సీఎం చంద్రబాబు ప్రస్తుతం అమరావతిలో పర్యటిస్తున్నారు. గత ప్రభుత్వం నిర్ణక్ష్య చేసిన రాజధాని ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. గతంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతమైన ఉద్దండరాయనిపాలెంలో చంద్రబాబు పరిశీలించారు. మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో చంద్రబాబు మోకాళ్లపై కూర్చొని నమస్కారం చేశారు. అనంతరం అక్కడ మరోసారి పూజలు చేశారు.దీంతో పాటుగా అమరావతిలోని పలు ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వ విధ్వంస విధానాలకు నాంది అయిన ప్రజావేదిక శిథిలాలను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. అనంతరం గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో కట్టిన ప్రభుత్వ ప్రతినిధుల క్వార్టర్స్ వద్దకు కూడా చంద్రబాబు వెళ్లారు. సీడ్ యాక్సెస్ రోడ్, అసంపూర్తిగా మిగిలిన ఆల్ ఇండియా ఉద్యోగులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు

