Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుఉత్తమ గైడ్ కు మంత్రి చేతుల మీదుగా అవార్డు

ఉత్తమ గైడ్ కు మంత్రి చేతుల మీదుగా అవార్డు

లేపాక్షి: ప్రపంచ పర్యాటక చిత్రపటంలో పేరెన్నిక గన్న లేపాక్షి వీరభద్రాలయంలో అనేక సంవత్సరాలుగా గైడ్ గా పనిచేస్తున్న విరుపన్న రాష్ట్రస్థాయిలో ఉత్తమ గైడ్గా ఎంపికయ్యారు. పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని విరుపన్నకు విజయవాడలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి చేతుల మీదుగా ఆయన ప్రశంసా పత్రంతోపాటు మెడల్ ను అందుకున్నారు. విరుపన్న వీరభద్రాలయంలో అనేక సంవత్సరాలుగా తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో పర్యాటకులకు ఆలయ చరిత్రను వివరిస్తున్నారు. వేలాది మంది పర్యాటకులు విరుపన్న వివరిస్తున్న ఆలయ చరిత్రను తెలుసుకోవడంతో పాటు మరికొంతమందికి పర్యాటకులే వివరించడం జరుగుతుంది. ఆలయ చరిత్ర పై గైడ్ విరూపన్నకు సంపూర్ణ అవగాహన ఉన్నది. ఈ కారణాలవల్ల రాష్ట్రస్థాయిలో గైడ్గా ఎంపికయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article