జనరంజకుడి పధకాలతో ఇంటింటికీనాయక గుణం
తుని:జోరుగా…హుషారుగా తొండంగి మండలంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతుంది.సీనియర్ నేత యనమల రాజేష్ సారధ్యంలో కూటమి నేతలు పల్లె పల్లెలోనూ చంద్రబాబు వందరోజుల పాలనలో
అమలు జరుగుతున్న జనరంజక
పధకాలను వివరిస్తున్నారు. విజయోత్సవాలను తలపించే రేంజ్ లో ఇది మంచి ప్రభుత్వం తొలిరోజు కార్యక్రమం సూపర్ హిట్ అయింది.యనమల రాజేష్ ఆధ్వర్యంలో తొండంగి మండలం తొండంగి,పైడికొండ,కోదాడ,వేమవరం,పెరుమాళ్ళపురం,తదితర గ్రామాల్లో పర్యటించిన కూటమి నేతలు చంద్రబాబు వంద రోజుల పాలనలో అమలులోకివచ్చి నపధకాలను వివరించారు ఈకార్యక్రమంలో కొయ్యా కేశవ్, బంటుపల్లి అన్వేష్,నేమాల కృష్ణ,జాగు గోవిందు,మేడిశెట్టి శ్రీను
బూర్తి సింహాచలం, తదితరులు పాల్గొన్నారు.రెండవ రోజు గోపాలపట్నం, కృష్ణాపురం, ఒంటి మామిడి,ఎర్రయ్యపేట గ్రామాల్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది.అదేవిధంగా తుని మండలం అగ్రహారం, వల్లూరు, కొత్త సీతయ్య పేట గ్రామాల్లో సీనియర్ నేతలు సుర్ల లోవరాజు, చింతంనీడి అబ్బాయి అధికార్లతో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం పాల్గొని జనరంజకుడు చంద్రబాబు అమలుచేస్తున్న పధకాలు వివరించారు.అప్పన రమేష్, పోలిశెట్టి రామలింగేశ్వర రావు స్థానిక నాయకులు పాల్గొన్నారు.అదేవిధంగా కోటనందూరు
మండలంలో గాడి రాజబాబుఆధ్వర్యంలో ఇది మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతోంది