Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలుఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ షాక్.. నలుగురు మృతి

ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ షాక్.. నలుగురు మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో విషాదకర ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో నలుగురు యువకులు మృత్యువాతపడ్డారు. మృతులను కృష్ణ, నాగేంద్ర, మణికంఠ, వీర్రాజుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం ప్లెక్సీలు కడుతుండగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ప్లెక్సీలు కడుపుతున్న సమయంలోపైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి గ్రామానికి చెందిన నలుగురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గ్రామానికి చెందిన కృష్ణ, నాగేంద్ర, మణికంఠ, వీర్రాజు అనే వారిగా గుర్తించారు. మరొకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article