తెలంగాణ స్థానికత ఉన్న 122 మంది ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు ఇకపై తెలంగాణలో పని చేయనున్నారు. కాగా, రిలీవ్ అవుతున్న వారు తమ క్యాడర్ చివరి స్థానంలో ఉంటారని చెప్పడం, అందుకు ఉద్యోగులు అంగీకరించడంతో వారిని రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

