వి.ఆర్.పురం :జాతీయ సీక్కెల్ సెల్ ఎనిమియా డే సందర్భంగా వైద్యులు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో రేఖపలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి రేఖపల్లి కె జి బి వి స్కూల్ వరకు బుధవారం అవగాహనా ర్యాలీ నిర్వహించారు. అలాగే మండలంలోని ప్రతి హెల్త్ వెల్ నెస్ సెంటర్ నందు కూడా ర్యాలీ లు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల వద్ద సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో రేఖపల్లి ప్రభుత్వ వైద్యులు అనిల్ కుమార్ మాట్లాడుతూ సీక్కెల్ సెల్ ఎనిమియా అనేది వరసత్వం నుండి కానీ, రక్త హీనత వలన కానీ వస్తుందని, ఇందులో మనలో ఉండవలసిన రక్తాకణాలు గుండ్రంగా ఉండకుండా అర్ద చందకరం (కొడవలి )ఆకారం కి మారిపోతాయి, కావున మన రేఖపల్లి పిహెచ్సి పరిధిలో కానీ, హెచ్ డబ్ల్యు సి సెంటర్ నందు ఈ టెస్టులు చేయబడునని, వీటి యొక్క లక్షణాలు రక్తకణాలు సంఖ్య తగ్గిపోవటం, కళ్ళు పసుపు రంగులో మారటం, తీవ్రమై నా ఒళ్ళు నొప్పులు, కిళ్ల నొప్పులు శ్వాస తీసుకోవటం లో ఇబ్బంది, అలసట గర్భధారణ సమయములో సమస్య లు వంటి లక్షణాలు ఉంటాయి అని తెలిపారు. ఈ వ్యాధి నిర్ములన కొరకు ప్రభుత్వం చేయుచున్న కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు పాల్గొని ప్రజలకు అవగాహనా కల్పించుటలో భాగస్వామ్యులు కావాలని ఆయన కోరారు. ఈకార్యక్రమం లో పి హెచ్ ఎన్ భద్రకాళి, హెచ్ వి పున్నమ్మ, సూపెర్వైజర్ వెంకట లక్ష్మి, ఏ ఎన్ ఎం పార్వతి, హెల్త్ అసిస్టెంట్స్ శ్రీనివాస్, సత్యనారాయణ, రామారావు ఆశలు అంగన్వాడీ టీచర్స్ స్కూల్ టీచర్స్ పిల్లలు పేరెంట్స్ పాల్గొన్నారు.


