Saturday, November 8, 2025

Creating liberating content

టాప్ న్యూస్కూటమిలో కాక రేపుతున్న కొలికపూడి ..?

కూటమిలో కాక రేపుతున్న కొలికపూడి ..?

ఆది నుంచి వివాదాస్పదుడి గానే ముద్ర

  • ప్రతిపక్ష మే కాదు సొంత పార్టీ నేతలపైన వెనుకాడని వైనం
  • 16 నెలల్లో ఎన్నో పొరపెచ్చులు….
  • నాడు ఎంపీ చిన్ని నే సమస్య పరిస్కారుకుడు…
  • నేడు చిన్నీనే అసలు సమస్య అంటూ విమర్శలు. .
  • సంచలనం లేపుతున్న కొలికపూడి వ్యాఖ్యలు
  • అధిష్టానం ఆదేశాలు పట్టించుకోని వైనం
  • తాను చెప్పాలనుకున్నది చెప్పడమే …
  • రేషన్ మాఫియా డాన్ రామచంద్రుడి దే నిజమే…
    *కూటమి కి కొరకరాని కొయ్యగా కొలికపూడి మారాడా..
    *మొదటిసారే ఇలా అయితే ఇక ఇదే చివరి సారి కానుందా
    *నాడు ఓ తహసీల్దార్ పై యుద్ధమే చేశారు
    *సర్పంచ్ నే . చె… కొడతానన్నారు
    *నేడు ఎంపీ చిన్నికే చీవాట్లు పెడుతున్నారు…
    *అధిష్టానంకు అంతుచిక్కని వైనం
  • ఎంపీ చిక్కుల్లో పడినట్లేనా..
  • ఎవరి దారి వారిది….ఎడారిది ప్రజల దారి..
  • రసకందాయంలో తిరువూరు రాజకీయాలు
    (రామమోహన్ రెడ్డి)
    కొలిక పూడి శ్రీనివాస రావు .ఈ పేరు ఉభయ తెలుగు రాష్ట్రాలకే గాక ప్రపంచంలో ఉన్న తెలుగువారికి పరిచయం అక్కర్లేనిది. ఎందుకంటే
    2019 సార్వత్రిక ఎన్నికల్లో నవ్యాంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళ నుంచి అలుపెరుగకుండా అనేక వేదికల ద్వారా అమరావతి అభివృద్ధి అనే అజెండాను ఈయన భుజస్కంధాలపై వేసుకుని అప్పటి ప్రభుత్వం పై దుమ్మెత్తిపోశారు. ఒకానొక దశలో మీడియా వేదిక గా బిజెపి నేతపై చెప్పేత్తి కొట్టారు.అది ఆనాడు ఆవేదన అనుకున్నారు అందరూ.కానీ అదే ఆవేశం ఇప్పుడు కూడా ఉండటం తో అధిష్టానం ఆలోచన లో పడ్డది.వివేకవంతుడైనా వారికే ఎమ్మెల్యే సీటు ఇచ్చినా ఇంత అవివేకం గా తయారు కావడం దేనికీ అన్న ప్రశ్న అధిష్టానం మనసులో కలచి వేయడం అనేక మార్లు హెచ్చరికలు, సర్దుబాటు అయ్యి ఒకానొక దశలో ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం కొలికపూడి ని దూరం పెట్టారన్నది వాస్తవం.పట్టుమని పదహారు నెలల పాలనలో ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు. మరెన్నో వివాదాలు.పాలిచ్చే అవును వదులుకుని తన్నే ఎద్దును తెచ్చుకున్నా మా అన్న ధోరణిలో అధిష్టానం ఆలోచన లో పడ్డ చేసేదేమి లేక కొనసాగిస్తున్నట్లుగా ఉన్నారన్నా అపవాదు కూడా కొలికపూడి మూటగట్టుకుంటున్నారున్న అనుమానాలు ఇప్పటికే వ్యక్తమయ్యాయి
    .ఎందుకిలా అని వివరాల్లోకి వెళితే
