సంగీత దర్శకుడు
టివి రాజు జయంతి
జయ కృష్ణా
ముకుందా మురారి..
జయ గోవింద
బృందా విహారీ..
ఈ పాట తెలుగింట జేగంట..
ఆడవే జలకమ్ములాడవే..
కలహంసలాగ..
జలకన్యలాగ..
ఆడవే..ఆడవే..
ఈ పాట తెలుగు
సంస్కృతీ వైభోగం..
స్వాగతం..స్వాగతం
కురుసార్వభౌమా స్వాగతం..
ఈ పాట రసరమ్యం..
చెప్పాలని ఉంది..
దేవతయే దిగివచ్చి మనుషులలో కలసిన
కథ చెప్పాలని ఉంది..
ఈ పాట మెలోడీకి
పెట్టింది పేరు..
ఎంతవారు గాని
వేదాంతులైన గాని
వాలుచూపు సోకగానే
తేలిపోదురోయ్..
కైపులో..కైపులో..
ఈ పాట మాంచి ఊపులో..
మహ్మద్ రఫీ గొంతులో..
ఇలాంటి ఎన్నో
సుమధుర గీతాలు..
మన మధురగతాలు..
తెరచిన రసరాజు
టి వి రాజు..
ఎన్టీఆర్ సొంత చిత్రానికి
క్లాప్ కొడితే
టివి రాజు
తబలా భలే భలే
మోగినట్టే..
వినవయ్యా రామయ్యా..
ఏమయ్యా భీమయ్య..
మన మాటే గెలిచిందయ్య..
మన మంచే నిలిచిందయ్యా..
మరునాటి నందమూరి విజయాన్ని ఒకనాడే ఊహించి కొట్టిన డప్పు..
అదిరిపోయిన
టివి రాజు సెటప్పు..
దానికి తగిన రామారావు
స్టెప్పు..జయలలిత గెటప్పు..
సాంఘికం కథానాయకుడు..!
నీలాల నింగి మెరిసిపడే
నిండు చందురుడా..
నిరుపేదకలువ
వేచెనని మరచిపోదువా..
జానపదం ఆయన
హిట్టు పథం..
ఎన్నాళ్ళు వేచేను ఓ రామా
నీకు ఇకనైన
దయరాద శ్రీరామ..
పౌరాణికం ఆయన తొలిమెట్టు..
ప్రతి పాటా ఒక కనికట్టు..!
ఎన్నో పాటల విందు..
టివి రాజు కొడితేనే హిట్టు..
గోపాల బాల నిన్నే కోరి
నీ సన్నిధి చేరి
నీ చుట్టూ తిరుగుతు ఉంటానే…
ప్రతి అభిమాని
ఆయన పాట చుట్టూ..
గోపస్త్రీ పరివేష్టితో
విజయతే గోపాల చూడామణి..
రాజు వెళ్ళినా
అలా వెంటాడుతూనే ఉంది
ఆయన బాణీ..!
సురేష్..9948546286
7995666286

