Sunday, February 15, 2026

Creating liberating content

సినిమాలిప్ చుట్టూ బ్యాండేజ్ తో.. మంచు లక్ష్మి

లిప్ చుట్టూ బ్యాండేజ్ తో.. మంచు లక్ష్మి

తాజాగా మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌లో లో షేర్ చేసిన ఓ ఫోటో.. అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఆమె ఫేస్ మీద లిప్ చుట్టూ బ్యాండేజ్ తో.. మంచు లక్ష్మి ఓ ఫోటోను షేర్ చేశారు. ఆ తర్వాత దానికి సంబంధించి అందరికి తెలిసేలా ఈ ఇంపార్టెంట్ మెసేజ్ ను కూడా అందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో లో లక్ష్మి మంచు ఇలా చెప్పుకొచ్చారు. ఆమె ఇటీవల అమెరికా వెళ్ళినప్పుడు సాధారణ జ్వరం టాబ్లెట్ తీసుకుందట. అది వికటించి పెదవులు ఉబ్బిపోయి, కింది పెదవి కింద చర్మం మొత్తం రాష్ వచ్చిందట. ఇప్పుడు తగ్గిందట. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.“మన బాడీ ఏది యాక్సెప్ట్ చేస్తుందో.. చేయలేదో అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. నేను ఒక కామన్ పిల్ తీసుకోవడం వలన.. కొన్ని సెకండ్స్ లోనే నా లిప్ చుట్టూ ఎలెర్జి ఫామ్ అయింది. వీలైనంత త్వరగా నా ఫ్రెండ్స్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకున్నాను కాబట్టి.. రికవర్ అవుతున్నాను. లేదంటే బాడీ అంత ఎలెర్జి స్ప్రెడ్ అయ్యేది. ఎలెర్జి ఉందని తెలియక చిన్న పిల్స్ తీసుకుని చనిపోయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి మీ శరీరానికి ఏది పడుతుంది ఏది పడదు అని టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే.. పిల్స్ తీసుకుని జాగ్రత్తగా ఉండండి” అంటూ తన రికవర్ అయినా తర్వాత ఫొటోస్ ను కూడా షేర్ చేశారు మంచు లక్ష్మి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article