Monday, April 13, 2026

Creating liberating content

తాజా వార్తలుఎక్కడికీ పారిపోలేదు.. ఇంట్లోనే ఉన్నా.. : నటి కస్తూరి

ఎక్కడికీ పారిపోలేదు.. ఇంట్లోనే ఉన్నా.. : నటి కస్తూరి

అరెస్టుకు భయపడి తాను పారిపోయినట్టు మీడియా, సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపై సినీ నటి కస్తూరి వివరణ ఇచ్చారు. ఆమెను చెన్నై ఎగ్మోర్ పోలీసులు అదుపులోకి తీసుకోకముందే ఒక వీడియోను రికార్డు చేశారు. ఈ వీడియోను ఆదివారం రాత్రి విడుదల చేశారు. ఇందులో తానెక్కిడికీ పారిపోలేదని చెప్పారు. ఎలాంటి భయం లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలోని తన ఇంట్లోనే ఉన్నానని, షూటింగ్ కోసమే హైదరాబాద్ వచ్చానని పేర్కొన్నారు. రోజూ షూటింగుకు వెళ్ళి వస్తున్నానని తన మొబైల్ ఫోన్‌ను న్యాయవాదికి ఇచ్చానని, పోలీసులకు పూర్తిగాసహకరిస్తానని, ఇపుడు కూడా ఎగ్మోర్ పోలీసులతో తనకు తానుగా వెళుతున్నట్టు నటి కస్తూరి ఆ వీడియోలో పేర్కొన్నారు. ఆదివారం చెన్నై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి చెన్నై పుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article