టాప్ న్యూస్మేడం స్వర్ణలత ...స్వర్ణలతమేడం నే ..!

మేడం స్వర్ణలత …స్వర్ణలతమేడం నే ..!

*ఆమె ఉద్యోగ ప్రస్థానమంతా స్వర్ణ మయమే..
*అడిషనల్ డైరెక్టర్ ఇంచార్జి గా అమోఘ సేవలు అందించి..
*అనర్హులకు పెద్దపీట వేసేలా…
*అర్హతలతో పనిలేకుండా అన్నింటిని ఎంపానల్మెంట్ చేసి…
*ఎందుకు 75..34 అయ్యాయి…
*34 …23 ఎలా అయ్యాయో…
*23 నుంచి దశల వారీగా ఎలా పెరుగుతూ వచ్చాయో…
*వీటన్నిటిపై విచారణ చేసిందెవరు…
*అసలు రెగ్యులారిటీ లేదని యాడ్స్ ఆపినట్లు అంతా మాయ చేసి..
*వాటి ఎంప్యానల్మెంట్ రద్దు చేయకుండా…
*రద్దు చేయకుండానే పునరుద్ధరించి…
*అన్నిటికి నోటి మాటలే ప్రాతిపదిక గా…
*నోట్ల కట్టలకోసం నోటి మాటలను ప్రామాణికం చేసుకుని…
*కాగితాలు సమాధానం చెప్పే పరిస్థితి ఉందా…అంటే…?
*కాగితాల సమాధానం ఉంటే కోర్టుల్లో కేసులెందుకు నమోదు అవుతున్నాయి…?
*ప్రశ్నిస్తే పై అధికారులకు పోసుపోనీ మాటలు చెప్పడం..
*పిర్యాదు లిస్తే గాలి మాటలని కోర్టులకు రాయడం…
*పీర్ జి ఐ ఉన్న ప్రింటింగ్ ప్రెస్ లు కార్యాలయాలు లేక పోయినా…
*పైసలిస్తే పైల్స్ పరుగులు తీస్తాయన్నట్లుగా..
*పైసలు తీసుకోకుంటే పద్దతి తప్పి పనులు ఎలా చేశారు…
*విజిలెన్స్ అధికారుల లేఖలు బుట్టదాఖలు చేస్తూ..
*సమాచార శాఖకు ప్రత్యేక చట్టం ఉందనెలా…
*ఇలాంటి ఉద్యోగుల కోసం పేదల రక్తం చిందించి..
*ఇంత పద్ధతి తప్పిన అధికారులపై చర్యలు లేకపోతుంటే..
*వీరికి రాజ్యాంగ హక్కు ప్రత్యేకంగా ఉందా అనే..!
*ఐ ఏఎస్ లను కూడా బురిడి కొట్టిస్తుంటే…
*వీరి బ్రతుక కోసం ఇంకెన్ని బ్రతుకులను బలిచేస్తారో…
*ప్రజాధనమంటే అంత చులకనగా ఉంటుందా…

  • చేసేది అవినీతి చెప్పేది శ్రీరంగ నీతులా…!
  • ఏ ప్రభుత్వమూ ఈ ప్రబుద్ధులను పద్ధతిలో పెట్టలేకపోతుంటే…
  • ఎంప్యానల్మెంట్ పై హైకోర్టుకు వెళ్ళాలా…
  • న్యాయం అంగడిలో సరుకు అవ్వలేదుగా..
    (రామమోహన్ రెడ్డి)

‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్నిఅగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్నిమారదు లోకం మారదు కాలందేవుడు దిగిరాని ఎవ్వరు ఏమయిపోని మారదు లోకం మారదు కాలం”అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి మూడు దశాబ్దాల క్రితమే ఈ సమాజ స్థితిగతులపై చక్కటి విప్లవ గీతం ద్వారా తెలియపరిచారు.కారణం అవినీతి పరుల సామ్రాజ్యంలో నీతిమాలిన వారికి అవినీతి పరులకే పెద్ద పీట వేస్తూ ఉన్నారనే కోణం లో ఈ విప్లవ గీతం గాయం సినిమా ద్వారా తెలుగు లోకానికి అందించడం జరిగింది. సరిగ్గా నేడు కూడా ఇక్కడ ఈ వార్త కథనం లో చెప్పుకోబోయే అవినీతి అధికారుల తీరుతో ఈ రాష్ట్రం లో ఉన్న సంపాదకుల జీవితాలను అనేక గాయాలు చేస్తున్నారు. సమాచార శాఖ అంటే అవినీతి అక్రమాలు ఉండవని సభ్య సమాజం అనుకుంటే అతి చాలా పొరపాటు అవుతుందనేది యదార్థం.ఈ శాఖలో ఉన్న అవినీతి చాపకింద నీరులా నీతి నిబద్దత నిజాయితీ గా ఎంతో కొంత మేర నడిపే పత్రికల మనుగడకి పెను ప్రమాదం తెచ్చిపెడుతున్నారని అనడంలో సందేహం అక్కర్లేదు.ఇంతకీ ఏమిటా ఈ సమాచార శాఖ అధికారుల అవినీతి బాగోతం అంటే ..

