ఉద్దేశ్యం లేదు.కానీ వారు కూడ మీడియా పాసులు మెడలో ధరించి అమ్మవారి ఆలయంలో చెలామణి అవుతున్న తీరు చూస్తుంటే మీడియా ఇంత దిగజారి పోయిందా లేక దిగజార్చి వేస్తున్నారా అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు మేధావి వర్గాలు.అయితే జిల్లా సమాచార శాఖ అధికారుల ద్వారా వెల్లడవుతున్న విషయాలు చూస్తే ఉత్సవాల సందర్భంగా దుర్గగుడి కొండపైన మీడియా సెంటర్ లో పనిచేసే ప్రవేటు వ్యక్తి మధు కూడా మీడియా పాసులలో చేతివాటం ప్రదర్శించి నట్లు చెప్పకనే చెబుతున్నారు.ఇంత పెద్ద కార్యక్రమం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసి జోన్ 2 ఆర్జేడీ పి తిమ్మప్ప తన కింది స్తాయి అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఉన్నా అమ్మవారి పాసులు అర్హులకు అందకుండా అనర్హులకు ఎలా కేటాయిస్తారన్న ప్రశ్న ఇప్పుడు సర్వత్ర వ్యక్తం అవుతోంది.
                • ఈ సందర్భంగా మీడియా ముసుగులో చేరి సంక్షేమం,సొరకాయ,గోంగూర కట్ట అని వల్లెమాలిన నీతులు పలుకుతూ కులం ముసుగులో కలాన్ని కించపరుస్తూ పోలీస్ స్టేషన్లలో సస్పెక్ట్ షీట్ ఉందని నేరగాళ్ల ఫోటోలలో ఉన్న వారిని ప్రక్కన చేర్చుకుని వారికోసం పత్తిత్తు కబుర్లు చెబుతూ ఆ అంటే ధర్నా ,అయ్యో అన్యాయం జరిగిందని ఉత్తుత్తి పురాణాలు చెప్పే వృద్దనారీ పతివ్రతుడు ఇలాంటి అక్రమాలు,అన్యాయాలు జరుగుతుంటే శాలువాలు కప్పి సన్మానించి మళ్ళీ ఇప్పుడు కూడా సన్మానం చేయడానికి మానం లేని పేద సంక్షేమ నాయకుడు ఈ సమాచార అడ్డగోలు వల్ల ,ఇలాంటి సన్నాసి పనుల వల్ల పత్రికల విలువలు ఎంతవరకు దిగజారి పోతున్నాయో అర్ధం కాలేదా…అంతా తెలిసినా తాను కూడా అఅలాంటి తాన్ పీస్ ముక్కనె కదా అని మౌనంగా ఉన్నారా అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి.
                  • ఇలాంటి దుర్మార్గకర పరిస్థితులలో విలువలు, నీతి నిబద్దత నిజాయితీ కొత్తి మీర కట్ట అన్నవి ఏమి పనిచేయవన్న ధోరణి కనపడుతోంది.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article