    కూటమిభాగస్వామ్యం లో టీడీపీ తరపున తిరువూరు నుంచి గెలిచారు కొలికపూడి.గెలిచిన తొలినాళ్లలో నే జేసీబీ ఎక్కి అక్రమ నిర్మాణాలు అంటూ స్వయంగా కూల్చివేయడం జరిగింది. ఆ తరువాత నియోజకవర్గ పరిధిలో రేషన్ మాఫీయా లారీలను అప్పుతున్నారని పలువురు యూట్యూబర్లను అరెస్ట్ చేయించడం జరిగింది. ఆతరువాత తిరువూరు నుంచి తరలిస్తున్న అక్రమరేషన్ లారీలను ఏ కొండూరు వద్ద ఆపిన కొంతమంది యూట్యూబర్లను కొట్టిన సంఘటన వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తరువాత క్వారీ తవ్వకాలపై ఓ దిన పత్రిక (ప్రజా భూమి కాదు) కథనాలను ప్రచురించిందని నోరుపారేసుకోవడం సంచలనం గా మారింది.ఇక ఓ సర్పంచ్ పేకాట లో దొరికాడని నానా భూతులు మాట్లాడటం ఆ సర్పంచ్ భార్య ఆత్మహత్య యత్నం చేయడం పెనుదుమారం రేపింది. తిరువూరు అభివృద్ధి కి పత్రికా కథనాలే కారణమని అనడం ఒక విదంగా చాలా హాస్యాస్పద విషయంగా నాడు మారింది.ఎందుకంటే పత్రికా కథనాలలో క్వారీ తవ్వకాలపై తప్పుడు రాతలు రాసారని ఒక వైపు అంటూనే ఇంకో వైపు తహసీల్దార్ కు పిర్యాదులు ఇస్తుంటే అభివృద్ధి ఆగిపోతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం ఆ తహసిల్దార్ పై ఆయనే కలెక్టర్ కు పిర్యాదు చేసి బదిలీ కూడా చేయించడం జరిగింది. నియోజకవర్గ అభివృద్ధికి అడ్డుపడితే అది సమాజ విరుద్ధం అవుతుందని ఆయన ఆవేదన చెందడం లో అర్థం ఉంది.కానీ సర్పంచ్ పేకాట ఆడితే,క్వారీ తవ్వకాలపై వార్తలు రాస్తే అభివృద్ధి ఆగిపోయిందని అనడం ప్రజలు ఫక్కున నవ్వుకున్నారు.పోనీ ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీ కాదుగా అమ్మో వార్తలు వస్తే అధికార పార్టీ వారు అడ్డుకుని రాద్దాంతం చేసి ఇబ్బందులు పెడతారు అనుకోవచ్చు.ఇక్కడ విచిత్రమేమిటంటే ఎమ్మెల్యే అధికార పార్టీనే అధికారులు కూడా ప్రబుత్వ ఆదేశాలు పాటించి తీరాల్సిందే.మరి అభివృద్ధి కి ఎక్కడ విఘాతం కలుగుతుందని అందరు కూడా ఆలోచన లో పడ్డారు.
    తిరువూరు రేషన్ డాన్ పరాయి జిల్లా నుంచి వచ్చి గత మంత్రి జోగి అనుచరిడిగా ఉంటూ పగలు రాత్రి లేకుండా అక్రమ రవాణా చేస్తుంటే అన్నామో రామచంద్ర అని మొత్తుకుంటుంటే కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా కొన్ని రోజులు ఆగినా ఆ తరువాత యదారాజ తదాప్రజా గా అన్నట్లు లారీలు జోరుగా తిరుగుతున్నా వారికే మద్దతు పలికినట్లుగా ఇప్పటికి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. .అందుకు నిదర్శనం ఆనాడు ఇబ్రహీంపట్నం పోలీసులు సీజ్ చేసిన లారీలే.ఆ తరువాత ఏ కొండూరు ,కంచికచర్ల పోలీసులు పట్టుకున్న లారీలు సాక్ష్యం. ఇవన్నీ కూడా తిరువూరు పరిధిలో నుంచి వస్తున్న అక్రమ రేషన్ బియ్యమే నన్న ఆరోపణలు వినిపించాయి..ఇలాంటి వాటిపై ఉక్కుపాదం మోపాల్సిన ఎమ్మెల్యే ప్రజాక్షేత్రం లో ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న ఉత్పన్నమయింది.దీనిపై ఆనాడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాద్ తో కూడిన టీడీపీ బృందం నియోజకవర్గ పరిధిలో చర్చలు జరిపి సమస్య ఉత్పన్నం కాకుండా సర్దుబాటు చేశారు.మళ్లీ మాజీ ఏఎంసీ చైర్మన్ రమేష్ రెడ్డి విషయంలో ఏకంగా రాజీనామా చేస్తానని హుకుం జారీ చేసి అధిష్టానం కు అల్టిమేటం ఇవ్వడం తో అధినాయకుడు తీవ్ర అసంతృప్తితో కొంత కాలం ముఖ్యమంత్రి దూరం పెట్టారనే విషయాలు బహిర్గతమయ్యాయి.నేడు అదే ఎంపీ కేశినేని శివనాధ్ పై చిర్రెత్తి పోయి సంచలన విషయాలు వెల్లడి చేయగా అయోమయంలో అధిష్టానం పడక తప్పని పరిస్థితి.
    రాష్ట్రంలో ఉన్న 1745 నియోజకవర్గాల లో 135 మంది ఉన్న టీడీపీ శాసన సభ్యులలో కేవలం ఒక తిరువూరు ఎమ్మెల్యే తీరు పార్టీకి చెడ్డ పేరు తెచ్చిపెడుతోందన్న భావన లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారన్న ఊహాగానాలు అనాడు వినిపించినా క్రమేణా సర్దుమణివి నట్టు గా భావించారు. బహిరంగంగానే ఓ మహిళా తనను అత్యాచారం చేశాడని కేసు పెట్టి దేశం మొత్తం సంచలనం గా మారిన సత్యవేడు నియోజకవర్గ పరిధిలో కూడా ఇలాంటి తల నొప్పుల పార్టెకి రాలేదు.కానీ తిరువూరు నియోజకవర్గ పరిధిలో అక్రమ మైనింగ్,ఇసుక, పిడిఎస్ రైస్ ల దందాలో వాటాల దగ్గర తేడాలు వచ్చి ఇలా జరుగుతున్నాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతుండగా ,ఇప్పటికీ నకిలీ మద్యం ములకల చెరువు ,ఇబ్రహీం పట్నం వ్యవహారం కూటమి ప్రభుత్వానికి కొంత ఇరకాటంలో పెట్టె సమస్య గా ఉన్న నేపద్యంలో ప్రతిపక్ష పార్టీల విమర్శలకు గట్టి గా ఊతం మిచ్చెలా కొలికపూడి వ్యాఖ్యలు ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.అది కూడా టిడిపి అనుకూల మీడియా గా ముద్ర వేసుకున్న ప్రముఖ ఛానెల్ ద్వారా సంచలన ఆరోపణలు చేయడం చూస్తుంటే కొలికపూడి వ్యవహారం తీవ్రస్థాయిలోనే ఉందనే చెప్పాలి. స్వాతంత్ర్యము వచ్చినప్పటి నుంచి బడుగు బలహీన వర్గాలకు చెందినవారు రాజకీయాలలో ఏ పదవిలో ఉన్న అగ్రవర్ణ కులస్తుల ఆధిపత్యమే అక్కడ చెల్లుబాటు కావడం సర్వసాధారణం అన్న విషయం అందరికి తెలిసిందే.దీనిని దృష్టిలో ఉంచుకుని అందరిలో మెలిగిన నాయకుడే చివరికి రాణిస్తాడన్నది తెలుసుకోగలిగితే ఆ నాయకుడు మనుగడ సాధిస్తారన్నది నిత్యాసత్యం.ఈ నేపధ్యంలో కొలికపూడి కథలో ఎక్కడ తేడా వచ్చింది ఈ కథకు ముగింపు ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాఫిక్.ఏది ఏమైన ఈ రాష్ట్రంలో కొంతమంది నేతల తీరు వల్ల కూటమి ప్రభుత్వం కీ కొంత చెడ్డ పేరు మూటగట్టుకోక తప్పదనే వాదన విజ్ఞులైన వారి నుండి వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article