స్వర్ణలత ఈ పేరు సమాచార పొర సంబంధాల శాఖ లో పనిచేసే అధికారులతో పాటుగత వైసిపి ప్రభుత్వం లోని కీలక నేతలకు , ప్రస్తుత కూటమి ప్రభుత్వం లో కొంతమంది మాత్రమే పరిచయస్తురాలు ఉండి అడిషనల్ డైరెక్టర్ ఇంచార్జి, ప్రకటనల విభాగం ఇంచార్జి,జోన్ 2 ఆర్జేడీ గా బాధ్యతలు వెలగబెట్టి కొన్ని పత్రికల సంపాదకుల జీవితాలతో చెలగాటం ఆడుకుని కనపడని పత్రికలకు , ప్రింటింగ్ లేకుండా డిజిటల్ జిరాక్స్ పేపర్స్ ఇస్తే పుచ్చుకుని ఇచ్చినమ్మ వాయనం అంటే పుచ్చుకున్న వాయనం అనే రీతిలో తన ఉద్యోగ చరమాంకం లో చేసిన పనులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పత్రికా ప్రపంచం సిగ్గుతో తలదించుకుని అసహ్యహించుకునేలా పరిస్థితి తయారు కావడానికి కారణం అయ్యిందనన్న అపవాదు మూటగట్టుకుని దుశ్శా ళువాతో సన్మానం పొంది హాయిగా శేష జీవితం గడుపుతూ కొందరి జీవితాల్లో చీకటి నింపిన గొప్ప మహనీయురాలని చెప్పక తప్పడం లేదు.ఇలా ఎందుకు అనాల్సి వస్తుందయ్యా అంటే అందుకు గల కారణాలుగా ఆమె పరిపాలన స్వర్ణయుగంలా చేయడం మూలాన సమాచార శాఖ కు ఏవిధమైన గొప్ప ప్రతిష్టాత్మక అవార్డు లు ఇవ్వాలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆలోచన లో పడి అందుకోసం ఇప్పటికీ సమాలోచనలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతూ ఉందని ఈ రాష్ట్రం లో ఉండే సంపాదకీయ వర్గంలో తీవ్ర చర్చ జరుగుతోంది.
మరి ఇప్పుడే ఇవన్నీ బహిర్గతం అవ్వడానికి గల కారణాలు ఏమిటో అన్న వాదన కూడా అడ్డగోలు గా లబ్ది పొందుతున్న పొందిన అలా లబ్ది పొందడానికి సమాచార శాఖ అధికారుల నియమించుకున్నారో లేదో తెలియదు కానీ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్న చందాన ఎంప్యానల్మెంట్ తామే చేయిస్తున్నామని సమాచార శాఖ మంత్రి తమ జాతి బిడ్డ అని వృద్ధ నారీమనుడు ఒకడు గత డైరెక్టర్ ఉండి ఉంటే అక్రెడిటేషన్ కమిటీలో ఆకు ఇంకొకటి లేని యునియన్ పేరుతో ఉత్తుత్త ఉత్తరాలు రాస్తూ ఇస్తూ అన్ని రకాల పనులు చేస్తూ ఎవరికి ఎంత ముట్ట చెప్పాలో తెలియ జేస్తూ ఏ అధికారి హోదా కు ఏమి ఇవ్వాలో వివరిస్తూ లేచింది మొదలు నిద్రపోయే వరకు అన్ని రకాలుగా బ్రోకరిజం చేస్తూ సమాచార శాఖ అధికారులను సగం అభాసుపాలు చేస్తూ పబ్బం గడుపుపుకుంటున్న వాడు ఇంకొకడు.వీరందరికీ ముఠా నాయకుడు ఇంకొకరు ఆయన కులం మతం జాతి అంటూ జాగ్రత్తగా మధ్యర్తిత్వం చేస్తూ సమాచార శాఖ అధికారుల కు పత్రికా యజమానులు మధ్య సఖ్యత లేకుండా చేసి అయోచిత లబ్ది పొందుతూ అక్రమార్కులకు అండగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతూ ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇవన్నీ గత రెండు రోజుల క్రితం హైకోర్టులో సమాచార శాఖ పై రిట్ పిటిషన్ దాఖలయైన తరువాత అదికూడా సీబీఐ లేదా విజిలెన్స్ అధికారుల ద్వారా ఖచ్చితమైన విచారణ జరిపించి ప్రకటనల ద్వారా అక్రమార్కులకు కట్టబెడుతున్న ప్రజాధనాన్ని నియంత్రించి ఇప్పటికే కట్టబెట్టిన దాదాపు యాభై లక్షల రూపాయలు ప్రజాధనాన్ని రికవరీ చేసి సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరగా హైకోర్టులో పరిశీలన ఉండగా పైన చెప్పబడిన అంశాలకు ప్రాధాన్యత సంతరించుకున్నదనే భావన వ్యక్తం అవుతోంది.
ఇక అసలు విషయం లోకి వస్తే మేడం స్వర్ణలత ఎలా తన పాలనలో పత్రికల ద్వారా స్వర్ణమయం స్వర్ణమయం చేసుకున్నారో లోతుగా అధ్యయనం చేస్తే కూటమి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా సమాచార శాఖ లో ఏంఫ్యానల్ అయి ఉన్న డెబ్భైఐదు చిన్న పత్రికలకిప్రకటనలు ఇవ్వగా అందులో ముప్పై నాలుగు పత్రికల వారు మాత్రమే ప్రచురణ చేసి ఆయా పత్రికలను సమాచార శాఖ డైరెక్టరేట్ కు సమర్పించడం జరిగిందని మిగిలిన నలబై ఒక్క పత్రికలకు అసలు ఈ ప్రకటనలు ఇచ్చారనే విషయం కూడా తెలియకపోయిందని వారికి పంపిన మెయిల్స్ కూడా పనిచేయడం లేదనే విషయాన్ని సదరు అధికారులు గుర్తించినట్లు కింది సిబ్బంది తెలిపిన్ సమాచారం ప్రకారం తెలుస్తోంది.ఇదే క్రమంలో రెండవ ప్రకటన విడుదల చేసినప్పుడు 28 పత్రికలే రెగ్యులర్ గా ఉన్నట్లు బహిర్గతం అయినట్లు కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.ఈ రెండు ప్రకటనలు కూడా జాయింట్ డైరెక్టర్ కస్తూరి హయంలో ఇచ్చినట్లు చెప్పక వస్తున్నారు.ఆ తదనంతరం జోన్ 2 ఆర్జేడీ గా ఉన్న స్వర్ణలత అడిషనల్ డైరెక్టర్ ఇంచార్జి గా అసీనులు అవ్వడం కస్తూరిని వైసిపి సానుభూతి పరుల జాబితాలో చేర్చి ఆ శాఖ అధికారుల తప్పుడు ప్రచారం తో పదకొండు నెలలు ఉద్యోగం లేకుండా ఇంటికే పరిమితం చేసిన విషయం తెలిసిందే.ఇక డైరెక్టరేట్ కార్యాలయం లో కేవలం జేడి అడ్మిన్ కిరణ్ కుమార్,జేడి మీడియా రిలేషన్స్ సూర్యచంద్ర రావు ఉండగా జేడి ప్రకటనలు , అడిషనల్ డైరెక్టర్ ఇంచార్జి,జోన్ 2 ఆర్జేడీ కూడా మేడం స్వర్ణలత తన హవ్వా కొనసాగింపు లో బాగంగా అసలు రెగ్యులారిటీ అనే వాటి మీద కంప్లైంట్ లేకుండానే విచారణ చేయడం జరిగిందని ఆ విచారణ లో గత ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో కేవలం ఇరవై మూడు పత్రికలే చావు బతుకులు మధ్య రెగ్యులర్ గానే ఉన్నాయని తేలినట్లు మేడం స్వర్ణలత నిర్ధారణ వచ్చారని చెబుతూ రెగ్యులర్ లేని వారికి నోటీసులు కానీ , ఏంఫ్యానల్ రద్దు చేయడం కానీ జరగకుండా విడతల వారిగా యాబై పత్రికలను రెగ్యులరైజ్ చేస్తూ ప్రకటనలు ఇచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇక్కడ ప్రధానంగా ఆలోచన ,ఆచరణ చేసే విషయం ఏమిటంటే ఏ కార్యాలయం అయినా ఏ పని అయినా ఒక ప్రభుత్వ అధికారి కానీ ప్రవేటు కంపెనీ కానీ ప్రజా ఉపయోగాల కోసం చేస్తున్నపుడు ప్రతిదీ కూడా కాగితం రూపంలో ఉంటుంది. పలాన పని పై విదంగా …ఆ నిమిత్తం ఇలా విచారణ చేయడం జరిగిందని ఇందులో వాస్తవాలు ఇలా ఉన్నాయని పుస్తకం సమాధానం చెప్పే విధంగా ఉండడం అనేది ఆయా శాఖల అధికారుల పారదర్శక పాలన కు నిదర్శనంగా ఉంటుందనేది బహిరంగ సత్యం.కానీ ఒక్క సమాచార శాఖ డైరెక్టరేట్ కార్యాలయం లో మాత్రమే నియంత పాలన అనాలో లేక లెక్కలేని తనమో లేక ఇంకేదయినా అనాలో తెలియదు కానీ ఒక ఆరోపణ,విమర్శ వస్తె అవి కూడా ఆధారసహితంగా ఉన్నా కూడా ఈ అధికారుల నుంచి కనీస చర్యలు కానీ సమాధానం చెప్పే పరిస్థితి లేక పొగ పలానా వ్యక్తి ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రతిపక్ష పార్టీ నేతల బంధువని,లేదా బ్లాక్ మెయిల్,వైట్ మెయిల్ ,లేదా గాలి మాటలని,గాలి వార్తలని నిస్సిగ్గుగా ఉన్నతాధికారులను కూడా బురిడి కొట్టించి ఐఏఎస్ లను కూడా చివరికి పత్రికల వారి దృష్టిలో చెడు భావన కలిగే విధంగా చేయడం ఈ శాఖ అధికారులకే చెల్లుబాటు అయినట్లు ఈ రాష్ట్రం లో ఉన్న ఏ ఇతర శాఖల కు వర్తించదని చెప్పడం లో సందేహం అక్కర్లేదు.
ఈ విషయాలపై వివరణ కోరినా లేక కింది స్థాయి సిబ్బందిని అడిగినా ఎవరి వారి వారి స్వలాభం కోసం ఫోన్ పే క్యాస్ పే ఇలా జేబులు నింపుకుంటూ చెప్పేది శ్రీరంగ నీతులు చేసేది …. అన్నట్లు గా పరిస్థితి దాపురించిందని చెప్పక తప్పదు.
ఇక పోతే మేడం స్వర్ణలత పరిపాలన స్వర్ణయుగంలా చేసుకుని చివరి పది రోజుల్లో నిస్సిగ్గుగా అడ్డగోలుగా అర్హత అన్న మాట లేకుండానే అడిగేవాడు లేడన్న రీతిలో మేడంతో లాలూచీ పడ్డ వారికి ఎంప్యానల్మెంట్ చేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయాలని చూసిందని కొంతమంది హైకోర్టు లో రిట్ పిటిషన్ దాఖలు చేస్తూ గతంలో లోకాయుక్తా లో కేసు విచారణ ఉన్నా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సమాచార శాఖ ప్రధాన కార్యదర్శి, సమాచార శాఖ డైరెక్టర్ , విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు పిర్యాదు చేసిన ఈ సమాచార శాఖ అధికారులకు నిమ్మకు నీరెత్తినట్లు ఉందని కూటమి ప్రభుత్వం వచ్చాక ఇరవై మూడు పత్రికల నుంచి నేటి వరకు ప్రకటన ద్వారా లబ్ది పొందుతూ ఉన్న వారి పత్రికలపై సిబిఐ లేదా విజిలెన్స్ అధికారులు ద్వారా సమగ్ర విచారణ జరిపి ప్రింటింగ్ పత్రికల ముసుగులో డిజిటల్ జిరాక్స్ పేపర్స్ ఇస్తూ లోపాయి కారి ఒప్పందం కుదుర్చుకున్న అధికారుల అవినీతి బాగోతం బట్టబయలు చేసి తగిన చర్యలు తీసుకుని నాల్గో స్తంభం ముసుగులో దోపిడీ చేస్తున్న వారిని కూడా శిక్షించాలని అసలు రెగ్యులారిటీ విషయం లో పేపర్ ప్రింటింగ్ ప్రెస్ ద్వారా ముద్రణ అయ్యిందా లేదా అన్న నిర్ధారణ కోసం పీఆర్జీ ఐ డైరెక్టర్ ను కూడా పార్టీని చేసినట్లు కూడా తెలుస్తోంది.మరి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పు ఏ విధంగా ఉండబోతుందనేది వేచిచూడక తప్పదు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article